te_tw/bible/kt/spirit.md

9.4 KiB

ఆత్మ, ఆత్మలు, ఆత్మీయత

నిర్వచనము:

“ఆత్మ” అనే ఈ పదము ప్రజలలో లేక ఒక వ్యక్తిలో కనిపించని అభౌతికమైన భాగమును సూచిస్తుంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు, తన ఆత్మ అతని శరీరమును విడిచి వెళ్లును. “ఆత్మ” అనే పదము వైఖరిని లేక భావోద్వేగ స్థితిని కూడా సూచిస్తుంది.

  • “ఆత్మ” అనే పదము భౌతిక శరీరము లేనిదిగా ఉండేదానిని, విశేషముగా దుష్ట ఆత్మను సూచిస్తుంది.
  • ఒక వ్యక్తిలోని ఆత్మ దేవునిని తెలుసుకొని, ఆయనయందు విశ్వసించే ఒక భాగమైయున్నది.
  • సాధారణముగా “ఆత్మీయత” అనే పదము అభౌతికమైన ప్రపంచములో ఉండేదానిని వివరిస్తుంది.
  • పరిశుద్ధ గ్రంథములో విశేషముగా దేవునికి సంబంధించిన ప్రతిదానిని మరియు పరిశుద్ధాత్మను సూచిస్తుంది.
  • ఉదాహరణకు, “ఆత్మీయకమైన ఆహారము” దేవుని ఉపదేశములను సూచిస్తుంది, ఇవి ఒక వ్యక్తి ఆత్మకు మంచి పోషణను అనుగ్రహిస్తాయి, మరియు “అత్మియకమైన జ్ఞానము” పరిశుద్ధాత్మ శక్తినుండి వచ్చిన నీతిని మరియు జ్ఞానమును సూచిస్తుంది.
  • దేవుడు ఆత్మయైయున్నాడు మరియు ఆయన ఇతర ఆత్మలను సృష్టించియున్నాడు, వీరికి భౌతిక శరీరములు ఉండవు.
  • దూతలు ఆత్మలైయున్నారు, ఇందులో దేవునికి విరుద్ధముగా తిరస్కరించి, దుష్ట ఆత్మలుగా మారినవారున్నారు.
  • “ఆత్మ” అనే ఈ పదము “గుణలక్షణములను కూడా సూచించుదురు”, ఉదాహరణకు, “జ్ఞానాత్మ” లేక “ఏలియా ఆత్మలో” ఇలా ఒకరి లేక ఏదైనా గుణలక్షణములను చేర్చి ఉపయోగించురు.
  • ఒక వైఖరికి లేక భావోద్వేలుగా “ఆత్మకు” ఉదాహరణలు చెప్పుటలో “పిరికితనముగల ఆత్మ” మరియు “అసూయ ఆత్మ” అని కూడా చేర్చి చెప్పుదురు.

తర్జుమా సలహాలు;

  • సందర్భాన్ని ఆధారము చేసికొని, “ఆత్మ” అనే పదమును తర్జుమా చేయు విధానములో “అభౌతికమైన ఆకారము” లేక “లోపలి భాగము” లేక “అంతరంగము” అని కూడా ఉపయోగించుదురు.
  • కొన్ని సందర్భాలలో, “ఆత్మ” అనే పదమును “దుష్టాత్మ” లేక “దుష్ట ఆత్మ సంబంధమైన” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “నా అంతరంగములో నా ఆత్మ దుఃఖించుచున్నది” అని వాక్యములో ఉన్నట్లుగా కొన్నిమార్లు “ఆత్మ” అనే పదమును ఒక వ్యక్తిలోని భావాలను వ్యక్తపరచుటకు ఉపయోగించబడును. దీనిని “నా ఆత్మలో నేను దుఃఖించాను” లేక “నేను చాలా ఎక్కువ దుఃఖానికి లోనైయున్నాను” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “ఒక గుణలక్షణమునకు లేక వ్యక్తి ధోరణికి సంబంధించిన ఆత్మ” అనే ఈ మాటను “ఆ వ్యక్తి గుణలక్షణము” లేక “ఆ వ్యక్తి ప్రభావము” లేక “ఆ వ్యక్తి ధోరణి” లేక “ఆ వ్యక్తి ద్వారా ఏర్పడిన ఆలోచన” అని కూడా తర్జుమా చేయుదురు.
  • సందర్భానుసారముగా “ఆత్మీయత” అనే పదమును “అభౌతికమైన” లేక “పరిశుద్ధాత్మనుండి” లేక “దేవుని విషయాలు” లేక “అభౌతికమైన ప్రపంచములోని భాగము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “ఆత్మీయమైన పాలు” అనే ఈ అలంకారికమైన మాటను “దేవుని గూర్చిన ప్రాథమికమైన ఉపదేశాలు” లేక ‘ఆత్మను పోషించే (పాలు పోషించునట్లు” దేవుని ఉపదేశములు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “ఆత్మీయమైన పరిపక్వత” అనే ఈ మాట “పరిశుద్ధాత్మకు విధేయత చూపించు దైవికమైన ప్రవర్తన” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “ఆత్మీయమైన వరము” అనే మాటను “పరిశుద్ధాత్మ ఇచ్చే విశేషమైన సామర్థ్యము” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: దూత, దెయ్యం, పరిశుద్ధాత్ముడు, ఆత్మ)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 13:03 మూడు దినములైన తరువాత, ప్రజలు తమ్మునుతాము ఆత్మియకముగా సిద్ధపరచుకొనినతరువాత, దేవుడు సీనాయి పర్వతమునుండి ఉరుములతోనూ, మెరుపులతోనూ, మరియు గొప్ప బూర ధ్వనులతోను దిగివచ్చెను.
  • 40:07 “సమాప్తమైనది! తండ్రి, నా ఆత్మ నీ చేతులకు అప్పగించుచున్నాను” అని యేసు గట్టిగా అరిచెను. ఆ తరువాత ఆయన తన తలను వంచి, తన ఆత్మను అప్పగించెను.
  • 45:05 స్తెఫెను చనిపొతూ “యేసు నా ఆత్మను చేర్చుకొనుము” అని ఏడ్చెను.
  • 48:07 ఆయన ద్వారా సమస్త ప్రజలు ఆశీర్వదించబడిరి, ఎందుకంటే యేసునందు విశ్వసించిన ప్రతియొక్కరు పాపమునుండి రక్షించబడియున్నారు, మరియు వారందరూ అబ్రాహాము ఆత్మీయ సంతానముగా మార్చబడిరి.

పదం సమాచారం:

  • Strong's: H178, H1172, H5397, H7307, H7308, G4151, G4152, G4153, G5326, G5427