3.6 KiB
3.6 KiB
పరిపాలించు, ప్రభుత్వం, ప్రభుత్వాలు, గవర్నర్, గవర్నర్లు, రాజప్రతినిధి, రాజప్రతినిధులు
నిర్వచనం:
"గవర్నర్" అంటే ఒక రాష్ట్రం పై ప్రాంతంపై, ప్రదేశం పై పరిపాలన చేసే వాడు. "పరిపాలించు" అంటే నిర్దేశించు, నడిపించు, లేక నిర్వహించు.
- "రాజప్రతినిధి" అనేది మరింత ఇదమిద్ధమైన బిరుదు నామం. ఒక రోమా పరగణాను పరిపాలించే గవర్నర్.
- బైబిల్ కాలాల్లో, గవర్నర్లను రాజు లేక చక్రవర్తి తన అధికారం కింద ఉన్న ప్రాంతాలపై నియమించే వారు.
- "ప్రభుత్వం" అంటే దేశం లేక సామ్రాజ్యం పాలించే అధిపతులు. ఈ అధిపతులు వారి పౌరుల ప్రవర్తన నియమాలను శాసించే చట్టాలు చేస్తారు. జాతి ప్రజలందరి శాంతి, భద్రత, సౌభాగ్యం చూసుకుంటారు.
అనువాదం సలహాలు:
- "గవర్నర్" కూడా అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అధిపతి” లేక “పర్యవేక్షకుడు” లేక “ప్రాంతీయ నాయకుడు” లేక “చిన్న ప్రాంతంపై పరిపాలన చేసే వాడు."
- సందర్భాన్ని బట్టి, "పరిపాలించు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "పై పరిపాలన” లేక “మార్గ దర్శకత్వం” లేక “నిర్వహణ" లేక పైవిచారణ."
- "గవర్నర్" అనే దాన్ని ఇలా కూడా అనువదించ వచ్చు. "రాజు” లేక “చక్రవర్తి", ఎందుకంటే గవర్నర్ వారి కింద కొంత తక్కువ శక్తివంతమైన అధిపతి.
- "రాజప్రతినిధి" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "రోమా గవర్నర్” లేక “రోమా ప్రాంతీయ అధిపతి."
(చూడండి: authority, king, power, province, Rome, ruler)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H0324, H1777, H2280, H4951, H5148, H5460, H6346, H6347, H6486, H7989, H8269, H8660, G04450, G04460, G07460, G14810, G22320, G22330, G22300, G42320