te_tw/bible/other/rod.md

3.2 KiB

బెత్తము

నిర్వచనము:

“బెత్తము” పదము సన్ననిది, దృఢమైన, కర్ర లాంటి సాధనాన్ని సూచిస్తుంది, ఇది అనేక రకాలుగా ఉపయోగించబడింది. ఇది బహుశా కనీసం ఒక మీటర్ పొడవు ఉండవచ్చు.

  • • ఇతర జంతువుల నుండి గొర్రెలను కాపాడడానికి కాపరి చేత ఒక చెక్క బెత్తము వినియోగించబడుతుంది. వెలుపల తిరుగుతూ ఉన్న గొర్రెలను తిరిగి మందలోనికి తీసుకు రావడానికి కూడా బెత్తము వాటి వైపుకు విసిరివెయ్యబడుతుంది.
  • • 23వ కీర్తనలో రాజైన దావీదు “దుడ్డు కర్ర” మరియు “దండము” అనే పదములను దేవుని మార్గదర్శకత్వము మరియు తన ప్రజల కొరకైన క్రమశిక్షణను సూచించుటకు అలంకారికముగా వినియోగించాడు.
  • కాపరి దుడ్డు కర్ర దాని క్రింద వెళ్ళే గొర్రెలను లెక్కించుటకు కూడా ఉపయోగించబడుతుంది.
  • “ఇనప దండము” అనే మరొక అలంకారిక వ్యక్తీకరణ దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేసి మరియు దుష్ట కార్యాలు చేసే మనుష్యుల కోసం దేవుని శిక్షను సూచిస్తుంది.
  • పురాతన కాలములో, కొలబద్దలను లోహముతోను, కట్టెతోనూ లేక రాయితోను చేసుకొని ఒక వస్తువుని గాని లేక ఒక భవనపు ఎత్తును కొలిచేవారు.
  • బైబిలులో కట్టెతో చేసిన బెత్తమును కూడా పిల్లలను క్రమశిక్షణలో ఉంచుటకు ఒక పరికరముగా సూచించబడింది.

(ఈ పదములను కూడా చూడండి: బెత్తము, గొర్రె, కాపరి)

బైబిలు రిఫరెన్పసులు:

పదం సమాచారం:

  • Strong's: H2415, H4294, H4731, H7626, G2563, G4463, G4464