te_tw/bible/other/thresh.md

2.7 KiB

దుళ్ళగొట్టు

నిర్వచనము:

"దుళ్ళగొట్టు” మరియు “దుళ్ళగొట్టిన" అనే పదాలు గోదుమ ధాన్యం నుండి మిగతా గోదుమ మొక్కభాగాన్ని వేరు చేసే ప్రక్రియలో మొదటి భాగాన్ని సూచించడం కోసం ఉపయోగిస్తారు.

  • దుళ్ళగొట్టడం మూలంగా గోదుమ మొక్క నుండి ధాన్యం నుండి గడ్డి, పొట్టు రాలిపోతుంది. తరువాత ధాన్యం "తూర్పారబడతారు." పూర్తిగా ధాన్యం నుండి పనికి రాని దాన్ని వేరు చేస్తారు. కేవలం తినడానికి పనికి వచ్చే ధాన్యం మాత్రమే మిగులుతుంది.
  • బైబిల్ కాలాల్లో, "దుళ్ళగొట్టే కళ్ళం" అంటే పెద్ద సమతలమైన రాతి నేల, లేదా మట్టిని గట్టిగా అద్ది చేసిన నేల. దాని ఉపరితలం గట్టిగా ధాన్యం కంకుల నుండి ధాన్యం వేరు చేయడానికి వీలుగా ఉంటుంది.
  • "దుళ్ళగొట్టు బండి” లేక “దుళ్ళగొట్టు చక్రం" కొన్ని సార్లు ధాన్యాన్ని నలిపి పొట్టును వేరు చేయడానికి వినియోగిస్తారు.
  • "దుళ్ళగొట్టు బల్ల” లేక “దుళ్ళగొట్టు ఫలకం" కూడా ధాన్యం వేరు చేయడానికి ఉపయోగిస్తారు. కొయ్యతో చేసిన పలకలు ఉండి, లోహపు మేకులు కొట్టి దీన్ని తయారు చేస్తారు.

(చూడండి: chaff, grain, winnow)

బైబిల్ రిఫరెన్సులు:

  • 2 దిన 03:1-3
  • 2 రాజులు 13:6-7
  • 2 సమూయేలు 24:15-16
  • దానియేలు 02:34-35
  • లూకా 03:17
  • మత్తయి 03:10-12
  • రూతు 03:1-2

పదం సమాచారం:

  • Strong's: H0212, H4173, H1637, H1758, H1786, H1869, H2251, G02480