te_tw/bible/other/seize.md

4.0 KiB

పట్టుకొనుట, పట్టుకొనును, పట్టుకొనబడెను, పట్టుకోవడము

నిర్వచనము:

“పట్టుకొనుము” అనే ఈ మాటకు బలవంతము దేనినైనను లేక ఎవరినైనను చిక్కించుకోవడము లేదా వశముచేసుకోవడము అని అర్థము. ఈ పదమునకు ఎవరినైనా నియంత్రించుట మరియు వారిపై అధికారము చెలాయించుట అని అర్థము కూడా కలదు.

  • సైనిక బలగాలతో ఒక పట్టణమును పట్టుకొనినప్పుడు, సైనికులు అక్కడి ప్రజలు జయించిన ప్రజల విలువైన ఆస్తులను పట్టుకొందురు.
  • ఈ మాటను అలంకారప్రాయముగా ఉపయోగించినప్పుడు, ఒక వ్యక్తిని గూర్చి చెప్పినప్పుడు - “భయముతో పట్టుబడ్డాడు” అని చెబుతారు. ఈ మాటకు అర్థము ఏమనగా ఆ వ్యక్తి ఆకస్మికముగా “భయానికి గురయ్యాడు” అని అర్థము. ఒక వ్యక్తి “భయముతో పట్టుపడినట్లయితే” దానిని ఆ వ్యక్తి “ఆకస్మికముగా ఎక్కువ భయముకు గురయ్యాడు” అని చెప్పబడుతుంది.
  • స్త్రీని “పట్టుకున్నాయి” అని ప్రసవ సందర్భములో చెబుతూ ఉంటారు, ఈ మాటకు ఆమెకు వచ్చిన నొప్పులు ఆకస్మికముగా వచ్చాయని, ఎక్కువవుతున్నాయని అర్థము. నొప్పులు “మీదకి వచ్చాయని” లేక “స్త్రీకి ఆకస్మికముగా వచ్చాయని” చెప్పుట ద్వారా దీనిని తర్జుమా చేయుదురు.
  • ఈ పదమును “నియంత్రణలోనికి తీసుకొనుట” లేక ‘ఆకస్మికముగా తీసుకొనుట” లేక “లాగుకొనుట” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “పట్టుకొనబడియున్నాడు మరియు ఆమెతో పండుకొనియున్నాడు” అనే ఈ మాటను “ఆమె మీదకు బలవంతముగా వెళ్ళాడు” లేక “ఆమెను బలత్కరించాడు” లేక “ఆమెను మానభంగము చేశాడు” అని కూడా తర్జుమా చేయవచ్చును. ఈ ఉద్దేశమును తర్జుమా చేయునప్పుడు అంగీకారముగా ఉండునట్లు చూచుకొనుడి.

(చూడండి: సభ్యోక్తి)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H270, H1497, H2388, H3027, H3920, H3947, H4672, H5377, H5860, H6031, H7760, H8610, G724, G1949, G2638, G2902, G2983, G4815, G4884