te_ta/translate/figs-explicit/01.md

22 KiB

ఊహించుకొన్న జ్ఞానం అంటే తాను మాట్లాడడానికి ముందే తన పాఠకులకు తెలుసు అని వక్త ఊహిస్తాడు, మరియు వారికి కొంత వరకు సమాచారం ఇస్తాడు. వక్త లేక రచయిత ఈ సమాచారాన్ని పాఠకులకు లేక పాఠకులకు ఇవ్వరు ఎందుకంటే వారికి ఇది ఇప్పటికే తెలుసునని వారు నమ్ముతారు.

వక్త తన శ్రోతకు సమాచారాన్ని ఇచ్చినప్పుడు, అతడు రెండు విధాలుగా చేయగలడు. వక్త తాను నేరుగా చెప్పే వాటిలో స్పష్టమైన సమాచారం ఇస్తాడు. తన శ్రోతలు తాను చెప్పే ఇతర విషయాల నుండి నేర్చుకోగలరని ఎదురుచూస్తున్న కారణంగా వక్త నేరుగా చెప్పాడు, దీనినే అంతర్గత సమాచారం అంటాము.

వివరణ

ఎవరైనా మాట్లాడేటప్పుడు గానీ లేదా రాసేటప్పుడు గానీ ప్రజలు తెలుసుకోవాలనీ లేదా చేయాలనీ, లేదా ఆలోచించాలని కోరుకొనే ఒక నిర్దిష్టమైనది అంశం ఉంటుంది. సాధారణంగా అతడు దీనిని నేరుగా చెపుతాడు. ఇది స్పష్టమైన సమాచారం.

ఈ సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి వారు ఆలోచించాల్సిన కొన్ని విషయాలు తన పాఠకులకు ఇప్పటికే తెలుసు అని వక్త ఊహిస్తాడు. సాధారణంగా ఈ విషయాలను అతను ప్రజలకు చెప్పడు, ఎందుకంటే వారికి అవి ఇప్పటికే తెలుసు. దీనిని ఊహించుకొన్న జ్ఞానం అంటారు.

తన ప్రేక్షకులు తాను చెప్పినదాని నుండి నేర్చుకోవాలని తాను ఆశించే ప్రతిదానిని వక్త ఎప్పుడూ నేరుగా చెప్పడు. అంతర్గత సమాచారం అతను నేరుగా చెప్పకపోయినా అతను చెప్పినదాని నుండి ప్రజలు నేర్చుకోవాలని అతను ఆశించే సమాచారం.

తరచుగా, శ్రోతలు తమకు ఇప్పటికే తెలిసిన వాటిని (ఊహించుకొన్న జ్ఞానం) వక్త నేరుగా చెప్పే స్పష్టమైన సమాచారంతో కలపడం ద్వారా ఈ అంతర్గత సమాచారాన్ని అర్థం చేసుకుంటారు.

కారణాలు ఇది ఒక అనువాదం సమస్య

వక్త సందేశంలో మూడు రకాల సమాచారం భాగంగా ఉంటుంది. వీటిలో ఒక సమాచారం తప్పిపోయినట్లయితే, ప్రేక్షకులు సందేశాన్ని అర్థం చేసుకోలేరు. లక్ష్య అనువాదం బైబిలు భాషకు చాలా భిన్నమైన భాషలో ఉన్న కారణంగానూ మరియు బైబిలులోని వ్యక్తుల కంటే చాలా భిన్నమైన సమయములోనూ, ప్రదేశంలోనూ నివసించే శ్రోతల కోసం సిద్ధపరచబడిన కారణంగానూ అనేకసార్లు ఊహించుకొన్న జ్ఞానం గానీ లేదా అంతర్గత సమాచారం గానీ సందేశం నుండి తప్పిపోతుంది. మరో మాటలో చెప్పాలంటే, ఆధునిక పాఠకులకు బైబిలులోని ఆరంభ వక్తలు మరియు పాఠకులకు తెలిసిన ప్రతీది తెలియదు. సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు ముఖ్యమైనప్పుడు, ఈ సమాచారాన్ని మీరు వచనంలోగానీ లేదా ఫుట్‌నోట్‌లో గానీ చేర్చినట్లయితే ఇది సహాయపడుతుంది.

బైబిలు నుండి ఉదాహరణలు

అంతట ఒక శాస్త్రి ఆయన దగ్గరకు వచ్చాడు మరియు ఇలా అన్నాడు, “బోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంటవచ్చెదను.” అందుకు యేసు చెప్పాడు, “నక్కలకు బొరియలు ఉన్నాయి మరియు ఆకాశపక్షులకు నివాసములును ఉన్నాయి అయితే మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదు. (మత్తయి 8:19-20 ULT)

నక్కలూ, పక్షులూ వాటి బొరియలనూ, నివాసాలనూ వేటికోసం వినియోగిస్తాయి అని యేసు చెప్పలేదు. ఎందుకంటే నక్కలు భూమిలో ఉన్న బొరియలలో నిద్రిస్తాయి, పక్షులు గూళ్ళలో నిద్రిస్తాయి అని శాస్త్రికి తెలుసు అని ఆయన ఊహించాడు. ఇది ఊహించుకొన్న జ్ఞానం.

ఇక్కడ యేసు నేరుగా “నేను మనుష్యకుమారున్ని” అని చెప్పలేదు, అయితే ఒకవేళ ఈ విషయం శాస్త్రికి లేఖకుడికి అప్పటికే తెలియకపోతే, ఈ వాస్తవం తనను తాను ఆ విధంగా ప్రస్తావించినందున ఇది అతడు నేర్చుకోగల అంతర్గత సమాచారం అవుతుంది. అంతేకాకుండా తాను చాలా ప్రయాణం చెసాడనీ మరియు ప్రతి రాత్రి ఆయన విశ్రాంతి తీసుకోడానికి ఇల్లు లేదని స్పష్టంగా చెప్పలేదు. తన తల వాల్చుకోడానికి ఎక్కడా స్థలం లేదని యేసు చెప్పినప్పుడు ఇది శాస్త్రి నేర్చుకోగల అంతర్గత సమాచారం అవుతుంది.

మీకు శ్రమ, కొరాజీనా, మీకు శ్రమ బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు. అయితే నేను మీతో చెపుతున్నాను, విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. (మత్తయి 11:21-22 ULT)

తాను మాట్లాడుతున్న ప్రజలకు తూరు, సీదోను ప్రాంతాలు చాలా దుర్మార్గమైనవనీ, మరియు తీర్పు రోజున ప్రతి వ్యక్తినీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడనీ తెలుసు అని యేసు ఊహించాడు. తాను మాట్లాడుతున్న విశ్వసించిన ప్రజలు మంచివారని, పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదని యేసుకు కూడా తెలుసు. యేసు వారికి ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఊహించుకొన్న జ్ఞానం.

ఇక్కడ ఆయన మాట్లాడుతున్న ప్రజలు తూరు సీదోను తీర్పు తీర్చబడడం కంటే తీవ్రంగా తీర్పు తీర్చబడడడం అంతర్గత సమాచారం లో ముఖ్యమైన భాగం. ఎందుకంటే వారు పశ్చాత్తాపపడలేదు.

నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారు? ఎందుకంటే **వారు చేతులు కడుగుకొనకుండ వారు రొట్టెను భుజిస్తున్నారు. (మత్తయి 15:2 ULT)

భుజించడానికి ముందు ఆచారంగా శుభ్రపరచుకోవడానికి ప్రజలు చేతులు కడుక్కోవడం పెద్దల పారంపర్యాచారాలలో ఒకటి. నీతిమంతులుగా ఉండడానికి పెద్దల పారంపర్యాచారాలన్నిటినీ పాటించాలని ప్రజలు భావించారు. యేసుతో మాట్లాడుతున్న పరిసయ్యులు ఆయనకు ఇది తెలుస్తుందని ఊహించిన జ్ఞానం. ఈ మాట చెప్పడం ద్వారా, ఆయన శిష్యులు పారంపర్యాచారాలను పాటించలేదని, మరియు అందువల్ల వారు నీతిమంతులుగా ఉండలేదని వారు ఆరోపించారు. ఇది అంతర్గత సమాచారం, వారు చెప్పినదాని నుండి ఆయన అర్థం చేసుకోవాలని వారు కోరుకున్నారు.

అనువాదం వ్యూహాలు

స్పష్టమైన సమాచారంతో కూడిన ఏదైనా ముఖ్యమైన అంతర్గత సమాచారంతో పాటు ఒక సందేశాన్ని అర్థం చేసుకోడానికి పాఠకులకు ఊహించుకొన్న జ్ఞానం ఉన్నట్లయితే చెప్పబడని ఆ జ్ఞానసమాచారాన్ని విడిచి పెట్టడం మరియు అంతర్గత సమాచారాన్ని అంతర్గతంగా విడిచిపెట్టడం మంచిది. వీటిలో ఒకటి తప్పిపోయిన కారణంగా పాఠకులకు సందేశం అర్థం కాకపోయినట్లయితే ఈ వ్యూహాలను అనుసరించండి:

(1) పాఠకులకు నిర్దిష్ట జ్ఞానం లేని కారణంగా వారు సందేశాన్ని అర్థం చేసుకోలేకపోయినట్లయితే, ఆ జ్ఞానాన్ని స్పష్టమైన సమాచారంగా అందించండి. (2) పాఠకులకు నిర్దిష్ట అంతర్గత సమాచారం తెలియని కారణంగా సందేశాన్ని అర్థం చేసుకోలేకపోయినట్లయితే, ఆ సమాచారాన్ని స్పష్టంగా పేర్కొనండి, అయితే ఆ సమాచారం ఆదిమ పాఠకులకు నూతనంగా ఉన్నదని సూచించని విధంగా దీనిని చేయడానికి ప్రయత్నించండి.

అన్వయించబడిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు

(1) పాఠకులకు నిర్దిష్ట జ్ఞానం లేని కారణంగా వారు సందేశాన్ని అర్థం చేసుకోలేకపోయినట్లయితే, ఆ జ్ఞానాన్ని స్పష్టమైన సమాచారంగా అందించండి.

అందుకు యేసు చెప్పాడు, “నక్కలకు బొరియలు ఉన్నాయి మరియు ఆకాశపక్షులకు నివాసములును ఉన్నాయి అయితే మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదు. (మత్తయి 8:20 ULT)

నక్కలు వాటి బొరియలలో నిద్రిస్తాయి, మరియు పక్షులు తమ గూళ్ళలో నిద్రిస్తాయి అనేడి ఊహించుకొన్న జ్ఞానం.

యేసు చెప్పాడు, “నక్కలకు బొరియలు ఉన్నాయి మరియు ఆకాశపక్షులకు నివాసములును ఉన్నాయి అయితే మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదు.

విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. (మత్తయి 11:22 ULT)

తూరు, మరియు సీదోను ప్రజలు చాలా చాలా దుర్మార్గమైనవారు అనేది ఊహించుకొన్న జ్ఞానం. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు.

విమర్శదినమందు మీ గతికంటె చాలా దుష్టులైన ప్రజలను కలిగిన ఆ తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వతగినదై ఉంటుంది, యుండునని మీతో చెప్పుచున్నాను.

నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారు? ఎందుకంటే వారు రొట్టెను భుజిస్తున్నప్పుడు **వారు చేతులు కడుగుకొనరువ. (మత్తయి 15:2 ULT)

పెద్దల పారంపర్యాచారాలలో ప్రజలు ఆచారపరంగా భోజనం చేయడానికి ముందు శుద్ధిగా ఉండడానికి వారు చేతులు కడుగుకోవడం తద్వారా వారు నీతిమంతులుగా ఉండడం ఒక ఆచారం అనేది ఊహించుకొన్న జ్ఞానం. ఆధునిక పాఠకుడు ఆలోచించినట్లు రోగాలను తప్పించుకోడానికి క్రిములను తొలగించుకోవడం కాదు.

నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారు? ఎందుకంటే వారు భోజనం చేసేటప్పుడు నీతి సంబంధమైన విధి చేతులు శుభ్రపరచుకొనే ఆచారాన్ని పాటించడం లేదు.

(2) పాఠకులకు నిర్దిష్ట అంతర్గత సమాచారం తెలియని కారణంగా సందేశాన్ని అర్థం చేసుకోలేకపోయినట్లయితే, ఆ సమాచారాన్ని స్పష్టంగా పేర్కొనండి, అయితే ఆ సమాచారం ఆదిమ పాఠకులకు నూతనంగా ఉన్నదని సూచించని విధంగా దీనిని చేయడానికి ప్రయత్నించండి.

అంతట ఒక శాస్త్రి ఆయన దగ్గరకు వచ్చాడు మరియు ఇలా అన్నాడు, “బోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంటవచ్చెదను.” అందుకు యేసు చెప్పాడు, “నక్కలకు బొరియలు ఉన్నాయి మరియు ఆకాశపక్షులకు నివాసములును ఉన్నాయి అయితే మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదు. (మత్తయి 8:19-20 ULT)

యేసు తానే మనుష్యకుమారుడు అనేది అంతర్గత సమాచారం. ఒకవేళ శాస్త్రి యేసును వెంబడించాలని కోరినట్లయితే యేసు మాదిరిగా, అతను ఇల్లు లేకుండా జీవించవలసి ఉంటుంది.

యేసు చెప్పాడు, “నక్కలకు బొరియలు ఉన్నాయి, మరియు ఆకాశపక్షులకు నివాసములును ఉన్నాయి, మనుష్యుకుమారుడనైన నాకు విశ్రమించడానికి స్థలం లేదు. నీవు నన్ను వేమ్బదించాలని కోరినట్లయితే నేనున్న చోటనే నీవు ఉంటావు అయితే మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదు. (మత్తయి 8:19-20 ULT)

విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండును. (మత్తయి 11:22 ULT)

దేవుడు మనుష్యులకు తీర్పు తీర్చడమే కాదు, ఆయన వారిని శిక్షిస్తాడు అనేది అంతర్గత సమాచారం. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు.

విమర్శదినమందు దేవుడు చాలా దుర్మార్గులైన ప్రజలున్న తూరు సీదోనులను శిక్షిస్తాడు వారిని మిమ్మల్ని శిక్షించే దాని కన్నా తక్కువగా శిక్షిస్తాడు. లేదా: విమర్శదినమందు దేవుడు చాలా దుర్మార్గులైన ప్రజలున్న తూరు సీదోనులను శిక్షిస్తాడు వారిని మిమ్మల్ని శిక్షించే దాని కన్నా తక్కువగా శిక్షిస్తాడు.

బైబిలులోని ప్రజలకు మరియు మొదట చదివిన వారికి తెలిసిన కొన్ని విషయాలు ఆధునిక పాఠకులకు తెలియకపోవచ్చు. వక్త లేదా రచయిత చెప్పేది అర్థం చేసుకోవడం మరియు వక్త అంతర్గతంగా విడిచిపెట్టిన విషయాలను నేర్చుకోవడం వారికి కష్టతరంగా ఉండవచ్చు. చేస్తుంది. ఆదిమ వక్త లేదా రచయిత అంతర్గతంగా విడిచిపెట్టిన కొన్ని విషయాలను అనువాదంలో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అనువాదకులకు ఉంది.