te_tw/bible/kt/manna.md

2.8 KiB

మన్నా

నిర్వచనం:

మన్నా తెల్లని గింజల్లా ఉండే ఆహార పదార్ధం, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడచిన తరువాత అరణ్యంలో 40 సంవత్సరాలు వారు భుజించదానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆహారం.

  • మన్నా తెల్లని పొరల్లా కనిపిస్తుంది, ప్రతీ ఉదయం నేల మీద మంచుకింద ఉండేది. అది రుచికి తియ్యగానూ, తేనెలా ఉండేది.
  • ఇశ్రాయేలీయులు సబ్బాతు దినం తప్పించి ప్రతీ రోజు మన్నా పొరలను పోగుచేసుకొనేవారు.
  • సబ్బాతు దినానికి ముందు, రెండింతల మన్నాను పోగుచేసుకోవాలి, తద్వారా విశ్రాంతిదినాన్న వారు పోగుచేసుకోవలసిన అవసరం లేదు.
  • ”మన్నా” అంటే “ఇదేమి” అని అర్థం.
  • బైబిలులో, మన్నా అనే పదం “పరలోకం నుండి ఆహారం,” “పరలోకం నుండి ధాన్యం” అని కూడా సూచిస్తుంది.

అనువాదం సూచనలు

  • దీనిని “ఆహారపు సన్నని పోర” లేక “పరలోకం నుండి ఆహారం” అని అనువాదం చెయ్యవచ్చు.
  • స్థానిక లేక దేశీయ బైబిలు అనువాదంలో ఈ పదం ఏవిధంగా అనువదించబడిందో గమనించండి.

(చూడండి: తెలియనివాటిని అనువదించడం)

(చూడండి: రొట్టె, ఎడారి, గింజ, పరలోకం, సబ్బాతు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4478, G3131