te_tw/bible/kt/heaven.md

5.6 KiB
Raw Permalink Blame History

పరలోకం, ఆకాశం, అకాశాలు, పరలోకసంబంధమైన

నిర్వచనం:

దీన్ని ఇలా అనువదించ వచ్చు. "పరలోకం" అంటే దేవుడు ఉండే చోటును సాధారణంగా సూచిస్తున్నది. ఇదే పదం సందర్భాన్ని బట్టి ఈ అర్థం కూడా ఇస్తుంది, "ఆకాశం."

  • "ఆకాశాలు" అంటే భూమిపై ఉన్న ప్రతిదీ అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇందులో ఆకాశ రాసులు సుదూర లోకాలు, నేరుగా భూమినుండి చూడలేనివి.
  • "ఆకాశం" అంటే భూమిపై పరుచుకుని ఉన్న నీలవిశాలం. అక్కడ మేఘాలు, మనం పీల్చే గాలి ఉన్నాయి. తరచుగా సూర్యుడు, చంద్రుడు కూడా "ఆకాశంలో ఉన్నట్టు" చెప్పవచ్చు.
  • కొన్ని సందర్భాల్లో బైబిల్లో, "పరలోకం" అంటే ఆకాశం, లేక దేవుడుండే చోటు.
  • "పరలోకం " అనే దాన్ని అలంకారికంగా వాడినప్పుడు దేవుడు అనే అర్థంతో వాడతారు. ఉదాహరణకు, మత్తయి " పరలోక రాజ్యం” అని రాసినప్పుడు అతడు దేవుని రాజ్యం అనే అర్థంతో రాశాడు.

అనువాదం సూచనలు:

  • "పరలోకం" అలంకారికంగా ఉపయోగించినప్పుడు దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు, "దేవుడు."
  • "పరలోక రాజ్యం" అని మత్తయి సువార్తలో రాసినప్పుడు "పరలోకం" అని రాయడం మంచిది. ఎందుకంటే అది మత్తయి సువార్తకు ప్రత్యేకం.
  • “అకాశాలు” లేక “ఆకాశ రాసులు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు” లేక “విశ్వంలోని నక్షత్రాలు అన్నీ."
  • పద బంధం, “ఆకాశ నక్షత్రాలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆకాశం లోని నక్షత్రాలు” లేక “పాలపుంతలోని నక్షత్రాలు” లేక “విశ్వంలోని నక్షత్రాలు."

(చూడండి: kingdom of God)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __4:2__వారు కట్టే భవనం పరలోకం అంటుతున్న ఎత్తైన గోపురం తో ఉంది.
  • __14:11__అతడు (దేవుడు)పరలోకపు ఆహారం వారికి ఇచ్చాడు. దాని పేరు "మన్నా."
  • __23:7__హటాత్తుగా, అకాశాలు దేవదూతల స్తుతులతో నిండిపోయాయి. "పరలోకంలో దేవునికి మహిమ, అయన అనుగ్రహం చూరగొన్న వారికి భూమి మీద శాంతి!"
  • 29:9

తరువాత యేసు చెప్పాడు, " మీరు మీ సోదరుణ్ణి నీ హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోక తండ్రి మీలో ప్రతి ఒక్కరికీ చేసేది ఇదే."

  • 37:9 తరువాత యేసు ఆకాశం కేసి చూసి ఇలా చెప్పాడు, "తండ్రీ నీవు నా మాట వినినందుకు వందనాలు."
  • __42:11__తరువాత యేసు పరలోకం లోకి వెళ్ళిపోయాడు. ఒక మేఘం ఆయన్ను వారికి కనబడకుండా తీసుకుపోయింది.

పదం సమాచారం:

  • Strongs: H1534, H6160, H6183, H7834, H8064, H8065, G09320, G20320, G33210, G37700, G37710, G37720