3.8 KiB
3.8 KiB
ప్రాణం (ఆత్మ), స్వయం
నిర్వచనం:
ప్రాణం పదం సాధారణంగా ఒక వ్యక్తి యొక్క భౌతికేతర భాగాన్ని సూచించవచ్చు లేదా ఇతరులనుండి భిన్నంగా ఒక వ్యక్తిగా తన గురించి తనకు ఉన్న అవగాహనను ప్రత్యేకించి సూచిస్తుంది.
- “ప్రాణం," "ఆత్మ" పదాలు రెండు భిన్నమైన అంశాలుగా ఉండవచ్చు లేదా ఆ రెండు పదాలు ఒక అంశాన్ని సూచిస్తుండవచ్చు.
- ఒక వ్యక్తి మరణించినప్పుడు, తన ప్రాణం తన శరీరాన్ని విడిచి వెళ్లిపోతుంది.
- “శరీరానికి భిన్నంగా "ఆత్మ" పదం"దేవునితో సంబంధపరచబడేదిగా" ఉండే శరీరభాగంగా చెప్పవచ్చు.
- "ఆత్మ" పదం కొన్నిసార్లు పూర్తి వ్యక్తిని సూచించడానికి అలంకారికంగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, "పాపాలు చేయు ఆత్మ" అంటే "పాపాలు చేసే వ్యక్తి" అని అర్థం. "నా ఆత్మ అలసిపోయింది" అంటే "నేను అలసిపోయాను" అని అర్థం.
అనువాదం సూచనలు:
- “ఆత్మ" పదం "ఆంతరంగిక స్వయం" లేదా "అంతరంగిక వ్యక్తి" అని అనువదించబడవచ్చు.
- కొన్ని సందర్భాలలో “నా ప్రాణము” అనే పదం “నేను” లేదా "నన్ను" అని అనువదించబడవచ్చు.
- “ప్రాణము” పదం "వ్యక్తి" లేదా "అతడు" లేదా "అతనిని" అని అనువదించబడవచ్చు.
- కొన్ని భాషలలో “ప్రాణం" లేదా “ఆత్మ” అనే పదాల అంశాల కోసం ఒకే పదం ఉండవచ్చు.
- హెబ్రీ 4:12వ వచనములో “ప్రాణము మరియు ఆత్మను విభజించునంతగా” అనే అలంకారిక పదం ఉపయోగించబడింది, అంటే “అంతరంగిక వ్యక్తిని లోతుగా వివేచించడం" లేదా "అంతరంగిక వ్యక్తి చేయడం" అర్థం.
(చూడండి: ఆత్మ)
బైబిలు రిఫరెన్సులు:
- 2 పేతురు 02:08
- అపొ.కా. 02:27-28
- అపొ.కా. 02:41
- ఆది. 49:06
- యెషయా 53:10-11
- యాకోబు 01:21
- యిర్మియా 06:16-19
- యోనా 02:7-8
- లూకా 01:47
- మత్తయి 22:37
- కీర్తన 019:07
- ప్రకటన 20:4
పదం సమాచారం:
- Strong's: H5082, H5315, H5397, G5590