te_tw/bible/names/tamar.md

2.3 KiB

తామారు

వాస్తవాలు:

తామారు పేరుతో పాత నిబంధనలో అనేకమంది స్త్రీలున్నారు. ఇది పాత నిబంధనలో అనేక పట్టణాలు, లేక ఇతర స్థలాల పేరు.

  • తామారు యూదా కోడలు. ఆమె యేసుక్రీస్తు పూర్వీకుడు పెరెసుకు జన్మ నిచ్చింది.
  • దావీదు రాజు కుమార్తెలలో ఒకామె పేరు తామారు; ఆమె అబ్షాలోము సోదరి. ఆమె మారుటి అన్న అమ్నోను ఆమెను మానభంగం చేసి వదిలేశాడు.
  • అబ్షాలోము తామారు అనే పేరుగల కుమార్తె ఉంది.
  • ఒక పట్టణం పేరు "హజేజోను తామారు." ఇది ఉప్పు సముద్రం పశ్చిమ తీరాన ఉన్న ఎన్గేది. "బయలు తామారు," అనే ఊరు కూడా ఉంది. "తామారు" అనే పేరు ప్రస్తావనలు ఉన్న వివిధ పట్టణాలు ఉన్నాయి.

(చూడండి: అబ్షాలోము, పూర్వీకుడు, అమ్నోను, దావీదు, పూర్వీకుడు, యూదా, ఉప్పు సముద్రం)

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1193, H2688, H8412, H8559