te_tw/bible/other/shepherd.md

9.0 KiB
Raw Permalink Blame History

కాపరి, కాపరులు, కాపు కాయబడెను, కాపు కాయుట

నిర్వచనము:

కాపరి అనగా గొర్రెలను భాగుగా కాచి కాపాడే వ్యక్తి. “కాపరి” కర్తవ్యము ఏమనగా గొర్రెలను సంరక్షించుట మరియు వాటికి ఆహారమును నీళ్ళను అందించుటయైయున్నది. కాపరులు గొర్రెలను కాయుదురు, వాటిని పచ్చికగల చోట్లకు మరియు నీళ్ళు అధికముగా ఉన్నచెంతకు నడిపించుదురు. కాపరులు కూడా గొర్రెలు నాశనము కాకుండా కాపాడుతారు మరియు వాటిని అడవి మృగాలనుండి సంరక్షిస్తారు.

  • పరిశుద్ధ గ్రంథములో ఈ పదమును ప్రజల ఆత్మీయ అవసరతలను చూచుకొనుటను సూచించుటకు అనేకమార్లు ఉపయోగించబడింది. పరిశుద్ధ గ్రంథములో దేవుడు వారికి చెప్పబడిన విషయాలన్నిటిని మరియు వారు ఎలా జీవించాలోనన్న విధానమును వారికి నిర్దేశించుటను గూర్చి ఇందులో ఇమిడియుంటాయి.
  • పాత నిబంధనలో దేవుడు తన ప్రజలకు “కాపరి” అని పిలువబడియున్నాడు, ఎందుకంటే ఆయన వారి ప్రతి అవసరతలను తీర్చువాడైయుండెను మరియు వారిని రక్షించువాడైయుండెను. ఆయన కూడా వారిని నడిపించాడు మరియు వారికి మార్గ నిర్దేశనమును చేశాడు. (చూడండి: రూపకలంకారము)
  • మోషే ఇశ్రాయేలీయులకు కాపరియైయుండెను, ఆయన వారిని యెహోవాను ఆరాధన చేయుటలో ఆత్మీయకముగా నడిపించియుండెను మరియు భౌతికముగా వారిని కానాను భూమికి నడిపించియుండెను.
  • క్రొత్త నిబంధనలో యేసు తనను “మంచి కాపరి” అని పిలుచుకొనియున్నాడు. అపొస్తలుడైన పౌలు కూడా సంఘానికి “గొప్ప కాపరిగా” తనను తానూ సూచించుకొనియున్నాడు.
  • క్రొత్త నిబంధనలో అనేకమార్లు “కాపరి” అనే పదము విశ్వాసులకు ఆత్మీయ నాయకుడుగానున్న వ్యక్తిని సూచించుటకు ఉపయోగించబడియుండెను. తర్జుమా చేయబడిన “పాస్టర్” అనే పదము మరియు తర్జుమా చేయబడిన “కాపరి” అనే పదము ఒకటైయున్నవి. పెద్దలు మరియు విచారణకర్తలు కూడా కాపరులుగా పిలువబడియున్నారు.

అనువాదం సలహాలు:

  • దీనిని అక్షరార్థముగా ఉపయోగించినట్లయితే, “కాపరి” కర్తవ్యమును “గొర్రెలను చూచుకోవడం” లేక “గొర్రెలను కాపాడుకొనుట” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “కాపరి” అనే వ్యక్తిని “గొర్రెలను కాపు కాయు వ్యక్తి” లేక “గొర్రెల వ్యాపారి” లేక “గొర్రెల సంరక్షకుడు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • రూపకలంకారముగా ఉపయోగించినప్పుడు, ఈ పదమును తర్జుమా చేయు విభిన్నమైన విధానములలో “ఆత్మీయ కాపరి” లేక “ఆత్మీయ నాయకుడు” లేక “కాపరివలె ఉన్న వ్యక్తి” లేక “కాపరి గొర్రెలను కాపాడినట్లుగా ప్రజలను సంరక్షించు వ్యక్తి” లేక “కాపరి గొర్రెలను నడిపించునట్లుగా తన ప్రజలను నడిపించు వ్యక్తి” లేక “దేవుని గొర్రెలను కాయువాడు” అనే మాటలను ఉపయోగించుదురు.
  • కొన్ని సందర్భాలలో “కాపరి” అనే పదమును “నాయకుడు” లేక “మార్గదర్శకుడు” లేక “సంరక్షించువాడు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “కాపరి” అనే పదానికి ఆత్మీయ మాటగా “సంరక్షించుట” లేక “ఆత్మీయముగా పోషించుట” లేక “నిర్దేశించుట మరియు బోధించుట” లేక “నడిపించుట మరియు సంరక్షించుట (కాపరి గొర్రెలను చూచుకొను విధముగా) అని కూడా తర్జుమా చేయుదురు.
  • అలంకారికముగా ఉపయోగించే మాటలలో, ఈ పదమును తర్జుమా చేయుటలో “కాపరి” అనే పదమునకు అక్షరార్థరమైన పదము చేర్చడము లేక ఉపయోగించడం ఉత్తమము.

(ఈ పదములను కూడా చూడండి:sheep, livestock, pastor)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 09:11 ఐగుప్తు అతి దూరములోనున్న అడవిలో మోషే కాపరి అయ్యాడు.
  • 17:02 దావీదు బెత్లెహేము పట్టణమునుండి వచ్చిన కాపరియైయుండెను. అనేక సమయాలలో తన తండ్రి గొర్రెలను కాయుచున్నప్పుడు, గొర్రెల మీదకి దాడిచేయవచ్చిన సింహమును మరియు ఎలుగుబంటిని హత మార్చెను.
  • 23:06 ఆ రాత్రి పొలములో గొర్రెలను కాయుచున్న కాపరులు ఉండిరి.
  • 23:08 కాపరులు వెంటనే యేసు ఉన్నటువంటి స్థలమునకు వచ్చిరి, దూత వారితో చెప్పినట్లుగానే, వారు ఆయన పరుండబెట్టియుండుటను చూచిరి.
  • 30:03 కాపరిలేని గొర్రెలవలె ఈ ప్రజలున్నారని యేసు చెప్పెను.

పదం సమాచారం:

  • Strongs: H6629, H7462, H7469, H7473, G07500, G41650, G41660