te_tw/bible/other/breastplate.md

2.7 KiB

ఛాతీకవచం, ఛాతి బద్ద

నిర్వచనము

"ఛాతీకవచం"అనే పదం,యుద్ధం సమయంలో సైనికుని రొమ్ము భాగాన్ని కాపాడేందుకు పెట్టుకునే కవచాన్ని సూచిస్తున్నది.  "ఛాతి వస్త్రం" అనే పదం , ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు తన రొమ్ము భాగంపై ధరించే ఒక ప్రత్యేక వస్త్ర విశేషాన్ని సూచిస్తున్నది.

  • సైనికుడు ఉపయోగించే "ఛాతీ కవచం కొయ్య, లోహం, లేక జంతు చర్మంతో తాయారు  చేస్తారు.  బాణాలు, ఈటెలు, లేక కత్తులు సైనికుని రొమ్ములో గుచ్చుకోకుండా ఉండుటకు ఇది చేయబడుతుంది.
  • ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు ధరించే “ఛాతి బద్ద" ప్రశస్తమైన రత్నాలు పొదిగిన వస్త్రపు  ముక్క. అతడు దాన్ని తన రొమ్ముకు కట్టుకుంటాడు. యాజకుడు దేవుని ఆలయంలో తన విధులు నిర్వర్తించే సమయంలో దీన్ని ధరిస్తాడు.
  • ఛాతీకవచం"అనే దాన్నిఅనువదించే  ఇతర పద్ధతులు "రక్షణ కోసం రొమ్ముకు కట్టుకునే లోహపు పళ్లెం.” లేక “రొమ్మును కాపాడే కవచం.”
  • ఛాతీ బద్ద" అనే దాన్నిఅనువదించే ఇతర పద్ధతులు. “రొమ్ముపై ధరించే యాజక వస్త్రం ” లేక “యాజక వస్త్రపు ముక్క” లేక “యాజకుని దుస్తుల్లో ఛాతీపై ధరించేది”

(చూడండి: armor, high priest, pierce, priest, temple, warrior)

బైబిల్ రిఫరెన్సులు:

  • 1 తెస్స 05:8-11
  • నిర్గమ 39:14-16
  • యెషయా 59:17-18
  • ప్రకటన 09:7-9

పదం సమాచారం:

  • Strong's: H2833 , H8302, G23820