te_ta/translate/figs-events/01.md

11 KiB

వర్ణన

బైబిల్లో సంఘటనలను కొన్ని సార్లు అవి జరిగిన కాల క్రమం చొప్పున రాయరు. కొన్ని సార్లు రచయిత తాను చెబుతున్న దానికి కొంతకాలం ముందు జరిగిన వాటిని చర్చించాలని పూనుకుంటాడు. చదివే వారికి ఇది కొంత గందరగోళంగా అనిపిస్తుంది.

** ఇది అనువాద సమస్య అనడానికి కారణాలు: ** సంభవాలను చెప్పిన క్రమంలోనే అవి జరిగాయని పాఠకుడు అనుకోవచ్చు. వాటి కాలక్రమం సరిగా అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం.

బైబిల్ నుండి ఉదాహరణలు

హేరోదు ... యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు. ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. (లూకా3:20-21 TELIRV)

యోహానును చెరసాలలో పెట్టిన తరువాత అతడు యేసుకు బాప్తిసం ఇచ్చాడనే అర్థం రావచ్చు. కానీ అతణ్ణి బంధించక ముందే యేసుకు బాప్తిసం ఇచ్చాడు.

యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు, ఏడు పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ, ఆ బూరలు ఊదుతుండగా యెహోవా నిబంధన మందసం కూడా వారి వెంట నడిచింది. యోధులు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. సైన్యం వెనక భాగం మందసం వెంట వచ్చింది. యాజకులు వెళ్తూ బూరలు ఊదుతున్నారు. యెహోషువ “మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి” అని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు." (యెహోషువా 6:8-10 TELIRV)

సైన్యం నడవడం మొదలుపెట్టిన తరువాత యెహోషువా ఆజ్ఞ ఇచ్చినట్టు అర్థం రావచ్చు. కానీ అతడు అంతకు ముందే ఆజ్ఞ ఇచ్చాడు.

“ఆ గ్రంథం సీలులు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” (ప్రకటన 5:2 TELIRV)

అంటే ఆ మనిషి మొదట చుట్టను విప్పి ఆ తరువాత ముద్రలు తెరవాలి అన్నట్టు అర్థం రావచ్చు. కానీ ముద్రలు విప్పిన తరువాతే చుట్టను విప్పగలరు.

అనువాద వ్యూహాలు

  1. చెప్పుతున్న సంఘటనకు ముందే ఏదో జరిగినట్టు మీ భాషలో పదాలు సూచిస్తుంటే ఈ వ్యూహాలను ఉపయోగించాలి.
  2. చెప్పుతున్న సంఘటనకు ముందే ఏదో జరిగినట్టు మీ భాషలో క్రియాపదం సూచిస్తుంటే ఈ వ్యూహాలను ఉపయోగించాలి. (చూడండి: క్రియాపదాల గురించి వివరించే విభాగం Verbs)
  3. సంఘటనల జరిగిన క్రమంలోనే చెప్పడం మీ భాషలో మంచిది అనిపిస్తే ఆ క్రమంలో వచ్చేలా సంభవాలను అమర్చండి. ఇందుకు రెండు మూడు వచనాలను కలిపి రాయవలసి రావచ్చు. (ఉదాహరణకు 5-6). (చూడండి: Verse Bridges)

అనువాద వ్యూహాలు అన్వయించిన దానికి ఉదాహరణలు

  1. చెప్పుతున్న సంఘటనకు ముందే ఏదో జరిగినట్టు మీ భాషలో కాలాన్ని తెలిపే పదాలు సూచిస్తుంటే ఈ వ్యూహాలను ఉపయోగించాలి
  • **20 హేరోదు ... యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు. ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. 21 ** (లూకా3:20-21 TELIRV)
    • 20 హేరోదు ... యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు 21 యోహానును చెరసాలలో వేయక ముందే ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు.
  • **“ఆ గ్రంథం సీలులు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” ** (ప్రకటన5:2 TELIRV)
    • గ్రంథం విప్పే వారు ఎవరు ముద్రలు విప్పిన తరువాత
  1. చెప్పుతున్న సంఘటనకు ముందే ఏదో జరిగినట్టు మీ భాషలో క్రియాపదం సూచిస్తుంటే ఈ వ్యూహాలను ఉపయోగించాలి.
  • *8 > యోధులు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. సైన్యం వెనక భాగం మందసం వెంట వచ్చింది. ...10 యాజకులు వెళ్తూ బూరలు ఊదుతున్నారు10. యెహోషువ “మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి” అని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు." (యెహోషువా 6:8-10 TELIRV)
    • 8 యెహోషువ “మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినిపించనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. sup>10</sup
  1. సంఘటనలు జరిగిన క్రమంలోనే చెప్పడం మీ భాషలో మంచిది అనిపిస్తే ఆ క్రమంలో వచ్చేలా సంఘటనలను అమర్చండి. ఇందుకు రెండు మూడు వచనాలను కలిపి రాయవలసి రావచ్చు.
  • *8 యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు, ఏడు పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ, ఆ బూరలు ఊదుతుండగా...10 యెహోవా నిబంధన మందసం కూడా వారి వెంట నడిచింది. యోధులు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. సైన్యం వెనక భాగం మందసం వెంట వచ్చింది. యాజకులు వెళ్తూ బూరలు ఊదుతున్నారు. యెహోషువ “మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినిపించనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి” అని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు." (యెహోషువా 6:8-10 TELIRV) (యెహోషువా 6:8-10 TELIRV)
    • 8-10 యెహోషువ “మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు." యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు, ఏడు పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ, ఆ బూరలు ఊదుతుండగా...<
  • ** ఆ గ్రంథం సీలులు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” ** (ప్రకటన 5:2 TELIRV)
    • సీలు విప్పి ఆ గ్రంథం తెరవగలిగే వారు ఎవరు?

. దగ్గర విడియో కూడా చూడవచ్చు.