te_tw/bible/kt/sadducee.md

2.6 KiB
Raw Permalink Blame History

సద్దూకయ్యుడు, సద్దూకయ్యులు

నిర్వచనము:

సద్దూకయ్యులు అనేవారు యేసు క్రీస్తు కాలములో యూదా మత యాజకుల రాజకీయ గంపుకు చెందినవారు. వారు రోమా పరిపాలనను సమర్ధించిరి మరియు వీరు పునరుత్థానమునందు విశ్వసించినవారు కారు.

  • అనేకమంది సద్దూకయ్యులు ప్రధాన యాజకత్వమును మరియు మహా యాజకత్వమును పొంది, శక్తివంతమైన నాయకత్వమును కలిగి, ఉన్నత వర్గపు యూదులును మరియు శ్రీమంతులునైయుండిరి.
  • సద్దూకయ్యుల కర్తవ్యాలలో బలియర్పణలులాంటి యాజక పనులు మరియు దేవాలయమును చూచుకొను పనులను కలిగియుండిరి.
  • సద్దూకయ్యులు మరియు ఫరిసయ్యులు యేసును సిలువ వేయుటకు బలముగా రోమా నాయకులను ప్రభావితము చేసిరి.
  • మతపరమైన ఈ రెండు గుంపులకు విరుద్ధముగా వారి కపటం మరియు స్వార్థమును గూర్చి యేసు మాట్లాడిరి.

(ఈ పదములను కూడా చూడండి: ప్రధాన యాజకులు, కౌన్సిల్, మహా యాజకుడు, వేషధారి, యూదా నాయకులు, ఫరిసయ్యులు, యాజకుడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: G45230