te_tw/bible/other/interpret.md

2.8 KiB

వివరించు, వివరించిన, వివరణ, వివరణకర్త

వాస్తవాలు:

“వివరించు” “వివరణ" మొదలైన మాటలు స్పష్టం కాని దాన్ని అవగాహన కోసం దేని అర్థం అయినా వివరించే విషయాన్నీ సూచిస్తున్నది.

  • తరచుగా బైబిల్లోఈ పదాలను కలలు, లేక దర్శనాలు మొదలైన వాటి అర్థం చెప్పడానికి ఉపయోగిస్తారు.
  • బబులోను రాజుకు కొన్ని కలవరపరిచే కలలు వచ్చినప్పుడు దేవుని సహాయంతో దానియేలు వాటి అర్థాలు వివరించాడు.
  • కలను "వివరించుట" అంటే "ఆ కల అర్థం చెప్పడం."
  • పాత నిబంధనలో, దేవుడు భవిషత్తులో ఏమి జరుగుతుందో మనుషులకు వెల్లడించడానికి కొన్ని సార్లు కలలు ఉపయోగిస్తాడు. ఈ కలల వివరణలే ప్రవచనాలు.
  • "వివరించు" అనేది ఆకాశం ఎలా ఉంది, గాలి ఎంత వేడిగా ఉంది అనే వాటిని బట్టి ఇతర విషయాలు ఊహించడం.
  • "వివరించు" అనే దాన్ని అనువదించే పద్ధతులు, "అర్థం గ్రహించేలా చెయ్యడం” లేక “వివరిరించడం” లేక “అర్థం చెప్పడం."
  • "వివరణ" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "వర్ణించడం” లేక “అర్థం చెప్పడం."

(చూడండి: బబులోను, దానియేలు, కల, ప్రవక్త, దర్శనం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H995, H3887, H6591, H6622, H6623, H7667, H7760, H7922, G1252, G1328, G1329, G1381, G1955, G2058, G3177, G4793