te_tw/bible/other/hand.md

6.4 KiB

చెయ్యి, చేతులు, చేతితో, చేతులు ఉంచి, తన చెయ్యి ఉంచి, కుడి చెయ్యి, కుడి చేతులు, చేతి నుంచి

నిర్వచనం:

బైబిల్లో అలంకారికంగా "చెయ్యి " అనే మాటను అనేక రకాలుగా ఉపయోగిస్తారు:

  • దేన్నైనా ఎవరినైనా ఒక వ్యక్తి చేతుల్లో పెట్టడం.
  • "చెయ్యి" ని తరచుగా దేవుని శక్తి, చర్య వంటి వాటికోసం ఉపయోగిస్తారు. దేవుడు "నా చెయ్యి వీటన్నిటినీ చెయ్యలేదా?" (చూడండి: అన్యాపదేశం)
  • "అప్పగించడం” లేక “ఒకరి చేతిలో పెట్టడం" అంటే ఎవరినైనా మరొకరి అదుపులో శక్తి కింద ఉంచడం.
  • అలంకారికంగా "చెయ్యి " అనే మాటను ఇలా కూడా వాడతారు:
  • "చేతులు వేసి" అంటే "హాని" చెయ్యడం.
  • "చేతినుండి రక్షించు" అంటే ఎవరినైనా వేరొకరి వల్ల హాని కలగకుండా కాపాడు.
  • "కుడి చేతి వైపు" అనే హోదా "కుడి పక్క.”
  • “చేతితో" అంటే ఎవరిమీదనైనా చర్య తీసుకోవడం. ఉదాహరణకు, "ప్రభువు చేతితో" అంటే ప్రభువు దేన్నైనా సంభవించేలా చేయడం.
  • ఎవరిమీదనైనా చేతులు ఉంచడం అంటే ఆ వ్యక్తిపై ఆశీర్వాదం పలకడం.
  • "చేతులు ఉంచడం" అంటే చెయ్యి ఒక వ్యక్తిపై ఉంచి అతన్ని దేవుని సేవకు ప్రతిష్టించు, లేక ఆ వ్యక్తి స్వస్థతకై ప్రార్థించు.
  • పౌలు "నా చేతితో రాసిన” అంటే ఉత్తరంలో ఆ భాగం అక్షరాలా తాను స్వంతగా రాశాను అని. ఎవరికైనా చెబితే రాయడం కాదు.

అనువాదం సలహాలు

  • ఈ మాటలు ఇతర అలంకారిక ప్రయోగాలూ ఇదే అర్థం ఇచ్చే ఇతర అలంకారిక పదాలు ఉపయోగించి అనువదించ వచ్చు. లేక అక్షరార్థంగా భాష అర్థం వచ్చేలా నేరుగా అనువదించ వచ్చు (పై ఉదాహరణలు చూడండి).
  • " పుస్తకం చుట్టఅందించడం" అనే మాట ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అతనికి పుస్తకం చుట్ట ఇచ్చాడు” లేక “పుస్తకం చుట్ట తన చేతిలో పెట్టాడు." అతనికి మొత్తంగా ఇవ్వలేదు, కేవలం తాత్కాలికంగా అప్పటికి మాత్రం ఇచ్చారు.
  • "చెయ్యి" అనేది ఆ వ్యక్తిని సూచిస్తున్నది. "దేవుని చెయ్యి ఆ పని చేసింది" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుడు చేశాడు."
  • "వారి శత్రువుల చేతులకు అప్పగించిన” లేక “వారి శత్రువుల వశం చేసిన," ఇలా అనువదించ వచ్చు, "వారి శత్రువులు వారిని ఓడించేలా అనుమతించడం” లేక “వారి శత్రువులు వారిని పట్టుకునేలా చెయ్యడం” లేక “వారి శత్రువులు వారిపై అదుపు సాధించేలా."
  • "చేతితో చనిపోవడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అతని చేతుల్లో హతం కావడం."
  • "కుడి చేతిపై" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కుడి వైపున."
  • యేసు "దేవుని కుడి వైపు కూర్చోవడం," ఒక ఉన్నత ప్రతిష్ట, సమాన అధికారం, అనే అర్థంతో ఉపయోగిస్తారు. లేక కొద్దిగా వివరణ ఇవ్వవచ్చు: "దేవుని కుడి వైపు, అత్యున్నత అధికార స్థానంలో."

(చూడండి: ప్రత్యర్థి, దీవించు, బందీ, ప్రతిష్ట, శక్తి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H405, H2026, H2651, H2947, H2948, H3027, H3028, H3225, H3231, H3233, H3709, H7126, H7138, H8040, H8042, H8168, G710, G1188, G1448, G1451, G1764, G2021, G2092, G2176, G2902, G4084, G4474, G4475, G5495, G5496, G5497