te_tw/bible/other/perverse.md

4.5 KiB
Raw Permalink Blame History

వక్రమైన, వక్రబుద్ధి, తప్పుదారి పట్టిన వాడు, భ్రష్టుడైన, ద్వేషపూరిత, కుటిలమైన, నిజాయితీలేని, వికృతి

నిర్వచనం:

“వక్రమైన” పదం నైతికముగా చెడిపోయిన లేక వక్రీకరించబడిన క్రియను లేక ఒక వ్యక్తిని వివరించడానికి ఉపయోగించబడినది. "వక్రమైన" పదం "వక్రమైన విధానంలో" అని అర్థం. దేనినైనా "తప్పుదారి పట్టించడం" అంటే సరైన దానినుండి లేదా మంచి దానినుండి మళ్లించడం లేదా దూరంగా తప్పించడం అని అర్థం.

  • వక్రమైనదిగా ఉన్న వస్తువుగానూ వ్యక్తి గానీ మంచిదీ, సరియైనదాని నుండి తప్పిపోయింది.
  • బైబిలులో ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపినప్పుడు వారు వక్రంగా నడిచారు. వారు అబద్ధపు దేవుళ్ళను ఆరాధించడం ద్వారా దీనిని పదే పదే చేస్తూ వచ్చారు.
  • దేవుని ప్రమాణాలకూ లేదా స్వభావానికీ వ్యతిరేకంగా చేసిన ఎటువంటి చర్యఅయినా అది వక్రమైనదిగా పరిగణించబడుతుంది.
  • “వక్రమైన" పదం సందర్భాన్ని బట్టి "నైతికంగా తిప్పివేయబడడం" లేదా "అనైతికం" లేదా "దేవుని తిన్నని మార్గం నుండి తొలగిపోవడం" అని అనువదించబడవచ్చు.
  • “వక్రమైన సందేశం" పదబంధం "దుష్టమైన విధానంలో మాట్లాడడం" లేదా "మోసపూరిత సంభాషణ" లేదా "అనైతిక మాట్లాడే విధానం" అని అనువదించబడవచ్చు.
  • “వక్రమైన ప్రజలు” పదబంధం “అనైతికమైన ప్రజలు” లేదా “నైతికముగా దిగజారిన ప్రజలు” లేదా “దేవునికి ఎల్లప్పుడూ అవిధేయత చూపించే ప్రజలు” అని కూడా వివరించవచ్చు.
  • “వక్రమైన విధంగా ప్రవర్తించడం" అనే పదబంధాన్ని “దుష్ట మార్గములో ప్రవర్తించడం" లేదా "దేవుని ఆజ్ఞలకు విరుద్ధముగా కార్యములు చేయుట” లేదా “దేవుని ఉపదేశములను తిరస్కరించు విధానములో జీవించుట” అని కూడా అనువదించబడవచ్చు.
  • “తప్పుదారి పట్టినవాడు" పదం “చెడిపోవుటకు కారణమగు” లేదా “దుష్టత్వములోనికి తిరిగిపోవడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి:corrupt, deceive, disobey, evil, turn)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1942, H2015, H3868, H4297, H5186, H5557, H5558, H5753, H5766, H5773, H5791, H6140, H6141, H8138, H8397, H8419, G12940