te_tw/bible/kt/pentecost.md

2.8 KiB

పెంతకోస్తు, వారముల పండుగ

వాస్తవాలు:

“వారముల పండుగ” అనునది పస్క పండుగ అయినతరువాత యాభై రోజులకు చేసే యూదుల పండుగయైయున్నది. దీనిని తరువాత కాలములో “పెంతకోస్తు” అని సూచించిరి.

  • వారముల పండుగ అనునది ప్రథమ ఫలముల పండుగయైన తరువాత ఏడు వారములకు (యాభై రోజులు) సంబంధించినదియైయున్నది. క్రొత్త నిబంధన కాలములో ఈ పండుగను “పెంతకోస్తు” అని పిలిచిరి, ఈ పేరునకు “యాభై” అని అర్థము కలదు.
  • వారముల పండుగ అనునది ధాన్యపు కోతకాలము యొక్క ఆరంభమును ఆచరించుటకు పెట్టటమైనది. ఈ సమయములోనే దేవుడు మోషే ద్వారా ఇస్రాయేలియులకు మొట్ట మొదటిగా ధర్మశాస్త్రమును రెండు పలకల మీద ఇచ్చినదానిని గుర్తుచేయుచున్నది.
  • క్రొత్తనిబంధనలో పెంతెకోస్తు రోజు అనునది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది, ఎందుకనగా ఈ రోజుననే యేసు విశ్వాసులందరూ ఒక వినూతనమైన రీతిలొ పరిశుద్ధాత్మను పొందుకొనియున్నారు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేలాలి)

(ఈ పదాలను కూడా చూడండి: పండుగ, ప్రథమ ఫలములు, కోత, పరిశుద్ధాత్ముడు, లేవనెత్తడం)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H2282, H7620, G4005