5.6 KiB
5.6 KiB
పరలోకం, ఆకాశం, అకాశాలు, పరలోకం
నిర్వచనం:
దీన్ని ఇలా అనువదించ వచ్చు. "పరలోకం" అంటే దేవుడు ఉండే చోటును సాధారణంగా సూచిస్తున్నది. ఇదే పదం సందర్భాన్ని బట్టి ఈ అర్థం కూడా ఇస్తుంది, "ఆకాశం."
- "ఆకాశాలు" అంటే భూమిపై ఉన్న ప్రతిదీ అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇందులో ఆకాశ రాసులు సుదూర లోకాలు, నేరుగా భూమినుండి చూడలేనివి.
- "ఆకాశం" అంటే భూమిపై పరుచుకుని ఉన్న నీలవిశాలం. అక్కడ మేఘాలు, మనం పీల్చే గాలి ఉన్నాయి. తరచుగా సూర్యుడు, చంద్రుడు కూడా "ఆకాశంలో ఉన్నట్టు" చెప్పవచ్చు.
- కొన్ని సందర్భాల్లో బైబిల్లో, "పరలోకం" అంటే ఆకాశం, లేక దేవుడుండే చోటు.
- "పరలోకం " అనే దాన్ని అలంకారికంగా వాడినప్పుడు దేవుడు అనే అర్థంతో వాడతారు. ఉదాహరణకు, మత్తయి " పరలోక రాజ్యం” అని రాసినప్పుడు అతడు దేవుని రాజ్యం అనే అర్థంతో రాశాడు.
అనువాదం సలహాలు:
- "పరలోకం" అలంకారికంగా ఉపయోగించినప్పుడు దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు, "దేవుడు."
- "పరలోక రాజ్యం" అని మత్తయి సువార్తలో రాసినప్పుడు "పరలోకం" అని రాయడం మంచిది. ఎందుకంటే అది మత్తయి సువార్తకు ప్రత్యేకం.
- “అకాశాలు” లేక “ఆకాశ రాసులు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు” లేక “విశ్వంలోని నక్షత్రాలు అన్నీ."
- పద బంధం, “ఆకాశ నక్షత్రాలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆకాశం లోని నక్షత్రాలు” లేక “పాలపుంతలోని నక్షత్రాలు” లేక “విశ్వంలోని నక్షత్రాలు."
(చూడండి: రాజ్యం దేవుని)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 08:22-24
- 1 తెస్స 01:8-10
- 1 తెస్స 04:16-18
- ద్వితీ 09:1-2
- ఎఫెసి 06:9
- ఆది 01:1-2
- ఆది 07:11-12
- యోహాను 03:12-13
- యోహాను 03:27-28
- మత్తయి 05:17-18
- మత్తయి 05:46-48
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 04:02 వారు కట్టే భవనం పరలోకం అంటుతున్న ఎత్తైన గోపురం తో ఉంది.
- 14:11 అతడు (దేవుడు)పరలోకపు ఆహారం వారికి ఇచ్చాడు. దాని పేరు "మన్నా."
- 23:07 హటాత్తుగా, అకాశాలు దేవదూతల స్తుతులతో నిండిపోయాయి. "పరలోకంలో దేవునికి మహిమ, అయన అనుగ్రహం చూరగొన్న వారికి భూమి మీద శాంతి!"
- 29:09 తరువాత యేసు చెప్పాడు, " మీరు మీ సోదరుణ్ణి నీ హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోక తండ్రి మీలో ప్రతి ఒక్కరికీ చేసేది ఇదే."
- 37:09 తరువాత యేసు ఆకాశం కేసి చూసి ఇలా చెప్పాడు, "తండ్రీ నీవు నా మాట వినినందుకు వందనాలు."
- 42:11 తరువాత యేసు పరలోకం లోకి వెళ్ళిపోయాడు. ఒక మేఘం ఆయన్ను వారికి కనబడకుండా తీసుకుపోయింది.
పదం సమాచారం:
- Strong's: H1534, H6160, H6183, H7834, H8064, H8065, G932, G2032, G3321, G3770, G3771, G3772