te_tw/bible/other/confidence.md

4.0 KiB
Raw Permalink Blame History

నిబ్బరం, నిబ్బరమైన

నిర్వచనం:

"నిబ్బరం" అనే పదం ఏదైనా నిజం అని మనకు తెలిసిన, లేక తప్పక జరుగుతాయన్న నిశ్చయతతో ఉండడాన్ని సూచిస్తుంది.

  • బైబిలులో “నిరీక్షణ” తరచుగా ఏదైనా ఖచ్చితంగా జరుగుతుందని ఆశతో యెదురు చూస్తూ ఉండడం అని అర్థాన్ని కలిగియుంది. దీనిని యు.ఎల్.టి తరచుగా “నిబ్బరం” లేదా “భవిష్యత్తుకోసం నిబ్బరం” లేదా “భవిష్యత్తు నిబ్బరం” అని అనువదిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దేవుడు యేసులో విశ్వాసులకు చేసిన వాగ్దానం నెరవేరుతుందనే నిశ్చయత కలిగియుండడం అని అర్థాన్ని కలిగియున్నప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తుంది.
  • తరచుగా "నిబ్బరం" పదం ముఖ్యంగా యేసులో విశ్వాసులు ఒక రోజున పరలోకంలో దేవునితో శాశ్వతంగా ఉంటారనే నిశ్చయతను సూచిస్తుంది.
  • "దేవునిలో నిబ్బరం కలిగి ఉండడం" పదబంధం దేవుడు వాగ్దానం చేసిన దానిని పొందుతామని మరియు దానిని అనుభావిస్తామని సంపూర్ణంగా ఎదురుచూడడం.
  • "నిబ్బరంగా ఉండడం" అంటే దేవుని వాగ్దానంలో నమ్మకం ఉంచడడం మరియు దేవుడు తాను చెప్పిన దానిని అయన చేస్తాడని నిశ్చయతతో కార్యాన్ని జరిగించడం అని అర్థం. ఈ పదానికి నిర్భయంగా మరియు ధైర్యంగా కార్యం చెయ్యడం అని కూడా అర్థం ఉంది.

అనువాదం సలహాలు:

  • "నిబ్బరమైన" పదం "నిశ్చయత” లేక “చాలా ఖచ్చితం” అని అనువదించబడవచ్చు.
  • "నిబ్బరంగా ఉండడం" అనే పదబంధం “సంపూర్ణంగా నమ్మడం” లేదా “దాని విషయం కచ్చితంగా ఉండు” లేదా “ఖచ్చితంగా తెలుసుకో” అని అనువదించబడవచ్చు.
  • "నిబ్బరంగా" పదం “నిర్భయంగా” లేదా “నిశ్చయతతో” అని కూడా అనువదించబడవచ్చు.
  • సందర్భం ఆధారంగా, "నిబ్బరం" పదాన్ని "పూర్ణ నిశ్చయత” లేదా “ఖచ్చితమైన ఎదురుచూపు” లేదా “నిశ్చయత” అని వివిధ విధానాలలో అనువదించవచ్చు.

(చూడండి: believe, believe, bold, faithful, hope, trust)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0982, H0983, H0986, H3689, H3690, H4009, G22920, G39540, G39820, G40060, G52870