te_tw/bible/other/winnow.md

4.4 KiB
Raw Permalink Blame History

తూర్పారబట్టుట, జల్లించుట

నిర్వచనము:

“తూర్పారబట్టుట” మరియు “జల్లించుట” అనే పదాలు పనికిరాని గడ్డి పరక పొట్టు అనేవాటినుండి ధాన్యమును వేరుపరచడం అని అర్థము. పరిశుద్ధ గ్రంథములో ఆ రెండు పదాలు ప్రజలను వేరుపరచుటను మరియు విభజించుటను సూచించుటకు అలంకారిక భావనలో ఉపయోగించబడియున్నాయి.

  • “తూర్పారబట్టుట” అనే మాటకు మిళితమైన గడ్డి పరక పొట్టు ధాన్యములను గాలిలోనికి ఎగురవేయుట ద్వారా అనగా గడ్డి పరక పొట్టును వేరుపరచేటువంటి గాలి వచ్చినప్పుడు వాటిని గాలిలో పోయడం ద్వారా ధాన్యములను మరియు పనికిరాని ఇతర చెత్తను వేరుపరచడం అని అర్థము.
  • “జల్లెడ” అనే పదము ధాన్యమును జల్లెడ పట్టుటద్వారా అనవసరమైన రాళ్లు లేక దుమ్ము ధూళి అంతా ఒక ప్రక్కకు వచ్చి, శ్రేష్టమైన ధాన్యమును వేరుచేయుటను సూచిస్తుంది.
  • పాత నిబంధనలో “తూర్పారబట్టుట” మరియు “జల్లెడపట్టుట” అనే మాటలను అనీతిమంతులైన ప్రజలనుండి నీతిమంతులను వేరుపరచు క్లిష్ట పరిస్థితిని వివరించుటకు అలంకారికముగా ఉపయోగించబడియున్నాయి.
  • పేతురు మరియు ఇతర శిష్యులు తమ విశ్వాస మునందు ఎలా పరీక్షించబడుతారు అన్నదానిని గూర్చి యేసు సీమోను పేతురుతో అలంకారిక విధానములో చెబుతున్నప్పుడు, ఆయన “జల్లెడ” అనే పదమును ఉపయోగించారు.
  • ఈ పదములను తర్జుమా చేయుటకు అనువాద భాషలో ఈ విధముగా చేసే క్రియలను సూచించేటువంటి పదాలనే (మాటలను) ఉపయోగించండి; సాధ్యామైనంతవరకు తర్జుమా “కదలించుట” లేక “విసురుట” ద్వారా  తూర్పారబోయుట” అని ఉండవచ్చు. తూర్పారబెట్టుట లేక జల్లెడపట్టుట అనేవి తెలియకపోతే, ధాన్యమును మరియు అందులోని పొట్టును రాళ్ళను దుమ్మును వేరు చేసే ఇతర పధ్ధతి ఏదైనా ఉందంటే ఆ పేరు పెట్టి తర్జుమా చేయవచ్చు, లేకపోతె ఈ విదానమునే వివరించి వ్రాయవచ్చు.

(దీనిని కూడా చూడండి: తెలియనివాటిని అనువదించడము ఎలా How to Translate Unknowns)

(ఈ పదాలను కూడా చూడండి:chaff, grain)

బైబిల్ రెఫరెన్సులు:

పదం సమాచారం

  • Strongs: H2219, H5128, H5130, G44250, G46170