te_tw/bible/kt/sanctuary.md

4.2 KiB

పవిత్ర స్థలము (మందిరము)

నిర్వచనము:

“పవిత్ర స్థలము” అనే ఈ మాటకు “పరిశుద్ధ స్థలము” అని అక్షరార్థము మరియు దేవుడు పవిత్రపరచిన లేక పరిశుద్ధపరచిన స్థలమును సూచించును. సంరక్షణను మరియు భద్రతను అనుగ్రహించే స్థలమును కూడా ఈ పదము సూచించును.

  • పాత నిబంధనలో “పవిత్ర స్థలము (మందిరము)” అనే ఈ పదమును ప్రత్యక్ష గుడారమును లేక “పరిశుద్ధ స్థలము” “అతి పరిశుద్ధ స్థలము” ఉండే దేవాలయ భవనమును కూడా సూచించుటకు ఉపయోగించబడినది.
  • దేవుడు పరిశుద్ధ స్థలమును (లేక మందిరమును) తన ప్రజల మధ్యన నివసించే స్థలముగా సూచించియున్నాడు.
  • తన ప్రజలకు సంరక్షణ స్థలముగా లేక తన ప్రజలకొరకు భద్రత కలిగిన స్థలముగా ఆయన తననే “పవిత్ర స్థలము (లేక మందిరము)” అని పిలుచుకొనియున్నాడు.

తర్జుమా సలహాలు:

  • ఈ పదమునకు “ప్రత్యేకించబడిన స్థలము” లేక “పరిశుద్ధ స్థలము” అని ప్రాథమిక అర్థము కలిగియున్నది.
  • సందర్భానుసారముగా, “పవిత్ర స్థలము (లేక మందిరము)” అనే ఈ మాటను “పరిశుద్ధ స్థలము” లేక “పరిశుద్ధ భవనము” లేక “దేవుని నివాస పవిత్ర స్థలము” లేక “సంరక్షణతో కూడిన పరిశుద్ధ స్థలము” లేక “భద్రతా యొక్క పరిశుద్ధ స్థలము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “మందిర తులము (షెకెలు)” అనే మాటను “ప్రత్యక్ష గుడారము వద్ద ఇచ్చే ఒక విధమైన షెకెలు” లేక “దేవాలయమును సంరక్షించుటకు పన్ను చెల్లించుటలో షెకెలును ఉపయోగించెడివారు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • గమనిక: ఈ పదము యొక్క తర్జుమా ఈ ఆధునిక కాలమునందు ఆరాధించుటకు ఉపయోగించే ఒక గదిని సూచించకుండ జాగ్రత్తపడండి.

(ఈ పదములను కూడా చూడండి: పరిశుద్ధత, పరిశుద్ధాత్మ, ప్రత్యేకించబడుట, ప్రత్యక్ష గుడారము, పన్ను, దేవాలయము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H4720, H6944, G39