te_tw/bible/kt/lordyahweh.md

4.5 KiB

ప్రభువైన యెహోవా, యెహోవా దేవుడు

వాస్తవాలు:

పాతనిబంధనలో “ప్రభువైన యెహోవా” పదం ఏకైక నిజ దేవుణ్ణి సూచించడానికి తరుచుగా వినియోగించబడింది.

  • ”ప్రభువు” అనే పదం దైవికబిరుదు, “యెహోవా” అనే పదం దేవుని వ్యక్తిగత పేరు.
  • ”యెహోవా” అనే పదం “యెహోవా దేవుడు” రూపంలో ఉండడానికి “దేవుడు” అనే పదంతో జతచెయ్యబడింది.

అనువాదం సూచనలు:

  • దేవుని వ్యక్తిగత పేరు అనువాదం కోసం “యెహోవా” పదంలోని కొంత రూపం వినియోగిస్తే, “ప్రభువైన యెహోవా,” “యెహోవా దేవుడు” వంటి పదాలు అక్షరాలా అనువదించాలి. దేవుణ్ణి చూపిస్తున్న ఇతర సందర్భాలలో “ప్రభువు” అనే పదం ఏవిధంగా అనువదించబడిందో గమనించాలి.
  • కొన్న భాషలలో పేరు తరువాత బిరుదు ఉంచుతారు, ఈ పదాన్ని “యెహోవా ప్రభువు” అని అనువదిస్తారు. ప్రాజెక్టు బాషలో సహజమైనదానిని ఆలోచించాలి: “ప్రభువు” అనే బిరుదు “యెహోవా” అనే పదానికి ముందు వస్తుందా లేక వెనుక వస్తుందా చూడాలి.
  • ”యెహోవా దేవుడు” అనే పదం “యెహోవాగా పిలువబడే దేవుడు” లేక “సజీవుడైన దేవుడు” లేక “దేవుడనైన నేను” అని భాషాంతరం చెయ్యవచ్చు.
  • ”యెహోవా” అనే పదం “ప్రభువు” లేక “ప్రభువు” అని భాషాంతరం చేసే సాంప్రదాయంలో అనువాదం ఉంటే, “ప్రభువైన యెహోవా” అనే పదాన్ని “ప్రభువు దేవుడు” లేక “ప్రభువుగా ఉన్న దేవుడు” అని అనువదించవచ్చు. “యజమాని ప్రభువు” లేక “దేవుడైన ప్రభువు” అనేవి ఇతర అనువాదాలు.
  • ”ప్రభువైన యెహోవా” అనే పదాన్ని “ప్రభువు ప్రభువు” అనే పదంగా భాషాంతరం చెయ్యకూడదు, ఎందుకంటే సాంప్రదాయంగా ఈ రెండు పదాల అక్షర రూపం వ్యత్యాసాన్ని చదివేవారు గమనించలేక పోవచ్చును. అసాధారణంగా కనిపించవచ్చు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: దేవుడు, ప్రభువు, ప్రభువు, యెహోవా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H136, H430, H3068, G2316, G2962