te_tw/bible/other/water.md

5.9 KiB
Raw Permalink Blame History

నీరు, లోతైన

నిర్వచనము:

దీని ప్రాథమిక అర్ధానికి జతగా  “నీరు” అనే పదము అనేకమార్లు నీటి భాగాన్ని, అనగా సముద్రము, సాగరము, చెరువు లేక నది  వంటి వాటిని సూచిస్తుంది. .

  • “నీళ్ళు” అనే పదము నీటి భాగములను లేక నీటి యొక్క  అనేక వనరులను  సూచించును. సాధారణంగా ఇది అధిక మొత్తపు నీటిని సూచించుటకు  కూడా ఉపయోగించబడుతుంది.
  • “నీళ్ళు” అనే పదము అలంకారిక ఉపయోగములో అతి పెద్ద బాధను, కష్టాలను మరియు శ్రమలను సూచించును. ఉదాహరణకొరకు, మనము “జలములలో పడి వెళ్ళిన” దేవుడు మనతో ఉండును అని దేవుడు వాగ్ధానము చేసియున్నాడు.
  • “అనేకమైన జలములు” అనే మాట భయంకరమైన కష్టాలను సూచిస్తుంది.
  • పశువులకు మరియు ఇతర ప్రాణులకు “నీళ్ళు” పెట్టుట అనగా అవి త్రాగడానికి కావలిసిన “నీరును అందజేయుట” అని అర్థమైయున్నది. బైబిలు కాలములలో ఒక బక్కెట్టు తీసుకొని బావిలోని నీటిని చేది, అక్కడున్న ప్రాణులన్నియు త్రాగడానికి ఒక గంగాళములో పోయడమనేది జరిగేది.
  • “లోతైన” అనేది, సృష్టి ఆరంభములో ఉన్న అగాధ జలాలు లేక భూమి యొక్క ఉపరితలం క్రింద లోతుగా  విస్తరించిన, సముద్రాలు, సాగరాలు మొదలగు వాటిని సూచుస్తుంది.
  • పాత నిబంధనలో దేవుడు తనప్రజలకు “జీవ జలముల” ఊటగా ప్రస్తావించ బడ్డాడు. ఆత్మీయ శక్తికి మరియు పునరుద్ధరణకు అయనే మూలమని దీని అర్ధం.
  • ఒక వ్యక్తిలో క్రొత్త జీవితమును మరియు రూపాంతరమును తీసుకొని వచ్చే పరిశుద్దాత్ముని కార్యమును సూచించుటకు క్రొత్త నిబంధనలో  “జీవ జలము” అనే మాటను యేసు ఉపయోగించాడు

అనువాదం సూచనలు:

  • “నీళ్ళను చేదడం” అనే మాటను “ఒక బక్కెట్టుతో బావిలోని నీరును బయటకి తీయుట” అని కూడా అనువదించవచ్చు.
  • “వారిలోనుండి జీవ జలముల ఊటలు బయటకి పొర్లి పారును” అనే ఈ మాటను “పరిశుద్ధాత్మనుండి కలుగు శక్తి మరియు ఆశీర్వాదములు జీవ జలముల ఊటవలె వారిలోనుండి పెల్లుబికి పారును” అని కూడా అనువదించవచ్చు. “ఆశీర్వాదములకు” బదులుగా “వరములు” లేక “ఫలాలు” లేక “దైవిక ప్రవర్తన” అని కూడా ఉపయోగించవచ్చును.
  • యేసు బావి దగ్గర సమరయ స్త్రీతో చెప్పిన , “జీవ జలము” అనే మాటను “జీవమునిచ్చే నీళ్ళు” అని లేక “జీవమును కలిగించే నీరు” అని కూడా అనువదించవచ్చు. ఈ సందర్భములో నీటియొక్క ఊహా చిత్రాన్నిఅనువాదంలో ఉంచాలి.
  • సందర్భానుసారముగా, “నీళ్ళు” లేక “అనేక జలములు” అనే పదములను “గొప్ప శ్రమలు (నీళ్ళవలె నిన్ను ఆవరించినవి)” లేక “అధికమైన కష్టాలు (జల ప్రళయమువలె) లేక “అధిక మొత్తపు నీరు” అని కూడా అనువదించవచ్చు.

(ఈ పదాలను కూడా చూడండి: life, spirit, Holy Spirit, power)

బైబిల్ రెఫరెన్సులు:

పదం సమాచారం

  • Strongs: H2222, H4325, H4529, H4857, H7301, H7783, H8248, H8415, G05040, G42150, G42220, G52020, G52040