te_tw/bible/other/persecute.md

5.6 KiB

హింసించు, హింసించబడెను, హింసించబడుట, హింస, హింసలు, హింసకుడు, హింసకులు

నిర్వచనము:

“హింసించు” మరియు “హింస” అను పదములు ఒక వ్యక్తినిగాని లేక ఒక నిర్దిష్ట జనాంగమునుగాని వారికి హాని కలిగించు కఠినమైన విధానములో నిరంతరముగా శిక్షించుటను సూచిస్తుంది.

  • హింస అనునది ఒక వ్యక్తికిగాని లేక అనేకమందికిగాని విరుద్ధముగా చేసేది మరియు ఈ క్రియలో తరచుగా దాడులు చేయడము ఇమిడియుంటుంది.
  • ఇశ్రాయేలియులు అనేక విభిన్నమైన జనుల గుంపుల ద్వారా హింసించబడిరి మరియు దాడి చేయబడిరి, చెరగొనిపోబడిరి మరియు వారినుండి అనేకమైనవాటిని దొంగలించిరి.
  • జనులు అనేకమార్లు బలహీనులైన ఇతరుల మీదను లేక ఇతర నమ్మకాలను కలిగినవారి మీదను దాడి చేసి హింసించుదురు.
  • యూదా మత నాయకులు యేసును హింసించిరి, ఎందుకంటే ఆయన బోధించుచున్న సంగతులను వారు ఇష్టపడలేదు.
  • యేసు వెనుదిరిగి పరలోకమునకు వెళ్లిన తరువాత, యూదా మత నాయకులు మరియు రోమా ప్రభుత్వము ఆయన అనుచరులను హింసించిరి.
  • “హింసించు” అనే పదమును “ఒత్తిడి చెస్తూ ఉండు” లేక “కఠినముగా నడుచుకో” లేక “నిరంతరముగా తప్పుగా నడుచుకో” అని కూడా తర్జుమా చేయవచ్చు.
  • “హింస” అను పదమును అనువదించుటలో “కఠినముగా కష్టమును కలిగించడం” లేక “ఒత్తిడికి గురిచేయడము” లేక “నిరంతరమూ బాధపడుతూ ఉండడం” అను మాటలు కూడా ఉంటాయి.

(ఈ పదములను ఒకసారి చూడండి: క్రైస్తవుడు, సంఘము, పిడించు, రోమా)

పరిశుద్ధ గ్రంథములోని అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 33:02 “బండ నేల అనునది దేవుని వాక్యమును విని, దానిని ఆనందముగా అంగీకరించు వ్యక్తిని పోలియుండును. అయితే ఆ వ్యక్తి కఠినమైన శ్రమలు వచ్చినప్పుడు లేక హింసను పొందినప్పుడు, అతడు పడిపోవును.”
  • 45:06 ఆ దినమున యెరూష లేములోని అనేకమంది ప్రజలు యేసు అనుచరులను హింసించుదురు, ఇందువలన అనేకమంది విశ్వాసులు ఇతర ప్రాంతములకు పారిపోవుదురు.
  • 46:02 “సౌలా! సౌలా! నన్నేల నీవు హింసించుచున్నావు ?” అని ఎవరో చెప్పుట సౌలు వినెను. “నివేవరు బోధకుడ?” అని సౌలు అడిగెను. “నేను నీవు హింసించుచున్న యేసును!” అని యేసు చెప్పెను.
  • 46:04 అయితే, “బోధకుడా, ఈ మనుష్యుడు విశ్వాసులను హింసించువాడని నేను వినియున్నాను” అని అననీయ చెప్పెను.

పదం సమాచారం:

  • Strong's: H1814, H4783, H7291, H7852, G1375, G1376, G1377, G1559, G2347