2.4 KiB
2.4 KiB
పరిగె ఏరుకొను, పరిగె ఏరుకొన్న, పరిగె
నిర్వచనం:
"పరిగె ఏరుకొను" అంటే పొలంలో లేక పండ్ల తోటలో కోత కోసే సమయంలో కోత పనివారు విడిచిపెట్టిన వాటిని ఏరుకోవడం.
- వితంతువులు, పేద ప్రజలు, విదేశీయులు పరిగె ఏరుకొని ఆహారం సంపాదించుకోగలిగేలా ధాన్యం కంకులు వదిలి పెట్టాలని ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు.
- కొన్ని సార్లు పొలం స్వంతదారుడు పరిగె ఏరుకొనే వారిని నేరుగా కోతపనివారి వెనక వెళుతూ పరిగె ఏరుకొనే అవకాశం ఇస్తారు. ఇలా అయితే పరిగె ఏరుకొనే వారికి ఎక్కువ ధాన్యం దొరుకుతుంది.
- దీనికి స్పష్టమైన ఉదాహరణ రూతు కథలో కనిపిస్తుంది. ఆమె బంధువు బోయజు పొలంలో కోత పనివారితో కలిసి పరిగె ఏరుకొనే అవకాశం అతడు ఎంతో ఉదారంగా ఇచ్చాడు.
- "పరిగె ఏరుకొను" అనే దాన్ని తర్జుమా చేసే ఇతర పద్ధతులు. "ఏరుకోవడం” లేక “పోగు చేసుకొను” లేక “సేకరించు."
(చూడండి: బోయజు, ధాన్యం, కోత కాలం, రూతు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3950, H3951, H5953, H5955