2.9 KiB
2.9 KiB
ప్రథమ ఫలాల పండగ
నిర్వచనం:
"ప్రథమ ఫలాల పండగ" అనేది ప్రతి కోత కాలంలోనూ మొదటి పండ్లు, కాయగూరలు, మొదటి ధాన్యం మొదలైన వాటిని సూచిస్తున్నది
- ఇశ్రాయేలీయులు మొదటి ఫలాలను దేవునికి అర్పణ ఇస్తారు.
- ఈ పదాన్ని బైబిల్లో అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. మొదట పుట్టిన కుమారుడు కుటుంబంలో ప్రథమ ఫలం. అంటే ఎందుకంటే అతడుకుటుంబంలో పుట్టిన మొదటి కుమారుడు, అతడు ఒక కుటుంబం పేరు, ప్రతిష్టలకు ప్రతినిధి.
- యేసు మృతస్థితి నుండి లేచాడు కాబట్టి ఆయన్ను "ప్రథమ ఫలం” అన్నారు. అంటే ఆయనలో విశ్వాసం ఉంచిన వారు చనిపోయాక కొంతకాలానికి తిరిగి బ్రతుకుతారు.
- యేసు విశ్వాసులు సృష్టి అంతటికీ "ప్రథమ ఫలాలు" అన్నారు. అంటే వారికి ప్రత్యేక ఆధిక్యత, స్థితి ఉంది. యేసు విమోచించిన వారిని అయన తన ప్రజలుగా పిలిచాడు.
అనువాదం సలహాలు:
- అక్షరార్థంగా ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మొదటి భాగం (పంటలో)” లేక “కోతలో మొదటి భాగం."
- వీలైతే, అలంకారికంగా వివిధ సందర్భాలకు వివిధ అర్థాలు ఇచ్చేలా అనువదించ వచ్చు.
ఆ విధంగా అక్షరార్థం అలంకారిక అర్థం కూడా చూపవచ్చు.
(చూడండి: మొదట పుట్టిన)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1061, H6529, H7225, G536