te_tw/bible/kt/sonofman.md

5.0 KiB
Raw Permalink Blame History

మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు

నిర్వచనము:

“మనుష్య కుమారుడు” అనే బిరుదు యేసు తనను తాను సూచించుకొనుటకు ఉపయోగించిన మాటయైయున్నది. ఆయన అనేకమార్లు “నేను” అని ఉపయోగించుటకు బదులుగా ఈ పదమును ఉపయోగించియున్నాడు.

  • పరిశుద్ధ గ్రంథములో “మనుష్య కుమారుడు” అనే మాట ఒక మనుష్యుని సూచించుటకు లేక మనుష్యుని గూర్చి తెలియజేయుటకు ఉపయోగించియుండవచ్చును. దీనికి “మానవుడు” అని కూడా అర్థము కలదు.
  • పాత నిబంధన పుస్తకమైన యెహెజ్కేలు గ్రంథమంతటిలో దేవుడు యెహెజ్కేలును “నరపుత్రుడు” అని తరచుగా సంబోధించియుండెను. ఉదాహరణకు, “నరపుత్రుడా నీవు తప్పకుండ ప్రవచించాలి” అని ఆయన చెప్పెను.
  • “మనుష్య కుమారుడు” మేఘాల మీద వస్తున్నట్లుగా ప్రవక్తయైన దానియేలు గారు దర్శనము చూచిరి, ఈయన రాబోయే మెస్సయ్యా ఆయ్యుండెను.
  • మనుష్య కుమారుడు ఒకరోజున మేఘాల మీద రానైయున్నాడని యేసు కూడా చెప్పియున్నాడు. మేఘాల మీద మనుష్యకుమారుడు వచ్చును అనే ఈ విషయాలన్నియు యేసే మెస్సయ్యాయైన దేవుడు అని బయలుపరచుచున్నాయి.

తర్జుమా సలహాలు:

  • యేసు “మనుష్య కుమారుడు” అని ఉపయోగించినప్పుడు, ఈ మాటను “మనుజావతారుడిగా ఈ లోకమునకు వచ్చినవాడు” అని లేక “పరలోకమునుండి వచ్చిన మనుష్యుడు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • కొంతమంది అనువాదకులు అప్పుడప్పుడు, “నేను” లేక “నేనే” అనే పదాలను మనుష్య కుమారుడు అనే మాటతో కలిపి (నేను మనుష్య కుమారుడు) తర్జుమా చెస్తూ ఉంటారు, ఎందుకంటే యేసు తనను గూర్చి మాట్లాడుచున్నాడని తెలియజెప్పుటకు అలా చేస్తారు.
  • ఈ పదానికి చేసిన తర్జుమా తప్పుడు అర్థము ఇవ్వకుండా జాగ్రత్తపడండి (అనగా యేసు కేవలము మనుష్యుడు మాత్రమెనన్న భావన లేక అక్రమ సంబంధముగా వచ్చిన కుమారుడు అని అర్థము రాకుండా చూసుకోండి).
  • ఒక వ్యక్తిని సూచించి ఉపయోగించినప్పుడు, “మనుష్య కుమారుడు” అనే ఈ మాటను “నీవు మనుష్యుడవు” లేక “నీవు, మానవుడఫు” లేక “మనిషివి” లేక “మనుష్యుడవు” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి:heaven, son, Son of God, Yahweh)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0120, H0606, H1121, H1247, G04440, G52070