te_tw/bible/names/gabriel.md

2.7 KiB

గాబ్రియేలు

వాస్తవాలు:

గాబ్రియేలు దేవుని దేవదూతలలో ఒకని పేరు. పాత, కొత్త నిబంధనలు రెంటిలో ఇతని పేరు చాలా సార్లు ప్రస్తావించబడింది.

  • దేవుడు గాబ్రియేలును ప్రవక్త దానియేలు చుసిన దర్శనం చెప్పడానికి పంపాడు.
  • మరొక సారి దానియేలు ప్రార్థన చేస్తుంటే, దేవదూత గాబ్రియేలు అతని దగ్గరకు ఎగిరి వచ్చి భవిషత్తులో జరగబోయే విషయాలు ప్రవచించాడు. దానియేలు అతన్ని ఒక మనిషిగా వర్ణించాడు.
  • కొత్త నిబంధనలో గాబ్రియేలు జెకర్యా దగ్గరకు వచ్చి గొడ్రాలైన అతని భార్య ఎలీసబెతుకు కుమారుడు, యోహాను పుడతాడని చెప్పాడు.
  • ఆరు నెలల తరువాత గాబ్రియేలు మరియ దగ్గరికి వెళ్లి ఆమెను దేవుడు అద్భుత రీతిలో ఆమె గర్భం ధరిస్తుందనీ ఆమెకు పుట్టే శిశువు "దేవుని కుమారుడు" అనీ చెప్పాడు. గాబ్రియేలు మరియతో ఆమె కుమారుని పేరు "యేసు" అని చెప్పాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: దేవదూత, దానియేలు, ఎలీసబెతు, యోహాను (బాప్తిసమిచ్చే), మరియ, ప్రవక్త, దేవుని కుమారుడు, జెకర్యా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1403, G1043