te_tw/bible/other/exile.md

3.2 KiB

ప్రవాసం, ప్రవాసులు, చెరలోకి పోయిన

నిర్వచనం:

"ప్రవాసం" అనే మాట మనుషులను బలవంతంగా వారి స్వదేశం నుండి కొంత కాలం వేరే చోట ఉంచడాన్ని సూచిస్తున్నది

  • ప్రజలను సాధారణంగా రాజకీయ కారణాలకోసం శిక్షగా ప్రవాసం పంపిస్తారు.
  • శత్రువులు ఆక్రమించుకున్న రాజ్య ప్రజలను గెలిచిన సైన్యం తమ దేశానికి ప్రవాసం తీసుకుపోతారు. వారిచే వెట్టి చాకిరీ చేయించుకుంటారు.
  • "బాబిలోనియా ప్రవాసం" (" ప్రవాసం") అంటే బైబిల్ చరిత్రలో అనేక మంది యూదు పౌరులను యూదా ప్రదేశం నుండి బబులోనులో నివసించడానికి బలవంతంగా తరలించిన వైనం. ఇది 70 సంవత్సరాలు ఉంది.
  • " ప్రవాసులు" అనే మాట తమ దేశం నుండి వెళ్ళిపోయి పరదేశంలో నివసిస్తున్న మనుషులను సూచిస్తున్నది.

అనువాదం సలహాలు:

  • "ప్రవాసం" అనే మాటను ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "పంపించి వేయడం” లేక “వెళ్ళగొట్టడం” లేక “దేశ బహిష్కరణ."
  • " ప్రవాసం" అనేదాన్ని ఒక పదం లేక పదబంధంతో తర్జుమా చెయ్యవచ్చు. "పంపించి వేసే సమయం” లేక “బహిష్కరణ సమయం” లేక “బలవంతంగా వెళ్లగొట్టే సమయం” లేక “బహిష్కారం."
  • " ప్రవాసులు" అనే మాటను అనువదించే పద్ధతులు. “చెరలోకి పోయిన ప్రజలు” లేక “బహిష్కరణకు గురి అయిన వారు” లేక “బబులోను చెరలోకి పోయిన ప్రజలు."

(చూడండి: బబులోను, యూదా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1123, H1473, H1540, H1541, H1546, H1547, H3212, H3318, H5080, H6808, H7617, H7622, H8689, G3927