2.7 KiB
2.7 KiB
యోవాషు
వాస్తవాలు:
పాత నిబంధనలో యోవాషు అనే పేరు అనేక మందికి ఉంది.
- ఒక యోవాషు ఇశ్రాయేలు విమోచకుడు గిద్యోను తండ్రి.
- యోవాషు అనే పేరు గల మరొక మనిషి యాకోబు కనిష్ట కుమారుడు బెన్యామీను సంతతి వాడు.
- ఒక ప్రఖ్యాత యోవాషు ఏడేళ్ళ ప్రాయంలో యూదాకు రాజయ్యాడు. అతడు హతుడైన యూదా రాజు అహజ్యా కుమారుడు.
- యోవాషు బాలుడుగా ఉన్నపుడు అతని మేనత్త అతన్ని హత్యకు గురి కాకుండా రక్షించి అతనికి కిరీటం ధరించి రాజయ్యే వయసు వచ్చేదాకా దాచిపెట్టింది.
- యోవాషు రాజు మంచి రాజు. మొదట్లో దేవునికి లోబడ్డాడు. అయితే అతడు ఉన్నత స్థలాలను తొలగించలేదు. అందువల్ల ఇశ్రాయేలీయులు మరలా విగ్రహాలను పుజించారు.
- యెహోయాషు ఇశ్రాయేలును పరిపాలిస్తున్న కాలంలో యోవాషు రాజు యూదాను పరిపాలించాడు. వారు ఇద్దరూ వేరువేరు వ్యక్తులు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: అహజ్యా, బలిపీఠం, బెన్యామీను, అబద్ధ దేవుడు, గిద్యోను, ఉన్నత స్థలాలు, అబద్ధ దేవుడు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3101, H3135