te_tw/bible/kt/wordofgod.md

9.9 KiB
Raw Permalink Blame History

దేవుని వాక్యము, యెహోవా వాక్యము, ప్రభువు వాక్యము, సత్య వాక్యము, లేఖనము,, లేఖనములు

నిర్వచనం:

బైబిలులో “దేవుని వాక్యము” పదం దేవుడు తన ప్రజలతో మాట్లాడిన ప్రతీ మాటను సూచిస్తుంది. ఇందులో చెప్పబడిన సందేశాలూ, వ్రాయబడిన సందేశాలూ కూడా ఉంటాయి. యేసు “దేవుని వాక్యం” అని పిలువబడ్డాడు.

  • “లేఖనములు” అనే మాటకు “రచనలు” అని అర్థం. ఈ పదం క్రొత్త నిబంధనలో మాత్రమే ఉపయోగించబడింది, ఈ పదం పాత నిబంధనలోనున్న హెబ్రీ లేఖనములను సూచిస్తుంది. ఈ రచనలన్నీ దేవుడు తన ప్రజలకు చెప్పి వ్రాయించిన దేవుని సందేశాలు. తద్వారా భవిష్యత్తులో అనేక సంవత్సరాలు ప్రజలు ఇప్పటికీ చదువుతున్నారు.
  • దీనికి సంబంధించిన పదాలు “యెహోవా వాక్కు” మరియు “ప్రభువు వాక్కు” అనే పదాలు దేవుడు ఒక ప్రవక్తకుగాని లేక పరిశుద్ధ గ్రంథములోని ఒక వ్యక్తికి ఇచ్చిన ప్రత్యేకమైన సందేశంగా ఉంది.
  • కొన్నిమార్లు ఈ పదం "వాక్యం" లేదా “నా వాక్యం" లేదా “నీ వాక్కు” (దేవుని వాక్యమును గూర్చి మాట్లాడునప్పుడు) అని చాలా సాధారణముగా కనబడుతుంది.
  • క్రొత్త నిబంధనలో యేసు “వాక్యం” మరియు “దేవుని వాక్యం” అని పిలువబడ్డాడు. ఈ బిరుదులకు యేసు దేవుని గురించి తెలియజేసియున్నాడు అని అర్థం. ఎందుకంటే ఈయనే దేవుడైయున్నాడు.

“సత్య వాక్యం” పదం “దేవుని వాక్యం” అని చూపించే మరొక విధానం, అది ఆయన సందేశం లేక బోధనయై ఉంది. ఇది కేవలము ఒక వాక్కును మాత్రమే సూచించడం లేదు.

  • దేవుని సత్య వాక్యంలో దేవుడు తననుగూర్చి, తన సృష్టినిగూర్చి, మరియు యేసు ద్వారా అనుగ్రహించిన రక్షణ ప్రణాళికలను గూర్చి ప్రజలకు బోధించిన ప్రతీది ఉంటుంది.
  • ఈ పదం దేవుడు మనకు చెప్పిన ప్రతి మాట సత్యము, నమ్మదగినది, మరియు నిజమైనదనే వాస్తవాన్ని నొక్కి చెబుతుంది.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి ఈ పదం "యెహోవా సందేశము” లేదా “దేవుని సందేశము” లేదా “దేవునినుండి వచ్చిన బోధనలు” అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • కొన్నిభాషలలో ఈ పదం “దేవుని వాక్కులు” లేదా “యెహోవా వాక్కులు” అని బహువచనంలో సహజంగా ఉంటుంది.
  • “యెహోవా వాక్కు వచ్చింది” అనే వాక్యం ఒక దానిని గురించి తన ప్రవక్తలకూ లేదా తన ప్రజలకూ పరిచయం చెయ్యడానికీ తరచుగా ఉపయోగించబడింది. ఈ పదం “యెహోవా ఈ సందేశమును పలికాడు" లేదా “యెహోవా ఈ వాక్కులను సెలవిచ్చెను” అని అనువదించబడవచ్చు.
  • “లేఖనము” లేక “లేఖనములు” పదం “రచనలు” లేదా “దేవునినుండి వచ్చిన వ్రాతపూర్వకమైన సందేశము” అని అనువదించబడవచ్చు. "వాక్కు" పదం అనువాదానికి భిన్నంగా ఈ పదం అనువదించబడాలి.
  • “వాక్యం" పదం దేవుని వాక్యాన్ని మాత్రమే సూచించడానికి ఉపయోగించబడినప్పుడు "సందేశం" లేదా "దేవుని వాక్యం" లేదా "బోధనలు" అను అనువదించబడవచ్చు. పైన సూచించబడిన విధంగా ప్రత్యామ్నాయ అనువాదం చెయ్యడానికి పరిగణించవచ్చు.
  • బైబిలు యేసును "వాక్యం" అని సూచినప్పుడు ఈ పదం "సందేశం" లేదా "సత్యం" అని అనువదించబడవచ్చు.
  • “సత్య వాక్యం” పదం "దేవుని సత్య సందేశం” లేదా “సత్యం అయిన దేవుని వాక్యం” అని అనువదించబడవచ్చు.
  • ఈ పదం అనువాదంలో సత్యంగా ఉండడం అనే అర్థం జత చెయ్యడం ముఖ్యం.

(చూడండి:prophet, true, Yahweh)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

  • 25:7 దేవుని వాక్యము లో ఆయన తన ప్రజలతో “మీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమె సేవించాలి" అని ఆజ్ఞాపించాడు.
  • 33:6“విత్తనము దేవుని వాక్యము నై యున్నది“ అని యేసు వివరించెను.
  • __42:3__మెస్సయ్యాను గూర్చి దేవుని వాక్యము ఏమి తెలియజేయుచున్నదో యేసు వారికి వివరించాడు.
  • 42:7దేవుని వాక్యములో నన్ను గూర్చి వ్రాసిన ప్రతీది నెరవేర్చబడవలసి ఉన్నాడని నేను మీతో చెప్పుచున్నాను” అని యేసు చెప్పాడు. ఆ తరువాత వారు దేవుని వాక్యమును అర్థము చేసికొనుటకు వారి మనసులను తెరచాడు.
  • __45:10__ఫిలిప్పు కూడా యేసు సువార్తను తనకు చెప్పుటకు ఇతర లేఖనములను ఉపయోగించాడు.
  • __48:12__అయితే యేసు ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్తయైయున్నాడు. ఆయన దేవుని వాక్యమై యున్నాడు.
  • __49:18__ఇతర క్రైస్తవులతో చేరి ఆయనను ఆరాధించాలని, ఆయన వాక్యమును అధ్యయనము చేయాలని, ప్రార్థించాలని మరియు ఆయన నీ కొరకు చేసిన ఆనేక కార్యములను గూర్చి ఇతరులకు చెప్పాలని దేవుడు వారికి చెప్పాడు.

పదం సమాచారం:

  • Strongs: H0561, H0565, H1697, H3068, G30560, G44870