te_tw/bible/other/quench.md

2.5 KiB

ఆర్పుట, ఆర్పివేయబడినది, తీర్చలేనిది

నిర్వచనము:

“ఆర్పుట” అనే ఈ పదమునకు ఆర్పివేయుట లేక  దేనినైనా తృప్తిపడకుండా ఆపుచేయడము  అని అర్థము.

  • ఈ పదమును సాధారణముగా దాహము తీర్చుట అనే సందర్భములో ఉపయోగించుదురు మరియు ఏదైనా పానీయాలు త్రాగుట ద్వారా దాహమును తీర్చుట అని అర్థము.
  • ఇది  అగ్నిని ఆర్పుటను సూచించుటకు కూడా ఉపయోగించబడును.
  • దాహము మరియు అగ్ని అనే ఈ రెండు నీటి ద్వారా ఆర్పబడును.
  • “ఆర్పుట” అనే పదమును పౌలు గారు అలంకారికంగా ఉపయోగించి, , “పరిశుద్ధాత్ముని ఆర్పకుడి” అని విశ్వాసులకు హెచ్చరికగా చెప్పియున్నాడు. ఈ మాటకు ప్రజలలో ఫలాలు మరియు వరాలు కలిగించేందుకు పరిశుద్ధాత్ముని అనుమతించకుండ ఉండేవిధంగా వారిని నిరుత్సాహ పరచవద్దు అని అర్థము. పరిశుద్ధాత్ముని  ఆర్పివేయుట అనగా పరిశుద్ధాత్ముడు తన శక్తిని మరియు కార్యమును తన ప్రజలలో జరిగించకుండ ఉండేవిధంగా అడ్డుకొనుట అని అర్థము.

(ఈ పదములను చూడండి: fruit, gift, Holy Spirit)

బైబిల్ రెఫెరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1846, H3518, H7665,  G07620, G45700