te_tw/bible/other/captive.md

3.8 KiB
Raw Permalink Blame History

బందీ, బందీలు, బంధించు, బంధించబడిన, చెర

నిర్వచనం:

"బందీ” “చెర" అనే పదాలు ప్రజలను పట్టుకుని వారు ఇష్టపడని చోట అంటే వారిని ఓడించిన దేశంలో వారు నివసించేలా బలవంతం చేయడం.

  • యూదా రాజ్యంలోని ఇశ్రాయేలీయులు బాబిలోనియాలో 70సవత్సరాలు చెరలో ఉన్నారు.
  • బందీలు తరచుగా తమను పట్టుకున్న జాతి కోసం వెట్టి చాకిరీ చెయ్యవలసి ఉంటుంది.
  • దానియేలు, నెహెమ్యా ఇశ్రాయేలు బందీలు, వారు బాబిలోనియా రాజు దగ్గర పని చేశారు.
  • "చెర పట్టు"అనే మాట ఎవరినైనా బంధించడాన్ని సూచించే వేరొక పదం.
  • "బందీలుగా కొని పోవడం" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "బందీలుగా ఉండేలా బలవంతం చెయ్యడం” లేక “మరొక దేశానికి ఖైదీలుగా తీసుకుపోవడం."
  • అలంకారికంగా చూస్తే అపోస్తలుడు పౌలు క్రైస్తవులకు ప్రతి ఆలోచనను "చెరబట్టి"క్రీస్తుకు విధేయంగా చెయ్యమని చెప్పాడు.
  • ఒక వ్యక్తి పాపానికి ఎలా బందీ అవుతాడో కూడా చెప్పాడు. అంటే అతడు పాపం "అదుపులో"ఉంటాడు.

అనువాదం సలహాలు

  • సందర్భాన్ని బట్టి, "చెరలో ఉండడం"అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "స్వేచ్ఛ లేకుండా” లేక “చెరసాలలో ఉంచి” లేక “విదేశంలో ఉంచి."
  • "బందీగా కొనిపోవడం” లేక “చెర పట్టడం"ఇలా అనువదించ వచ్చు, "పట్టుకుని” లేక “చెరసాలలో బంధించి” లేక “విదేశంలో."
  • ఈ పదం "బందీలు"ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "చెర పట్టబడిన ప్రజలు” లేక “బానిస జాతి."
  • సందర్భాన్ని బట్టి, "చెర"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు., "ఖైదు చెయ్యడం” లేక “ప్రవాసం” లేక “విదేశంలో ఉండేలా బలవంతం."

(చూడండి: బబులోను, ప్రవాసం, చెరసాల, బంధించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1123, H1473, H1540, H1546, H1547, H2925, H6808, H7617, H7622, H7628, H7633, H7686, H7870, G161, G162, G163, G164, G2221