te_tw/bible/kt/yahwehofhosts.md

4.6 KiB

సైయములకధిపతియైన యెహోవా, సైయములకధిపతియగు దేవుడు, పరలోక సైన్య సమూహము, సైన్యములకు ప్రభువు

వాస్తవాలు:

దేవుని అధికారమునకు లోబడు వెలది దూతలపైన ఆయనకున్న అధికారమును సూచించు విధముగా “సైయములకధిపతియైన యెహోవా” లేక “సైయములకధిపతియగు దేవుడు” అనే నామములు ఆయనకు బిరుదులుగా ఉన్నాయి.

  • జన సమూహమును లేక లెక్కలేనన్ని నక్షత్రములు వంటి గొప్ప సంఖ్యలోవున్న అనేక వాటిని సూచించడానికి “సైన్యము” అనే పదము ఉపయోగించబడియున్నది. దురాత్మలతో సహా అనేక విధములైన ఆత్మలను సూచించడానికి ఈ పదమును ఉపయోగించవచ్చును. అది దేనిని సూచించుచున్నదో అని అక్కడి సందర్భము స్పష్టికరిస్తుంది.
  • “సైయములకధిపతియైన యెహోవా” అనే వాక్యము నక్షత్రములను, గ్రహములను మరియు ఆకాశ శక్తులను కూడా సూచిస్తుంది.
  • క్రొత్త నిబంధనలో, “సైయములకధిపతియైన ప్రభువు” అనే పదము “సైయములకధిపతియైన యెహోవా” అని అర్థమును స్పురింప చేయుచున్నది కానీ క్రొత్త నిబంధనలో “యహ్వే” అని అర్థమిచ్చు హెబ్రీ పదము ఉపయోగించబడలేదు గనుక దానిని ఆలాగు తర్జుమా చేయలేరు.

తర్జుమా సలహాలు

  • “సమస్త దూతలను ఏలువాడగు యెహోవా” లేక “దూతల సైన్యమును ఏలువాడగు యెహోవా” లేక “సమస్త సృష్టిని ఏలువాడగు యెహోవా” అని “సైయములకధిపతియైన యెహోవా” అనే వాక్యమును తర్జుమా చేయగలరు.
  • “సైయములకధిపతియైన దేవుడు” మరియు “సైయములకధిపతియైన ప్రభువు” అనే వాక్యములలో వాడబడిన “సైయములకధిపతియైన” అనే పదమును “సైయములకధిపతియైన యెహోవా” అనే పదమును తర్జుమా చేయుటకు పైన చెప్పబడిన విధముగానే చేయవలెను.
  • కొన్ని సంఘాలలో “యహ్వే” అనే పదమును ఉపయోగించడానికి ఇష్టపడరు అందువలన సాంప్రదాయకంగా వచ్చిన పద్ధతి ప్రకారముగా “ప్రభువు” అనే పదమును ఉపయోగిస్తారు. ఇటువంటి సంఘములకొరకు, “సైయములకధిపతియైన యెహోవా” అనే పదమునకు బదులుగా “సైయములకధిపతియైన ప్రభువు” అని తర్జుమా చేయగలరు.

(ఈ పదములను కూడా చూడండి: దూత, అధికారము, దేవుడు, ప్రభువు, ప్రభువు, యెహోవా ప్రభువు, యహ్వే)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H430, H3068, H6635