te_ta/translate/translate-versebridge/01.md

10 KiB
Raw Permalink Blame History

వివరణ

అరుదైన సందర్భాల్లో, 17-18 వంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ పద్య సంఖ్యలు కలిపినట్లు మీరు విశాలపరచిన అక్షరార్ధ వాక్య భాగం లేదా (యు.ఎల్‌.టి) లేదా విశాలపరచిన వాక్య క్లుప్తీకరించిన వాక్యభాగం (యు.ఎస్‌.టి) లో చూస్తారు. దీనిని వచన వారధి అంటారు. కథ లేదా సందేశాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా వచనాలలోని సమాచార క్రమం తిరిగి మార్చబడింది

29 హోరీ సంతతివాళ్ళలో నాయకులెవరంటే, లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, >30 దిషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు, వీరు వాళ్ళ వంశాలప్రకారం శేయీరు దేశంలోని హోరీ వాళ్ళ నాయకులు. (ఆదికాండము 36:29-30 యు.ఎల్.టి)

29-30 హోరీ సంతతి అయిన వీరు వాళ్ళ వంశాలప్రకారం శేయీరు దేశంలో నివసించారు. హోరీ సంతతివాళ్ళలో నాయకులెవరంటే, లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దిషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు,. (ఆదికా36:29-30 యు.ఎస్.టి)

యు.ఎల్.టి వాక్యభాగంలో 29, 30 వచనాలు వేరుగా ఉన్నాయి. శేయీరులో నివసిస్తున్న ప్రజలను గురించిన సమాచారం 30 వచనం చివరిలో ఉంది. యు.ఎస్.టి వాక్యభాగంలో వచనాలు కలుపబడ్డాయి. శేయీరులో నివసిస్తున్న వారిని గురించిన సమాచారం వచనం ఆరంభంలో ఉంది.

బైబిలు నుండి ఉదాహరణలు

కొన్నిసార్లు యు.ఎల్.టి లో వచనాలు వేరుగా ఉన్నాయి. అయితే యు.ఎస్.టి లో వచన వారధి ఉంది.

4 మీలో బీదలంటూ ఎవ్వరూ ఉండరు. మీరు మీ వారసత్వంగా స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. >5 ఈ రోజు నేను మీ కాజ్ఞాపించే ఈ ఆజ్ఞలన్నిటిప్రకారం నడుచుకోవడానికి మీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వింటే,

4-5 మీరు మీ వారసత్వంగా స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. ఈ రోజు నేను మీ కాజ్ఞాపించే ఈ ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకోవడానికి మీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వింటే, మీలో బీదలంటూ ఎవ్వరూ ఉండరు. (ద్వితియోపదేశకాండం 15:4-5 యు.ఎస్.టి)

యు.ఎల్.టి లో కూడా కొన్ని వచన వారధులు ఉన్నాయి.

17-18 ఎజ్రా కొడుకులు: యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్యలలో ఒకతె మిర్యాంనూ, షమ్మయినీ, ఇష్‌బాహునూ కన్నది. ఇష్‌బాహు ఎష్‌టెమోయకు తండ్రి. యెరెదు పెళ్ళిచేసుకొన్న ఫరో కూతురైన బిత్యా కన్న కొడుకులు వీరే. యూదురాలైన అతని భార్యకు గెదోరు తండ్రి అయిన యెరెదు, శోకో తండ్రి అయిన హెబెరు, జానోహ తండ్రి అయిన యెకూతీయేల్ జన్మించారు. (1 దినవృత్తాంతములు 4:17-18 యు.ఎల్.టి)

యు.ఎల్.టి 18 వచనం నుండి గుర్తించిన వాక్యాన్ని బిత్యా కుమారులను మరింత స్పష్టంగా చూపించడానికి 17 వచనానికి మార్పు చేసింది. ఇక్కడ ప్రారంభ క్రమం ఉంది, ఇది అనేకమైన పాఠకులను గందరగోళపరుస్తుంది.

17 ఎజ్రా కొడుకులు: యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్యలలో ఒకతె మిర్యాంనూ, షమ్మయినీ, ఇష్‌బాహునూ కన్నది. ఇష్‌బాహు ఎష్‌టెమోయకు తండ్రి. 18 యెరెదు పెళ్ళిచేసుకొన్న ఫరో కూతురైన బిత్యా కన్న కొడుకులు వీరే. యూదురాలైన అతని భార్యకు గెదోరు తండ్రి అయిన యెరెదు, శోకో తండ్రి అయిన హెబెరు, జానోహ తండ్రి అయిన యెకూతీయేల్ జన్మించారు. (1 దినవృత్తాంతములు 4:17-18 టి.ఎం.కె)

అనువాద వ్యూహాలు

మీ పాఠకులకు స్పష్టంగా ఉండే విధానంలో సమాచారాన్ని క్రమపరచండి.

  1. మునుపటి వచనం నుండి సమాచారానికి ముందు మీరు ఒక వచనం నుండి సమాచారాన్ని ఉంచినట్లయితే, రెండు వచన సంఖ్యల మధ్య హైఫన్ ఉంచండి.

  2. యు.ఎల్‌.టి కి వచన వారధి ఉంటే, మీరు సూచించే మరొక బైబిల్‌లో ఒకటి లేనట్లయితే, మీరు మీ భాషకు ఉత్తమంగా పనిచేసే క్రమాన్ని ఎంచుకోవచ్చు.

TranslationStudio APP లోని వచనాలను ఏవిధంగా గుర్తించాలో చూడండి.

అన్వయించిన అనువాద వ్యూహాల ఉదాహరణలు

  1. మునుపటి వచనం నుండి సమాచారానికి ముందు మీరు ఒక వచనం నుండి సమాచారాన్ని ఉంచినట్లయితే, రెండు వచన సంఖ్యల మధ్య హైఫన్ ఉంచండి.
  • **2 అప్పుడు మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మూడు పట్టణాలు ప్రత్యేకించాలి. 3 మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశాన్ని మూడు ప్రాంతాలుగా చేసి ఆ పట్టణాలకు త్రోవలు తయారు చేయాలి. ఒకవేళ ఎవడైనా మరో వ్యక్తిని చంపితే ఆ పట్టణాలలో ఒకదానికి పారిపోయే విధంగా చేయాలి. **(ద్వితియోపదేశకాండము 19:2-3)
  • **2-3 అప్పుడు మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మూడు పట్టణాలు ప్రత్యేకించాలి. మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశాన్ని మూడు ప్రాంతాలుగా చేసి ఆ పట్టణాలకు త్రోవలు తయారు చేయాలి. ఒకవేళ ఎవడైనా మరో వ్యక్తిని చంపితే ఆ పట్టణాలలో ఒకదానికి పారిపోయే విధంగా చేయాలి. (ద్వితియోపదేశకాండము 19:2-3 యు.ఎస్.టి)
  1. యు.ఎల్‌.టి కి వచన వారధి ఉంటే, మీరు సూచించే మరొక బైబిల్‌లో ఒకటి లేనట్లయితే, మీరు మీ భాషకు ఉత్తమంగా పనిచేసే క్రమాన్ని ఎంచుకోవచ్చు.