5.1 KiB
5.1 KiB
ఆడగొర్రె, ఆడగొర్రెలు, పొట్టేలు, పొట్టేళ్ళు, గొర్రెలు, గొర్రెల దొడ్డి, గొర్రెల దొడ్లు, గొర్రెల కాపర్లు, గొర్రెల చర్మములు
నిర్వచనము:
“గొర్రె” అనగా ఉన్ని దేహమును కలిగిన నాలుగు కాళ్ల ఒక చిన్న ప్రాణియైయుండును. మగ గొర్రెను “పొట్టేలు” అని పిలిచెదరు. పొట్టేళ్ళు కాని ప్రతి గొర్రెను “ఆడగొర్రె” అని పిలిచెదరు. “గొర్రె” అనే పదానికి బహువచనము “గొర్రెలు” పిలిచెదరు.
- గొర్రెకు పుట్టిన పిల్లను “గొర్రె పిల్ల” పిలిచెదరు.
- ఇశ్రాయేలీయులు అనేకమార్లు బలులను అర్పించుటకు గొర్రెలను ఉపయోగించుదురు, విశేషముగా పొట్టేళ్లను మరియు క్రోవ్విన గొర్రెలను అర్పించుదురు.
- ప్రజలు గొర్రె మాంసము తిందురు మరియు వాటి ఉన్నిని బట్టలు తయారు చేయడానికి, ఇతర వస్తువులు చేయడానికి ఉపయోగించుదురు.
- గొర్రెలు చాలా నమ్మదగినవి, బలహీనమైనవి మరియు దుర్బలమైనవి. అవి చాలా సులభముగా దారి తప్పి ప్రక్కకు వెళ్లిపోతాయి. వాటిని సరియైన విధముగా నడిపించుటకు, సంరక్షించుటకు, మరియు వాటికి ఆహారము, నీరు, దొడ్డిని అందించుటకు వాటికి కాపరి అవసరము.
- పరిశుద్ధ గ్రంథములో ప్రజలు గొర్రెలకు, దేవుడు కాపరికి పోల్చడము జరిగింది.
(తర్జుమా సలహాలు: తెలియని వాటిని ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: Israel, lamb, sacrifice, shepherd)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.08:32-33
- ఆది.30:31-32
- యోహాను.02:13-14
- లూకా.15:3-5
- మార్కు.06:33-34
- మత్తయి.09:35-36
- మత్తయి.10:5-7
- మత్తయి.12:11-12
- మత్తయి.25:31-33
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 09:12 ఒక రోజున మోషే తన గొర్రెలను మేపుచున్నప్పుడు, అతను మండుచున్న ఒక పొదను చూచెను.
- 17:02 దావీదు బెత్లెహేము పట్టణమునుండి వచ్చిన కాపరియైయుండెను. వేరు వేరు సమయాలలో అతను తన తండ్రి గొర్రెలను కాయుచుండెను, దావీదు గొర్రెల మీదకి దాడి చేయవచ్చిన సింహమును మరియు ఎలుగుబంటిని చంపివేసెను.
- 30:03 వీరందరూ కాపరిలేని గొర్రెలవలే ఉన్నారని యేసు చెప్పెను.
- 38:08 “ఈ రోజు రాత్రి మీరందరూ నన్ను పరిత్యజిస్తారు అని యేసు చెప్పెను. “నేను కాపరిని కొట్టుదును మరియు సమస్త గొర్రెలన్నియు చెదరిపోవును” అని వ్రాయబడియున్నది.”
పదం సమాచారం:
- Strong’s: H0352, H1494, H1798, H2169, H3104, H3532, H3535, H3733, H3775, H5739, H5763, H6260, H6629, H6792, H7353, H7462, H7716, G41650, G42620, G42630