te_ta/translate/translate-useulbudb/01.md

28 KiB
Raw Permalink Blame History

అనువాదకులుగా, యు.ఎల్‌.టి, యు.ఎస్‌.టి ల మధ్య ఈ క్రింది తేడాలను మీరు గుర్తుంచుకుంటే మీరు యు.ఎల్‌.టి, యు.ఎస్‌.టి ని ఉత్తమంగా ఉపయోగించవచ్చు, ఈ వ్యత్యాసాలు సూచించే సమస్యలతో లక్ష్య భాష ఎలా ఉత్తమంగా వ్యవహరించగలదో మీరు తెలుసుకుంటే మీరు యు.ఎల్‌.టి, యు.ఎస్‌.టి ని ఉత్తమంగా ఉపయోగించవచ్చు.

అభిప్రాయాల క్రమం

ఆలోచనలను మూల వచనంలో కనిపించే విధంగా ** అదే క్రమంలో ** చూపించడానికి యు.ఎల్.టి ప్రయత్నిస్తుంది.

యు.ఎస్‌.టి ఆంగ్లంలో మరింత సహజమైన విధానాన్ని , లేదా తర్క క్రమాన్ని లేదా సమయ క్రమాన్ని అనుసరించే క్రమంలో అభిప్రాయాలను కనుపరచడానికి ప్రయత్నిస్తుంది.

మీరు అనువదించినప్పుడు, మీరు లక్ష్య భాషలో సహజంగా ఉండేలా ఆలోచనలను ఉంచాలి. (ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి)

1 రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అంటే పవిత్రులుగా ఉండడానికి దేవుని పిలుపు అందిన వారందరికీ పౌలు రాస్తున్న సంగతులు.
7 ఆయన ద్వారా మేము కృప, రాయబారి పదవి పొందాం. ఆయన పేరుకోసం అన్ని జనాలలో విశ్వాస విధేయత కలగాలని ఆయన ఉద్దేశం. అలాంటివారిలో మీరూ దేవుని పిలుపు అంది యేసుక్రీస్తుకు చెందినవారై ఉన్నారు. (రోమా 1:1, 7 యు.ఎల్.టి)
1 రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అంటే పవిత్రులుగా ఉండడానికి దేవుని పిలుపు అందిన వారందరికీ పౌలు రాస్తున్న సంగతులు. (రోమా 1:1, 7 యు.ఎల్.టి)

పౌలు తన అక్షరాలను ప్రారంభించే శైలిని యు.ఎల్.టి చూపిస్తుంది. 7 వ వచనం వరకు తన పాఠకులు ఎవరో చెప్పడు. అయినప్పటికీ, యు.ఎస్‌.టి ఈ రోజు ఇంగ్లీషు, అనేక ఇతర భాషలలో చాలా సహజమైన శైలిని అనుసరిస్తుంది.

సూచించిన సమాచారం

పాఠకుడికి అర్థమవడం కోసం ముఖ్యమైన ఇతర తలంపులను ** సూచించే ** లేదా ** ఊహించే** ఆలోచనలను యు.ఎల్.టి తరచుగా కనపరుస్తుంది.

యు.ఎల్.టి తరచుగా ఆ ఇతర ఆలోచనలను స్పష్టం చేస్తుంది. వచనాన్ని అర్థం చేసుకోవడానికి మీ పాఠకులు ఈ సమాచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటే మీ అనువాదంలో మీరు కూడా అదే చేయాలని మీకు గుర్తు చేయడానికి యు.ఎల్.టి దీనిని దీన్ని చేస్తుంది.

మీరు అనువదించినప్పుడు, వీటిలో సూచించే ఈ తలంపులు చేర్చబడకుండా వీటిలో మీ పాఠకులకు ఏవి అర్థం అవుతాయో మీరు నిర్ణయించాలి. వచన భాగంలో సూచించే తలంపులు చేర్చకుండా ఉన్నప్పటికీ మీ పాఠకులు అర్థం చేసుకున్నట్లయితే మీరు ఆ ఆలోచనలను స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ పాఠకులు ఎలాగైనా అర్థం చేసుకునేలా సూచించే ఆలోచనలను మీరు అనవసరంగా చెప్పినట్లయితే మీరు వారిని బాధపెట్టవచ్చని కూడా గుర్తుంచుకోండి. (ఊహించిన జ్ఞానం, అవ్యక్త సమాచారం చూడండి)

అప్పుడు యేసు సీమోనుతో “భయపడకు! ఇప్పటినుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు. (లూకా 5:10 యు.ఎల్.టి)

అప్పుడు యేసు సీమోనుతో “భయపడకు! ఇప్పటి వరకు చేపలను పట్టావు, అయితే ఇప్పటినుంచి నీవు మనుషులు శిష్యులుగా మారేలా వారిని పట్టే వాడివవుతావు” అన్నాడు. (లూకా 5:10 యు.ఎస్.టి)

ఇక్కడ యు.ఎస్‌.టి సీమోను వృత్తి రీత్యా మత్స్యకారుడని పాఠకుడికి గుర్తు చేస్తుంది. సీమోను మునుపటి పనికీ, అతని భవిష్యత్ పనికి మధ్య యేసు గీస్తున్న సారూప్యతను కూడా ఇది స్పష్టం చేస్తుంది. అదనంగా, సీమోను "మనుష్యులను పట్టుకోవాలని" (యు.ఎల్.టి), అంటే "నా శిష్యులుగా మారడానికి" (యు.ఎస్.టి) దారి తీయాలని యేసు ఎందుకు కోరుకున్నాడో యు.ఎస్.టి స్పష్టం చేస్తుంది.

యేసును చూడగానే అతడు సాష్టాంగపడి “ప్రభూ! మీకిష్టం ఉంటే నన్ను శుద్ధంగా చేయగలరు” అంటూ ఆయనను బ్రతిమాలు కొన్నాడు. (లూకా 5:12 యు.ఎల్.టి)

యేసును చూడగానే అతడు ఆయన ముందు సాష్టాంగపడి “ప్రభూ! నన్ను శుద్ధంగా చేయండి, యెందుకంటే మీకిష్టం అయితే నన్ను బాగు చెయ్యగలరు” అంటూ ఆయనను బ్రతిమాలు కొన్నాడు. (లూకా 5:12 యు.ఎస్.టి)

కుష్టు వ్యాధి ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు నేల మీద పడలేదని ఇక్కడ యు.ఎస్‌.టి స్పష్టం చేస్తుంది. బదులుగా, అతను ఉద్దేశపూర్వకంగా నేల మీద సాష్టాంగా నమస్కరించాడు. అలాగే, తనను స్వస్థపరచమని యేసును అడుగుతున్నట్లు యు.ఎస్‌.టి స్పష్టం చేస్తుంది. యు.ఎల్.టి లో అతను ఈ అభ్యర్థనను మాత్రమే సూచిస్తాడు.

సాంకేతాత్మక చర్యలు

** నిర్వచనం ** - ఒక సాంకేతాత్మక చర్య అనేది ఒక నిర్దిష్ట ఆలోచనను వ్యక్తీకరించడానికి ఎవరైనా చేసే పని.

యు.ఎల్.టి తరచుగా సాంకేత్మాత్మక చర్యను దాని అర్థం ఏమిటో వివరించకుండా తెలియచేస్తుంది. సాంకేతాత్మక చర్య ద్వారా వ్యక్తీకరించిన అర్థాన్ని యు.ఎస్‌.టి తరచుగా తెలియపరుస్తుంది.

మీరు అనువదించినప్పుడు, మీ పాఠకులు సంకేత చర్యను సరిగ్గా అర్థం చేసుకుంటారో లేదో మీరు నిర్ణయించుకోవాలి. మీ పాఠకులు అర్థం చేసుకోలేకపోయినట్లయితే, యు.ఎస్‌.టి చేస్తున్నట్టు మీరు చేయాలి. (చూడండి సింబాలిక్ యాక్షన్)

ప్రముఖ యాజి తన బట్టలు చింపుకొని “మనకిక సాక్షులతో ఏం పని? (మార్కు 14:63 యు.ఎల్.టి)

యేసు మాటలకు స్పందనగా ప్రముఖ యాజిచాలా నిర్ఘాంత పడ్డాడు, తన బట్టలు చింపుకొన్నాడు. (మార్కు 14:63 యు.ఎల్.టి)

ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపివేయడం ప్రమాదవశాత్తు కాదని ఇక్కడ యు.ఎస్‌.టి స్పష్టం చేస్తుంది. అతను చిరిగినది అతని బాహ్య వస్త్రమేనని, అతడు విచారంగానూ లేదా కోపంగానూ లేదా రెండింటినీ చూపించాలనుకున్నందున అతడు అలా చేశాడని కూడా ఇది స్పష్టం చేస్తుంది.

ప్రధాన యాజకుడు వాస్తవానికి తన వస్త్రాన్ని చించివేసినందున, తాను ఆ విధంగా చేసినట్టు యు.ఎస్‌.టి తప్పకుండా చెప్పాలి. ఏదేమైనా, ఒక సంకేత చర్య వాస్తవానికి ఎప్పుడూ జరగకపోతే, మీరు ఆ చర్యను పేర్కొనవలసిన అవసరం లేదు. అటువంటి ఉదాహరణ ఇక్కడ ఉంది:

అలాంటి వాటిని మీ అధికారికి ఇవ్వజూపండి! అతడు మిమ్ములను స్వీకరిస్తాడా? దయతో చూస్తాడా? (మలాకీ 1:8 యు.ఎల్.టి)

మీ స్వంత అధికారికి అలాంటి బహుమతులు ఇవ్వడానికి మీరు ధైర్యం చేయరు! అతడు వాటిని తీసుకోడని మీకు తెలుసు. అతను మీతో అసంతృప్తి చెందుతాడని మిమ్మల్ని స్వాగతించడని మీకు తెలుసు.! (మలాకీ 1: 8 UST)

యు.ఎల్.టి లో ఈ విధానంలో ప్రాతినిధ్యం వహిస్తున్న "ఒకరి ముఖాన్ని పైకి లేపండి" అనే సంకేతాత్మక చర్య యు.ఎస్.టి లో దాని అర్ధంగా మాత్రమే తెలియపరచబడుతుంది: "అతను మీ పట్ల అసంతృప్తి చెందుతాడు, మిమ్మల్ని స్వాగతించడు." మలాకీ వాస్తవానికి జరిగిన ఒక నిర్దిష్ట సంఘటనను సూచించనందున దీనిని ఈ విధంగా తెలియపరచవచ్చు. అతను ఆ సంఘటన ద్వారా సూచించబడిన తలంపును మాత్రమే సూచిస్తున్నాడు.

నిష్క్రియాత్మక క్రియ రూపాలు

బైబిలు హీబ్రూ, బైబిలు గ్రీకు రెండూ తరచుగా నిష్క్రియాత్మక క్రియ రూపాలను ఉపయోగిస్తాయి, అయితే అనేక ఇతర భాషలకు ఆ అవకాశం లేదు. అసలు భాషలు ఉపయోగించినప్పుడు నిష్క్రియాత్మక క్రియ రూపాలను ఉపయోగించడానికి యు.ఎల్.టి ప్రయత్నిస్తుంది. అయితే, యు.ఎస్‌.టి సాధారణంగా ఈ నిష్క్రియాత్మక క్రియ రూపాలను ఉపయోగించదు. ఫలితంగా, యు.ఎస్.టి అనేక పదబంధాలను ** పునర్నిర్మిస్తుంది. **

మీరు అనువదించినప్పుడు, కింది ఉదాహరణలలో ఉన్న మాదిరిగానే లక్ష్య భాష నిష్క్రియాత్మక వ్యక్తీకరణను వినియోగిస్తూ సంఘటనలను లేదా పరిస్థితులను చూపించగలదా అని మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఒక నిర్దిష్ట సందర్భంలో నిష్క్రియాత్మక క్రియ రూపాన్ని ఉపయోగించలేకపోతే, అప్పుడు మీరు యు.ఎస్.టి లో పదబంధాన్ని పునర్నిర్మించడానికి ఒక మార్గాన్ని కనుగొనవచ్చు. (క్రియాశీల లేదా నిష్క్రియాత్మక చూడండి)

బైబిలు నుండి ఉదాహరణలు

ఎందుకంటే అతడూ అతనితో ఉన్నవారంతా తాము పట్టిన చేపల మొత్తం చూచి ఎంతో ఆశ్చర్య పడిపోయారు. (లూకా 5:9 యు.ఎల్.టి)

ఆయన దీనిని చెప్పాడు ఎందుకంటే అతడు తాము పట్టిన చేపల మొత్తం చూచి ఎంతో ఆశ్చర్య పడిపోయాడు. (లూకా 5:9 యు.ఎల్.టి)

నిష్క్రియాత్మక స్వరంలో “ఆశ్చర్యానికి గురయ్యాడు” అనే యు.ఎల్.టి క్రియకు బదులుగా "అతను ఆశ్చర్యపోయాడు" అనే క్రియాశీల స్వరంలో యు.ఎల్.టి ఒక క్రియను ఉపయోగిస్తుంది.

అందుచేత ఆయన ఉపదేశం వినడానికీ రోగాలు బాగు చేయించుకోవడానికీ పెద్ద జన సమూహాలు సమకూడాయి. (లూకా 5:15 యు.ఎల్.టి)

ఆయన ఉపదేశం వినడానికీ రోగాలు బాగు చేయించుకోవడానికీ పెద్ద జన సమూహాలు సమకూడిన ఫలితం వారి రోగాలనుండి ఆయన వారిని బాగుచెయ్యడం. (లూకా 5:15 యు.ఎస్.టి)

ఇక్కడ యు.ఎస్.టి, యు.ఎల్.టి నిష్క్రియాత్మక క్రియ రూపం, "బాగు చెయ్యడం”ను తప్పిస్తుంది. ఇది పదబంధాన్ని పునర్నిర్మించడం ద్వారా దీన్ని చేస్తుంది. వైద్యం చేసేవాడు ఎవరో ఇది చెబుతుంది: "వారిని బాగు చెయ్యడానికి ఆయన వద్దకు వచ్చారు.”

రూపకాలు, భాషా రూపాలు

** నిర్వచనం ** - బైబిలు గ్రంథాలలో కనిపించే భాషా రూపాలు సాధ్యమైనంత దగ్గరగా సూచించడానికి యు.ఎల్.టి ప్రయత్నిస్తుంది.

యు.ఎస్.టి తరచుగా ఈ ఆలోచనల అర్ధాన్ని ఇతర విధానాలలో అందిస్తుంది.

మీరు అనువదించినప్పుడు, లక్ష్య భాషా పాఠకులు తక్కువ ప్రయత్నంతోనూ, కొంత ప్రయత్నంతోనూ, లేదా పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారా అని మీరు నిర్ణయించుకోవాలి. వారు అర్థం చేసుకోవడానికి గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే, లేదా వారు అస్సలు అర్థం చేసుకోకపోతే, మీరు ఇతర పదాలను ఉపయోగించి భాషా రూపాల ముఖ్యమైన అర్ధాన్ని తెలియపరచడం అత్యవసరం.

దేని గురించి అంటే, క్రీస్తులో మీరు ప్రతి విషయంలో మాట్లాడే సామర్థ్యమంతటిలోనూ జ్ఞానమంతటిలోనూ అభివృద్ధి చెందారు. (1 కొరింథీయులు 1:5 యు.ఎల్.టి)

క్రీస్తుయేసు మీకు అనేకమైన వాటిని అనుగ్రహించాడు ఆయన సత్యాన్ని మాట్లాడడంలోనూ, దేవుణ్ణి తెలుసుకోవడంలోనూ ఆయన మీకు సహాయం చేసాడు. (1 కొరింథీ 1:5 యు.ఎస్.టి)

పౌలు "ధనవంతుడు" అనే పదంలో వ్యక్తీకరించిన భౌతిక సంపద రూపకాన్ని ఉపయోగిస్తున్నాడు. " మాట్లాడే సామర్థ్యమంతటిలోనూ జ్ఞానమంతటిలోనూ” వాక్యం అర్థాన్ని వెంటనే వివరిస్తున్నప్పటికీ కొంతమంది పాఠకులు అర్థం చేసుకోకపోవచ్చు. భౌతిక సంపద రూపకాన్ని ఉపయోగించకుండా, యు.ఎస్‌.టి ఆలోచనను వేరే విధంగా తెలియపరుస్తుది. (చూడండి రూపకం)

తోడేళ్ళ మధ్యలోకి గొర్రెలను పంపినట్టు నేను మిమ్ములను పంపుతూ ఉన్నాను, (మత్తయి 10:16 యు.ఎల్.టి)

నేను నిన్ను బయటకు పంపినప్పుడు, మీరు తోడేళ్ళ వలె ప్రమాదకరమైన వ్యక్తుల మధ్య గొర్రెలు వలె రక్షణ లేకుండా ఉంటారు . (మత్తయి 10:16 యు.ఎస్.టి)

యేసు తన అపొస్తలులను ఇతరుల వద్దకు వెళ్ళడం తోడేళ్ళ మధ్య వెళ్ళే గొర్రెలతో పోల్చిన ఒక ఉపమానాన్ని ఉపయోగిస్తున్నాడు. కొంతమంది పాఠకులకు అపొస్తలులు గొర్రెలుగా ఎలా ఉంటారో, ఇతర వ్యక్తులు తోడేళ్ళు లాగా ఎలా ఉంటారో అర్థం కాకపోవచ్చు. అపొస్తలులు రక్షణ లేకుండా ఉంటారని, వారి శత్రువులు ప్రమాదకరమని యు.ఎస్‌.టి స్పష్టం చేసింది. (చూడండి Simile)

మీలో ధర్మశాస్త్రంవల్ల నిర్దోషుల లెక్కలోకి రావాలని చూస్తున్నవారు క్రీస్తు నుంచి దూరమైపోయారు, కృప మార్గం నుంచి పతనమయ్యారు. (గలతీయులకు 5:4 యు.ఎల్.టి)

మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నిస్తున్నందున దేవుడు తన దృష్టిలో మిమ్మల్ని మంచివారని ప్రకటిస్తాడని మీరు ఆశించినట్లయితే , మీరు క్రీస్తు నుండి మిమ్మల్ని వేరుచేసుకున్నారు; దేవుడు ఇకపై మీ పట్ల దయతో వ్యవహరించడు. (గలతీయులు 5: 4 యు.ఎస్.టి)

ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడాన్ని సమర్థించిని దానిని సూచించినప్పుడు వ్యంగ్యాన్ని వినియోగిస్తున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా ఎవ్వరూ నీతిమతులుగా తీర్చబడరని పౌలు అప్పటికే వారికి బోధించాడు. వారు ధర్మశాస్త్రం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారని పౌలు నిజంగా నమ్మలేదని చూపించడానికి యు.ఎల్.టి "నీతిమంతులుగా తీర్చబడడం” చుట్టూ ఉల్లేఖన గుర్తులను వినియోగిస్తుంది. ఇతర వ్యక్తులు నమ్ముతున్నారని స్పష్టం చేయడం ద్వారా ఇదే తలంపును యు.ఎస్.టి అనువదిస్తుంది. (చూడండి Irony)

సంగ్రహ వ్యక్తీకరణలు

యు.ఎల్.టి తరచుగా సంగ్రహ నామవాచకాలు, విశేషణాలు, భాషా రూపాలను వినియోగిస్తుంది. ఎందుకంటే ఇది బైబిలు వాక్య భాగాలను దగ్గరగా పోలియుండడానికి ఇది ప్రయత్నిస్తుంది. యు.ఎస్.టి అటువంటి సంగ్రహ వ్యక్తీకరణలను ఉపయోగించకూడదని ప్రయత్నిస్తుంది, ఎందుకంటే చాలా భాషలు సంగ్రహ వ్యక్తీకరణలను ఉపయోగించవు.

మీరు అనువదించినప్పుడు, ఈ ఆలోచనలను తెలియపరచడానికి లక్ష్య భాష ఏవిధంగా అంగీకరిస్తుందో మీరు నిర్ణయించుకోవాలి. (చూడండి Abstract Nouns)

దేని గురించి అంటే, క్రీస్తులో మీరు ప్రతి విషయంలో మాట్లాడే సామర్థ్యమంతటిలోనూ జ్ఞానమంతటిలోనూ అభివృద్ధి చెందారు. (1 కొరింథీయులు 1:5 యు.ఎల్.టి)

క్రీస్తుయేసు మీకు అనేకమైన వాటిని అనుగ్రహించాడు ఆయన సత్యాన్ని మాట్లాడడంలోనూ, దేవుణ్ణి తెలుసుకోవడంలోనూ ఆయన మీకు సహాయం చేసాడు. (1 కొరింథీ 1:5 యు.ఎస్.టి)

ఇక్కడ యు.ఎల్.టి వ్యక్తీకరణలు "సత్యమంతటినీ మాట్లాడే సామర్ధ్యం" "జ్ఞానమంతంతటి యందు” సంగ్రహ నామవాచక వ్యక్తీకరణలు. వాటితో ఉన్న ఒక సమస్య ఏమిటంటే, ఎవరు మాట్లాడాలి, వారు ఏమి మాట్లాడాలి, లేదా తెలుసుకోవడం ఎవరు చెయ్యాలి, వారు ఏమి తెలుసుకోవాలి అనేవి ఏమిటో పాఠకులకు తెలియకపోవచ్చు. ఈ ప్రశ్నలకు యు.ఎల్.టి సమాధానం ఇస్తుంది.

ముగింపు

సారాంశంలో, యు.ఎల్.టి మీకు అనువదించడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఆదిమ బైబిలు గ్రంథాలు ఏ రూపంలో ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. యు.ఎస్.టి మీకు అనువదించడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇది యు.ఎల్‌.టి వాక్యభాగం అర్ధాన్ని స్పష్టంగా చెప్పడంలో సహాయపడుతుంది, బైబిలు వాక్యభాగంలోని ఆలోచనలను మీ స్వంత అనువాదంలో స్పష్టంగా చెప్పడానికి ఇది మీకు వివిధ మార్గాలను అందిస్తుంది.