te_ta/translate/figs-activepassive/01.md

12 KiB

కొన్ని భాషలు కర్తరి, కర్మణి వాక్యాలను రెంటినీ ఉపయోగిస్తాయి. కర్తరి వాక్యాలలో, కర్త చర్యను చేస్తుంది. కర్మణి వాక్యాలలో, కర్త చర్యను పొందుతుంది. వాటి అంశాలతో కూడిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:

  • కర్తరి: నా తండ్రి 2010 లో ఇల్లు నిర్మించారు.
  • కర్మణి: ఇల్లు 2010 లో నిర్మించబడింది.

అనువాదకులు తన బాషలో కర్మణి వాక్యాలను ఉపయోగించనప్పుడు వారు బైబిలులో వారు కనుగొన్న కర్మణి వాక్యాలను ఏవిధంగా అనువదించగలరో తెలుసుకోవాలి. ఇతర అనువాదకులు కర్మణి వాక్యాన్ని ఎప్పుడు ఉపయోగించాలో మరియు కర్తరి రూపాన్ని ఎప్పుడు ఉపయోగించాలో నిర్ణయించాల్సి ఉంటుంది.

వివరణ

కొన్ని భాషలు కర్తరి మరియు కర్మణి రూపాలు రెంటినీ కలిగియుంటాయి.

  • కర్తరి రూపంలో, కర్త చర్యను చేస్తుంది మరియు ఎల్లప్పుడూ ప్రస్తావించబడుతుంది.
  • కర్మణి రూపంలో, చర్య కర్తకు జరుగుతుంది, మరియు చర్య చేసేవాడు ఎల్లప్పుడూ ప్రస్తావించబడడు.

ఈ క్రింద కర్తరి మరియు కర్మణి వాక్యాల ఉదాహరణలలో, మేము ఈ అంశాన్ని స్పష్టం చేసాము.

  • కర్తరి: నా తండ్రి 2010 లో ఇల్లు నిర్మించారు.
  • కర్మణి: ఇల్లు 2010లో నా తండ్రి చేత నిరంచబడింది.
  • కర్మణి: ఇల్లు 2010 లో నిర్మించబడింది. (చర్య ఎవరు చేసారో ఈ వాక్యం చెప్పలేదు.)

కారణాలు ఇది ఒక అనువాదం సమస్య

అన్ని భాషలు కర్తరి రూపాలను ఉపయోగిస్తాయి. కొన్ని భాషలు కర్మణి రూపాలను ఉపయోగిస్తాయి మరియు కొన్ని ఉపయోగించవు. కొన్ని భాషలు కర్మణి రూపాలను కొన్ని ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తాయి మరియు కర్మణి రూపం దానిని ఉపయోగించే అన్ని భాషలలో ఒకే ప్రయోజనం కోసం ఉపయోగించబడదు.

కర్మణి గురించిన ఉద్దేశాలు

  • మాట్లాడేవారు చర్యను చేసిన వ్యక్తి గురించి గానీ చర్య జరిగించబడిన వస్తువును గురించి గానీ మాట్లాడుతున్నాడు.
  • చర్య ఎవరు చేశారో చెప్పడానికి స్పీకర్ ఇష్టపడరు.
  • చర్య ఎవరు చేశారో స్పీకర్‌కు తెలియదు

కర్మణి విషయంలో అనువాదం సూత్రాలు

  • కర్మణి రూపాలను ఉపయోగించని భాషలు కలియున్న అనువాదకులు ఆలోచనను వ్యక్తీకరించడానికి మరొక మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది.
  • కర్మణి రూపాలను ఉపయోగించే భాషలు కలిగియున్న అనువాదకులు బైబిలులోని ఒక నిర్దిష్ట వాక్యంలో కర్మణి వాక్యాలు ఉపయోగించబడ్డాయో అర్థం చేసుకోవాలి మరియు వాక్యం యొక్క అనువాదంలో ఆ ప్రయోజనం కోసం కర్మణి రూపాన్ని ఉపయోగించాలా వద్దా అని నిర్ణయించుకోవాలి.

బైబిలు నుండి ఉదాహరణలు

అప్పుడు ప్రాకారము మీద నుండి వారి విలుకాండ్రు మీ సేవకులమీద అంబులు వేశారు మరియు రాజు సేవకులలో కొందరు **చంపివేయబడ్డారు **, మరియు హిత్తీయుడగు ఊరియా కూడా **చంపివేయబడ్డాడు ** (2 సమూయేలు 11:24 ULT).

అంటే శత్రువు యొక్క విలుకాండ్రు అంబులు వేశారు మరియు ఉరియాతో సహా కొంతమంది రాజు సేవకులను చంపారు అని అర్థం. ఇక్కడ ముఖ్య విషయం, రాజు సేవకులకు మరియు ఉరియాకు ఏమి జరిగింది, వారిని ఎవరు చంపారు అని కాదు. ఇక్కడ కర్మణి రూపం ఉద్దేశం రాజు యొక్క సేవకులు మరియు ఉరియాల మీద దృష్టి నిలపడం.

ఆ ఊరి పురుషులు వేకువనే లేచారు మరియు బయలు యొక్క బలిపీఠము ముక్కలై కిందవేయబడ్డాయి. (న్యాయాధిపతులు 6:28ఎ ULT)

బయలు యొక్క బలిపీఠానికి ఏమి జరిగిందో పట్టణంలోని పురుషులు చూశారు, అయితే ఎవరు దానిని విచ్ఛిన్నం చేశారో వారికి తెలియదు. ఇక్కడ కర్మణి రూపం యొక్క ఉద్దేశ్యం ఈ సంఘటనను పట్టణంలోని పురుషుల కోణంలో తెలియజేయడం

అతని మెడ చుట్టూ తిరుగటిరాయి కట్టబడి మరియు సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. (లూకా 17:2ఎ ULT)

ఒక వ్యక్తి తన మెడ చుట్టూ ఒక తిరుగటి రాయితో సముద్రంలో అంతం అవుతున్న పరిస్థితిని ఇది వివరిస్తుంది. ఇక్కడ కర్మణి రూపం యొక్క ఉద్దేశ్యం ఈ వ్యక్తికి ఏమి జరుగుతుందో దానిమీద దృష్టి పెట్టడం. ఆ వ్యక్తికి ఈ పనులు ఎవరు చేస్తారు అనేది ముఖ్యం కాదు.

అనువాదం వ్యూహాలు

మీరు అనువదిస్తున్న వచనభాగంలో ఉన్న అదే ప్రయోజనం కోసం మీ భాష కర్మణి రూపాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, అప్పుడు కర్మణి రూపాన్ని ఉపయోగించండి. కర్మణి రూపం లేకుండా అనువదించడం మంచిదని మీరు నిర్ణయించుకుంటే, మీరు పరిగణించగల కొన్ని వ్యూహాలు ఇక్కడ ఉన్నాయి.

(1) కర్తరి వాక్యంలో ఒకే క్రియను వాడండి మరియు ఎవరు లేదా ఏ క్రియను చేసారో చెప్పండి. మీరు ఇలా చేసినట్లయితే, చర్యను స్వీకరించే వ్యక్తిమీద దృష్టిని పెట్టడానికి ప్రయత్నించండి. (2) కర్తరి వాక్యంలో ఒకే క్రియను వాడండి మరియు ఎవరు లేదా ఏ క్రియను చేసారో చెప్పకండి. దానికి బదులుగా, “వారు” లేదా “వ్యక్తులు” లేదా “ఎవరైనా” వంటి సాధారణ వ్యక్తీకరణను ఉపయోగించండి. (3) భిన్నమైన క్రియను వాడండి.

అన్వయించబడిన అనువాద వ్యూహాల ఉదాహరణలు

(1) కర్తరి వాక్యంలో ఒకే క్రియను వాడండి మరియు ఎవరు లేదా ఏ క్రియను చేసారో చెప్పండి. మీరు ఇలా చేసినట్లయితే, చర్యను స్వీకరించే వ్యక్తిమీద దృష్టిని పెట్టడానికి ప్రయత్నించండి.

రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇవ్వబడింది (యిర్మియా 37:21బి ULT)

రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టెను యిర్మియాకు రాజు సేవకులు ఇచ్చారు

(2) కర్తరి వాక్యంలో ఒకే క్రియను వాడండి మరియు ఎవరు లేదా ఏ క్రియను చేసారో చెప్పకండి. దానికి బదులుగా, “వారు” లేదా “వ్యక్తులు” లేదా “ఎవరైనా” వంటి సాధారణ వ్యక్తీకరణను ఉపయోగించండి.

అతని మెడ చుట్టూ తిరుగటిరాయి కట్టబడి మరియు సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. (లూకా 17:2ఎ ULT)

అతని మెడ చుట్టూ తిరుగటిరాయిని వారు కట్టి మరియు సముద్రములో పడద్రోయుట వానికి మేలు. అతని మెడ చుట్టూ తిరుగటిరాయిని ఎవరినా ఒకరు కట్టి మరియు సముద్రములో పడద్రోయుట వానికి మేలు.

(3) భిన్నమైన క్రియను వాడండి.

రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇవ్వబడింది (యిర్మియా 37:21బి ULT)

రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము అతడు ఒక రొట్టెని పొందాడు