te_tw/bible/kt/children.md

6.0 KiB

పిల్లలు, బిడ్డ, సంతానం

నిర్వచనం:

"బిడ్డ" పదం ("పిల్లలు" బహువచనం) ఒక స్త్రీ పురుషుల సంతానాన్ని సూచిస్తుంది. ఈ పదం సాధారణంగా వయసులో చిన్నవానినీ, ఇంకా పూర్తిగా ఎదగని యువజనునీ సూచించడానికి తరచుగా ఉపయోగించబడింది. "సంతానం" పదం ప్రజలు లేదా జంతువుల జీవసంబంధమైన సంతతి వారిని సాధారణంగా సూచిస్తుంది.

  • బైబిలులో, శిష్యులూ, వెంబడించే వారు కొన్నిసార్లు "పిల్లలు" అని పిలువబడ్డారు.
  • "పిల్లలు"అనే పదం తరచుగా ఒక వ్యక్తి సంతానాన్ని సూచిస్తూ ఉపయోగించబడింది.
  • "విత్తనం" పదం కొన్నిసార్లు సంతానానికి చిత్ర రూపకంగా చూపించడానికి ఉపయోగించబడింది.
  • బైబిలులో తరచుగా "సంతానం" అనే పదం "పిల్లలు" లేదా "సంతానం" అని ఒకే అర్థాన్ని కలిగియుంది.
  • "పిల్లలు" పదం ఏదైనా ఒకదాని గుణలక్షణాలు కలిగియున్నట్టు సూచించవచ్చు.

కొన్ని ఉదాహరణలు ఇలా ఉంటాయి:

  • వెలుగు పిల్లలు.

  • విధేయత పిల్లలు.

  • సాతాను పిల్లలు.

  • ఈ పదం సంఘాన్ని సూచించడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, కొన్నిసార్లు కొత్త నిబంధన యేసునందు విశ్వాసం ఉంచిన ప్రజలను "దేవుని పిల్లలు" అని సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • "పిల్లలు"అనే పదం ఒక వ్యక్తి మునుమనవళ్ళను లేదా గొప్ప మునుమనవళ్ళను మొదలైన వారిని సూచిస్తున్నప్పుడు "సంతానం" అని అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, "పిల్లలు" అనే పదాన్ని "లక్షణాలు కలిగియున్నవ్యక్తులు" లేదా "వారిలా ప్రవర్తించే వ్యక్తులు" అని అనువదించవచ్చు.
  • సాధ్యమైనంత వరకు "దేవుని పిల్లలు" పదం అక్షరాలా అనువదించబడవచ్చు ఎందుకంటే దేవుడు మన పరలోకపు తండ్రి అనేది బైబిలులో ప్రాముఖ్యమైన అంశం. "దేవునికి చెందిన వ్యక్తులు" లేదా "దేవుని ఆత్మీయ పిల్లలు" అనేది సాధ్యమైన అనువాదం.
  • యేసు తన శిష్యులను "పిల్లలు,"అని పిలిచినప్పుడు ఇది "ప్రియమైన స్నేహితులు" లేదా "నా ప్రియమైన శిష్యులు" అని కూడా అనువదించబడవచ్చు.
  • పౌలు, యోహాను యేసు నందు విశ్వాసులను "పిల్లలు" అని సూచించినప్పుడు ఇది "ప్రియమైన సహా విశ్వాసులు" అని కూడా అనువదించబడవచ్చు.
  • "వాగ్దాన పుత్రులు” అనే వాక్యం "దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందిన ప్రజలు" అని కూడా అనువదించబడవచ్చు.

(చూడండి: సంతతి వాడు, విత్తనం, వాగ్దానం, కుమారుడు, ఆత్మ, విశ్వసించు, ప్రియమైన)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1069, H1121, H1123, H1129, H1323, H1397, H1580, H2029, H2030, H2056, H2138, H2145, H2233, H2945, H3173, H3205, H3206, H3208, H3211, H3243, H3490, H4392, H5271, H5288, H5290, H5759, H5764, H5768, H5953, H6185, H7908, H7909, H7921, G730, G815, G1025, G1064, G1471, G3439, G3515, G3516, G3808, G3812, G3813, G3816, G5040, G5041, G5042, G5043, G5044, G5206, G5207, G5388