te_tw/bible/other/like.md

5.2 KiB
Raw Permalink Blame History

వంటి, ఏకమనస్కులైన, పోలిక, ఆ ప్రకారం, ఒకే రీతిగా, పోలిక లేని, లాగా

నిర్వచనం:

“వంటి,” “పోలిక” పదాలు అదే విధంగా ఉండడం లేదా ఒకేలా పోలియుండడం, మరొక దానివలే ఉండడం అని సూచిస్తున్నాయి.

  • ”వంటి” పదం తరుచుగా అలంకారిక రూపంలో ఉపయోగించబడుతుంది, దీనిని "ఉపమానం" అని పిలువనడుతుంది. దీనిలో ఒకటి మరొకదానితో సరిపోల్చబడుతుంది. సహజంగా ఉమ్మడి లక్షణం ఎత్తి చూపించబడుతుంది. ఉదాహరణకు, "అతని వస్త్రాలు సూర్యునిలా మెరుస్తున్నాయి,” “అతని స్వరం ఉరుము ధ్వని వలే ఉంది.” (చూడండి: ఉపమానం)
  • ఒకదాని వలే లేదా ఒకరి ”వలే ఉండడం” లేదా "వలే అనిపించడం" లేదా "వలే కనిపించడం" అంటే సరిపోల్చుతున్న దానితో లేదా వ్యక్తితో సరిపోయిన ఒకేలాంటి లక్షణాలు ఉండడం అని అర్థం.
  • మనుష్యులను దేవుడు తన “పోలిక”లో సృష్టించాడు, అంటే ఆయన స్వరూపంలో సృష్టించాడు. అంటే వారు దేవునికి ఉన్న ఆలోచించడానికీ, అనుభూతి చెందడానికి, సంభాషించ గలేగే లాంటి గుణములు లేదా లక్షణములు కలిగియున్నారని అర్థం.
  • ఏదైనా ఒక దాని లేదా ఎవరిఅనా ఒకరి "పోలిక" అంటే ఆ వస్తువు లేదా వ్యక్తిలా కనిపిస్తున్న లక్షణాలు కలిగియుండడం అని అర్థం.

అనువాదం సూచనలు

  • కొన్ని సందర్భాలలో, “పోలికలో” అనే వ్యక్తీకరణ “కనిపిస్తున్నట్టుగా” లేదా “ఉన్నట్టుగా" అని అనువదించబడవచ్చు.
  • ”ఆయన మరణమును పోలినట్టుగా” అనే వాక్యం “ఆయన మరణ అనుభవం పంచుకోవడం” లేదా “ఆయనతో ఆయన మరణాన్ని అనుభవిస్తున్నట్టుగా” అని అనువదించబడవచ్చు.
  • ”పాప శరీర పోలికలో” అనే వాక్యం “పాపపు మనిషి వలే ఉండడం” లేదా “ఒక మనిషిలా ఉండడం” అని అనువదించబడవచ్చు. యేసు పాపంగా ఉన్న విధంగా అని అనిపించేలా ఈ వాక్యాన్ని అనువదించకుండా జాగ్రత్తతీసుకోండి.
  • ”ఆయన సొంత పోలికలో” అనే వాక్యం “ఆయనలా ఉండడం” లేదా “ఆయనకున్న అవే  లక్షణాలను కలిగియుండడం” అని అనువదించబడవచ్చు.
  • ”క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు" వాక్యం “క్షయమగు మనుష్యులు లేదా జంతువులు, పక్షులు, జంతువులు, ప్రాకే చిన్న పురుగుల వంటి కనపడే విగ్రహాలు చేసారు” అని అనువదించబడవచ్చు.

(చూడండి:beast, flesh, image of God, image, perish)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1823, H8403, H8544, G15030, G15040, G25090, G25310, G25960, G36640, G36650, G36660, G36670, G36680, G36690, G36970, G48330, G51080, G56130, G56150, G56160, G56180, G56190