te_tw/bible/other/breath.md

6.4 KiB

ఊపిరి, శ్వాస, శ్వాస, ఊదడం

నిర్వచనం:

బైబిల్లో, పదాలు "శ్వాస” “ఊపిరి" తరచుగా జీవం ఇవ్వడానికి, జీవం కలిగి ఉండడానికి అలంకారికంగా ఉపయోగిస్తారు.

  • దేవుడు "ఊపిరి ఊదాడు"అంటే ఆదాములోకి జీవ శ్వాస పంపాడు, అని బైబిల్ బోధిస్తున్నది. సరిగ్గా ఆ సమయంలో ఆదాము జీవించే ప్రాణి అయ్యాడు.
  • యేసు శిష్యులపై ఊది, వారికి "ఆత్మను పొందమని" చెప్పాడు. అయన బహుశా అక్షరాలా గాలి ఊదడం ద్వారా సంకేతరూపంగా పరిశుద్ధాత్మ వారిపైకి రావడం తెలియజేశాడు.
  • కొన్ని సార్లు పదాలు "ఊదడం” “బయటికి ఊదడం"అనే దాన్ని మాట్లాడడం సూచించడానికి ఉపయోగిస్తారు.
  • అలంకారికంగా అనే మాట "దేవుని ఊపిరి” లేక “యెహోవా ఊపిరి" తరచుగా దేవుని ఆగ్రహాన్ని సూచిస్తున్నది. తిరుగుబాటు చేసిన నిర్దేవ జాతులపై ఇది శిక్ష. ఇది అయన శక్తికి సూచన.

అనువాదం సలహాలు

  • "తన చివరి శ్వాస"అనే మాటను అలంకారికంగా "అతడు చనిపోయాక" అనే అర్థం ఇస్తుంది. దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అతడు తన చివరి ఊపిరి తీసుకున్నాడు” లేక “అతడు ఊపిరి పీల్చడం మానేశాడు” లేక “అతడు అంతిమ శ్వాస తీసుకున్నాడు."
  • లేఖనాలు "దేవుని శ్వాస"అంటే దేవుడు తన ప్రేరణనిచ్చి పలికిన లేఖన వాక్కులు. వీటిని మనుషులు తరువాత రాశారు. బహుశా సాధ్యమైతే దీన్ని దేవుని శ్వాస అని అనువదించడం కొంత వరకు అక్షరాలా సరి అయినది. అంతకు మించి ఈ అర్థాన్ని చక్కగా చెప్పడం కుదరదు.
  • అక్షరార్థంగా అనువదిస్తే "దేవుని శ్వాస"అనే మాట ఆమోదయోగ్యం కాదు. తర్జుమా చేసే ఇతర పద్ధతులు "దైవ ప్రేరణ” లేక “దేవుని రచన” లేక “దేవుడు పలికిన." "దేవుని శ్వాస ద్వారా లేఖన వాక్కులు వచ్చాయి"అని రాయవచ్చు.
  • "ఊపిరి పీల్చుకోవడం” లేక “జీవ శ్వాస ఊదడం” లేక “ఊపిరి పోయడం"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "శ్వాస పీల్చుకొనేలా చెయ్యడం” లేక “మరలా బ్రతికించడం” లేక “జీవించి శ్వాస తీసుకునేలా చెయ్యడం” లేక “జీవం ఇవ్వడం."
  • సాధ్యమైతే దీన్ని ఇలా అనువదించడం మంచిది. "దేవుని ఊపిరి." అక్షరార్థంగా మీ భాషలో "ఊపిరి"అనే అర్థం ఇవ్వడానికి ఏ పదం ఉపయోగిస్తారో చూడండి. దేవునికి "ఊపిరి"ఉంటుంది అని చెప్పడం వీలు పడకపోతే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుని శక్తి” లేక “దేవుని పలుకు."
  • "నిలదొక్కుకుని” లేక “కాస్త ఊపిరి పీల్చుకుని"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "శ్వాస మరింత తేలికగా పీల్చుకునేలా” లేక “మామూలుగా శ్వాస పీల్చుకోవడం కోసం పరిగెత్తడం ఆపడం."
  • "అది కేవలం ఊపిరి మాత్రమే"అంటే "ఇక చాలా తక్కువ సమయం మిగిలింది."
  • అదే విధంగా "మనిషి ఒకే ఊపిరి" అంటే "మనుషులు చాలా కొద్ది సమయం మాత్రమే జీవిస్తారు.” లేక “మానవుల జీవితం చాలా కొద్ది పాటి. చిన్న ఊపిరి వంటిది” లేక “దేవునితో పోలిస్తే మనిషి గాలి, లేక ఊపిరి లాగా స్వల్పం."

(చూడండి: ఆదాము, పౌలు, దేవుని వాక్కు, జీవం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3307, H5301, H5396, H5397, H7307, H7309, G1709, G1720, G4157