te_tw/bible/kt/setapart.md

3.6 KiB

ప్రత్యేకించండి

నిర్వచనము:

“ప్రత్యేకించండి” అనే ఈ మాటకు ఒక నిర్దిష్టమైన ఉద్దేశమును నెరవేర్చుటకు ప్రత్యేకించుట అని అర్థము. దేనినైనను లేక ఎవరినైనా ఒకరిని “ప్రత్యేకించుట” అనగా దానిని లేక ఆ వ్యక్తిని “ప్రక్కకు పెట్టుట” అని అర్థము.

  • ఇశ్రాయెలీయులు దేవుని సేవకొరకు ప్రత్యేకించబడిరి.
  • దేవుడు పౌలును మరియు బర్నబాను చేయమనిన పనికొరకు వారిని ప్రత్యేకించుడి అని పరిశుద్ధాత్ముడు క్రైస్తవులకు ఆజ్ఞాపించెను.
  • దేవుని సేవకొరకు “ప్రత్యేకించబడిన” విశ్వాసి దేవుని చిత్తమును నెరవేర్చుటకు “సమర్పించబడియున్నాడు”.
  • “పరిశుద్ధత” అనే పదమునకున్న అనేక అర్థములలో దేవునికి సంబంధించి యుండుటకు ప్రత్యేకించబడియుండుట మరియు లోక పాప మార్గములనుండి వేరు చేయబడుట అని అర్థము.
  • ఒకరిని “పవిత్రీకరించుట” అనగా దేవుని సేవకొరకు ఆ వ్యక్తిని ప్రత్యేకించుట అని అర్థము.

తర్జుమా సలహాలు:

  • “ప్రత్యేకించు” అనే పదమును తర్జుమా చేయు అనేక విధానములలో “విశేషముగా ఎన్నుకొనుట” లేక “మీ మధ్యనుండి ప్రత్యేకించుట” లేక “విశేషమైన పనికొరకు ప్రక్కకు తీసి ఏర్పరచుకొనుట” అనే మాటలను కూడా చేర్చుదురు.
  • “ప్రత్యేకింఛబడియుండుట” అనే ఈ మాటను “దేనినుండైనా వేరు చేయబడుట” లేక “(దేనికొరకైన) విశేషముగా నియమించబడుట” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: పరిశుద్ధత, పరిశుద్ధపరచబడుట, నియమించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2764, H4390, H5674, H6918, H6942, H6944, G37, G38, G40, G873