te_tw/bible/kt/hypocrite.md

3.0 KiB
Raw Permalink Blame History

వేషధారి, వేషధారణ

నిర్వచనం:

"వేషధారి" అంటే న్యాయవంతుడుగా/నీమంతునిగా కనిపిస్తూ రహస్యంగా దుష్ట విధానాలలో ప్రవర్తించేవాడు. "వేషధారణ" అనేది ఒక వ్యక్తి తాను నీమంతుడని మనుష్యులు ఆలోచించునట్లు మోసగించు ప్రవర్తన.

  • వేషధారులు తాము మంచి పనులు చేయడం అందరు చుడాలనుకుంటారు. తద్వారా ప్రజలు తమను మంచి వారు అనుకుంటారు.
  • తరచుగా వేషధారి ఇతరులు తాను చేసే అదే పాపపూరితమైన/పాపపు క్రియలను చేసినందుకు వారిని విమర్శిస్తూ ఉంటాడు.
  • యేసు పరిసయ్యులను వేషధారులు అని పిలిచాడు. ఎందుకంటే వారు భక్తుల్లాగా కొన్ని రకాల వస్త్రాలు ధరించి కొన్ని రకాల ఆహారం తింటూ ఉంటారు గానీ మనుషుల పట్ల న్యాయంగా ప్రవర్తించరు.
  • ఒక వేషధారి ఇతరుల్లో తప్పులు ఎత్తి చూపిస్తాడు, కాని తన సొంత తప్పులు సరి దిద్దుకోడు/ఒప్పుకోడు.

అనువాదం సూచనలు:

  • కొన్ని భాషలు వేషధారికి లేదా వేషధార క్రియలకు సూచించే “ద్వంద ముఖ/వైకరి” లాంటి వ్యక్తీకరణలు ఉన్నవి.
  • అనువదించడంలో ఇతర పద్ధతులు. "మోసగాడు” లేక “నాటకాలరాయుడు” లేక “అహంకారి, మోసకరమైన వ్యక్తి."
  • "వేషధారణ" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "కపటం” లేక “నకిలీ క్రియలు” లేక “నటించడం."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0120, H2611, H2612, G05050, G52720, G52730