te_ta/translate/figs-irony/01.md

15 KiB

వర్ణన

వ్యంగ్యోక్తి అంటే మాట్లాడేవాడు తాను చెప్పదలుచుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకమైన అక్షరార్థం ఇచ్చే పదాలు పలికే భాషాలంకారం. కొన్ని సార్లు ఆ వ్యక్తి ఇతరుల మాటలు ఉపయోగించుకుంటాడు గానీ తాను వాటితో ఏకిభవించడం లేదనేది నర్మగర్భంగా స్పష్టం చేస్తుంటాడు. విషయం ఎలా ఉండాలో అనే దానికి అది ఎంత భిన్నంగా ఉందో చెప్పడానికి ఈ ప్రక్రియ వాడుతుంటారు. లేదా ఎదుటి వ్యక్తి నమ్ముతున్నది ఎంత పొరపాటో బుద్ధిహీనతో చెప్పడానికి ఇలా మాట్లాడతారు. కొన్నిసార్లు ఇది చాలా హాస్యభరితంగా ఉంటుంది.

అందుకు యేసు, “రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడక్కర లేదు. పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు” అన్నాడు." (లూకా 5:31-32 TELIRV)

యేసు “నీతిమంతుల” గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా నీతిపరుల గురించి కాదు, తాము నీతి పరులమని భ్రమలో ఉన్నవారి గురించి. వ్యంగ్యోక్తి ఉపయోగించడం ద్వారా యేసు కొందరు మనుషులు తాము ఇతరులకన్నా మంచివారమనీ పశ్చాత్తాప పడనవసరం లేదనీ అనుకోవడం పొరపాటు అని చెబుతున్నాడు.

ఇది అనువాద సమస్య అనడానికి కారణాలు

  • మాట్లాడే వాడు వ్యంగ్యోక్తి గా మాట్లాడుతున్నాడని శ్రోత గ్రహించకపోతే అతడు చెబుతున్న దాన్ని నిజంగా నమ్మే ప్రమాదం ఉంది. రాసిన దాని అర్థానికి వ్యతిరేక భావం పాఠకుడు తీసుకుంటాడు.

బైబిల్ నుండి ఉదాహరణలు

మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు (మార్కు 7:9 TELIRV)

ఇక్కడ యేసు స్పష్టంగా తప్పు అని తెలుస్తున్నదాన్ని చేస్తున్నందుకు పరిసయ్యులను మెచ్చుకుంటున్నాడు. వ్యంగ్యోక్తి ద్వారా మెప్పుకు వ్యతిరేక భావం వ్యక్తపరుస్తున్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నామని గర్వపడే పరిసయ్యులు దేవునికి ఎంత దూరంలో ఉన్నారంటే తమ ఆచారాల మూలంగా తాము దేవుని ఆజ్ఞలు మిరుతున్నామని గ్రహించడం లేదు. ఇక్కడ వ్యంగ్యోక్తి వాడడం పరిసయ్యుల పాపాన్ని మరింత కొట్టొచ్చినట్టుగా చూపెడుతున్నది.

"మీ వాదంతో రండి” అని యెహోవా అంటున్నాడు. “మీ రుజువులు చూపించండి” అని యాకోబు రాజు చెబుతున్నాడు. జరగబోయే వాటిని విశదపరచి మాకు తెలియజెప్పండి. గతంలో జరిగిన వాటిని మేం పరిశీలించి వాటి ఫలాన్ని తెలుసుకునేలా వాటిని మాకు తెలియజెప్పండి. (యెషయా 41:21-22 TELIRV)

విగ్రహాలకు తెలివీ, శక్తి ఉన్నాయన్నట్టు మనుషులు వాటిని పూజిస్తున్నారు. అలా చేస్తున్నందుకు యెహోవా వారిపై కోపంగా ఉన్నాడు అందుకే ఆయన వ్యంగ్యోక్తి ఉపయోగిస్తున్నాడు. రాబోయే కాలంలో ఏమి జరగనున్నదో చెప్పమని వాటిని సవాలు చేస్తున్నాడు. విగ్రహాలకు ఈ పని చేతకాదని ఆయనకు తెలుసు. అయిన వాటికి చేతనైనట్టే మాట్లాడుతూ ఎగతాళిగా వాటి చేతగానితనాన్ని ఎత్తి చూపుతున్నాడు. వాటిని పూజిస్తున్నందుకు ప్రజలను తిడుతున్నాడు.

వెలుగును, చీకటిని అవి ఉద్యోగాలు చేసే చోటులకు నువ్వు తీసుకుపోగలవా? వాటి పని అయిపోయాక వాటిని మళ్లీ వాటి ఇళ్ళకు తీసుకుపోగలవా? ఇవన్నీ నీకు తెలుసు కదా! నువ్వు అప్పటికే పుట్టావట గదా " నువ్వు బహు వృద్ధుడివి మరి! " (యోబు38:20, 21 TELIRV)

తాను జ్ఞానినని యోబు అనుకుంటున్నాడు. అది నిజం కాదని వ్యంగ్యోక్తి ద్వారా యెహోవా మాట్లాడుతున్నాడు. అండర్ లైన్ చేసిన రెండు వాక్యాలు వ్యంగ్యోక్తులు. అవి చెబుతున్న డానికి వ్యతిరేక అర్థాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే పైకి కనిపిస్తున్న అర్థం తప్పు అని బహిరంగంగా తెలిసిపోతున్నది. యోబు వెలుగు సృష్టినీ గురించి దేవుని ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదన్నది స్పష్టం. ఎందుకంటే యోబు ఎన్నెన్నో యుగాల తరవాత గానీ పుట్టలేదు.

ఇప్పటికే మీకు అవసరమైనవన్నీ మీరు సంపాదించుకున్నారంటనే! ఇప్పటికే ధనవంతులయ్యారంటనే! మా ప్రమేయం లేకుండానే మీరు రాజులైపోయారంటనే! అయినా, మీరు రాజులు కావడం మంచిదేగా, మేము కూడా మీతో కలిసి ఏలవచ్చు! (1 కొరింతి 4:8 TELIRV)

కొరింతి విశ్వాసులు తామెంతో జ్ఞానులమని, తమకు ఎవరి అవసరమూ లేదనీ అపోస్తలుడు పౌలు ఉపదేశం తమకు అవసరం లేదనీ అనుకుంటున్నారు. పౌలు ఇక్కడ వ్యంగ్యోక్తులు ఉపయోగిస్తూ తాను వైతో ఏకీభవిస్తున్నట్టు మాట్లాడుతూ వారెంత గర్వంగా ప్రవర్తిస్తున్నారో వాస్తవానికి వారెంత తెలివి లేని వారో చెబుతున్నాడు.

అనువాద వ్యూహాలు

మీ భాషలో వ్యంగ్యోక్తి చక్కగా అర్థం అవుతుంటే అలానే తర్జుమా చెయ్యండి. అలా కాకుంటే వేరే ఉపాయాలున్నాయి.

  1. మాట్లాడే వాడు వేరెవరో నమ్ముతున్నదాన్ని చెబుతున్నట్టు స్పష్టమయ్యేలా అనువదించండి.
  2. వ్యంగ్యోక్తిలో ఉద్దేశించిన అసలు భావాన్ని అనువాదం లో రాయండి. వ్యంగ్యోక్తి అసలు భావం మాట్లాడే వాడు ఉపయోగించిన పదాల అర్థాల్లో కనిపించేది కాదు. నిజమైన భావం అక్షరార్థ భావానికి వ్యతిరేకంగా ఉంటుంది.

అనువాద వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు

  1. మాట్లాడే వాడు వేరెవరో నమ్ముతున్నదాన్ని చెబుతున్నట్టు స్పష్టమయ్యేలా అనువదించండి.
  • మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు! (మార్కు 7:9 TELIRV)
    • మీ సంప్రదాయాల కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరెంతో యోగ్యంగా ప్రవర్తిస్తున్నారనుకుంటున్నారు
    • మీ సంప్రదాయాల కోసం దేవుని ఆజ్ఞలను మీరడం మంచి పని అనుకుంటున్నారు
  • ** పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు” అన్నాడు. ** (లూకా 5:32 TELIRV)
    • తాము నీతిమంతులం అనుకునే వారిని పిలవడానికి కాదు, పశ్చాత్తాప పడడానికి పాపులనే పిలవడానికి వచ్చాను
  1. వ్యంగ్యోక్తిలో ఉద్దేశించిన అసలు భావాన్ని అనువాదం లో రాయండి.
  • మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరు ఎంత బాగా మీరుతున్నారు! ! (మార్కు 7:9 TELIRV)
    • మీ సంప్రదాయాల కోసం దేవుని ఆజ్ఞలు మిరడం ద్వారా మీరు చాలా చెడ్డ పని చేస్తున్నారు
  • **" మీ వాదంతో రండి” అని యెహోవా అంటున్నాడు. "“మీ రుజువులు చూపించండి” అని యాకోబు రాజు చెబుతున్నాడు. జరగబోయే వాటిని విశదపరచి మాకు తెలియజెప్పండి. గతంలో జరిగిన వాటిని మేం పరిశీలించి వాటి ఫలాన్ని తెలుసుకునేలా వాటిని మాకు తెలియజెప్పండి." ** (యెషయా 41:21-22 TELIRV)
    • మీ వాదంతో రండి” అని యెహోవా అంటున్నాడు. "“మీ విగ్రహాలు అలాటి రుజువులు చూపించలేవు.” అని యాకోబు రాజు చెబుతున్నాడు. జరగబోయే వాటిని విశదపరచి మాకు తెలియజెప్పండి. గతంలో జరిగిన వాటిని మేం పరిశీలించి వాటి ఫలాన్ని తెలుసుకునేలా వాటిని మాకు తెలియజెప్పండి."**
  • **>వెలుగును, చీకటిని అవి ఉద్యోగాలు చేసే చోటులకు నువ్వు తీసుకుపోగలవా?

** వాటి పని అయిపోయాక వాటిని మళ్లీ వాటి ఇళ్ళకు తీసుకుపోగలవా? ** ** ఇవన్నీ నీకు తెలుసు కదా! నువ్వు అప్పటికే పుట్టావట గదా **" నువ్వు బహు వృద్ధుడివి మరి! " (యోబు38:20, 21 TELIRV)

  • వెలుగును, చీకటిని అవి ఉద్యోగాలు చేసే చోటులకు నువ్వు తీసుకుపోగల వన్నట్టు ప్రవర్తిస్తున్నావే? వాటి పని అయిపోయాక వాటిని మళ్లీ వాటి ఇళ్ళకు తీసుకుపోగలవా? ఇవన్నీ నీకు తెలునట్టు మాట్లాడుతున్నావే. నేను సృష్టి చేసినప్పటికే నువ్వు పుట్టావన్నట్టు ప్రవర్తిస్తున్నావే