3.0 KiB
3.0 KiB
కోత కాలం, కోత కాలాలు, పంట కోత, కోతపనివారు
నిర్వచనం:
"కోత కాలం" అనేది ప్రజలు తము పెంచుతున్న చెట్లు మొక్కల నుండి పండిన పండ్లు, కాయగూరలు, ధాన్యం మొదలైన వాటిని సేకరించే దాన్ని సూచిస్తున్నది.
- కోత కాలం సమయం సాధారణంగా పైరు పెరిగిన తరువాత వస్తుంది.
- ఇశ్రాయేలీయులు " కోత కాలం పండుగ” లేక “పంట సేకరణ పండుగ"ను ఆహార పంటల కోత కాలంలో చేసుకుంటారు. ఈ పంటల మొదటి ఫలాలను బలి అర్పణగా సమర్పించాలని దేవుడు అజ్ఞాపించాడు.
- అలంకారికంగా చూస్తే, "కోత కాలం" అనేది యేసులో నమ్మకం ఉంచిన మనుషులకు, లేక ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు సూచన.
- ఆత్మ సంబంధమైన పంట కోత కాలం అనేది అలంకారికంగా దేవునిపట్ల భయభక్తుల గుణ లక్షణాలకు సూచన.
అనువాదం సలహాలు:
- ఈ పదాన్ని సాధారణంగా లక్ష్య భాషలో పంటల కోత కాలానికి వాడే పదంతోనే అనువదించడం మంచిది.
- పంట కోతను ఇలా అనువదించ వచ్చు, "పంట సేకరణ కాలం” లేక “పంట సమకూర్చుకునే సమయం” లేక “పండ్లు కోసే సమయం."
- "పంట కోత" క్రియా పదాన్ని ఇలా అనువదించ వచ్చు, "సమకూర్చడం” లేక “కోయడం” లేక “సేకరించడం."
(చూడండి: ప్రథమ ఫలాల పండగ, పండుగ)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింతి 09:9-11
- 2 సమూయేలు 21:7-9
- గలతి 06:9-10
- యెషయా 17:10-11
- యాకోబు 05:7-8
- లేవీ 19:9-10
- మత్తయి 09:37-38
- రూతు 01:22
పదం సమాచారం:
- Strong's: H2758, H7105, G2326, G6013