te_tw/bible/kt/nazirite.md

3.5 KiB

నాజీరు చెయ్యబడినవాడు, నాజీరు చెయ్యబడినవారు, నాజీరు వ్రతం

వాస్తవాలు:

“నాజీరు చెయ్యబడినవాడు” అనే పదం “నాజీరు వ్రతం” తీసుకొన్నవ్యక్తిని సూచిస్తుంది. ఎక్కువగా పురుషులు ఈ వ్రతాన్ని తీసుకొంటారు, అయితే స్త్రీలు కూడా తీసుకొంటారు.

  • నాజీరు వ్రతం తీసుకొన్నవ్యక్తి ఆ వ్రతం తీసుకొన్న కాలమంతటిలో ఆ వ్రతాన్ని నెరవేర్చడం కోసం ద్రాక్షలనుండి చేసిన ఎటువంటి ఆహారాన్నైనా, పానీయాన్నైనా తీసుకోనని అంగీకరిస్తున్నాడు, ఈ కాలంలో తన జుత్తు కత్తిరించుకోడు, మృత దేహాన్ని ముట్టుకోడు.
  • వ్రతకాలం ముగిసిన తరువాత, వ్రతం నెరవేరినతరువాత నాజీరు చెయ్యబదినవాడు యాజకుని వద్దకు వెళ్లి అర్పణ చెల్లిస్తాడు. దీనిలో తన జుత్తును కత్తిరించుకోవడం, వాటిని దహించివెయ్యడం కూడా ఉన్నాయి. ఇతర నియంత్రణలన్నీ తొలగించవచ్చు.
  • పాతనిబంధనలో ప్రముఖుడైన సంసోను ఈ నాజీరు వ్రతంలో ఉన్నాడు.
  • బాప్తిస్మమిచ్చు యోహాను జన్మను గురించి ప్రకటించిన దూత పుట్టబోవు తన బిడ్డ గాఢమైన ద్రావకాన్ని తాగకూడదని జెకర్యాకు చెప్పాడు, దాని అర్థం యోహాను నాజీరు వ్రతంలో ఉన్నాడు.
  • అపొస్తలులకార్యములలోని వాక్యభాగం ప్రకారం అపొస్తలుడైన పౌలు కూడా ఒక సమయంలో ఈ వ్రతాన్ని తీసుకొనియుండవచ్చు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: (బాప్తిస్మమిచ్చు) యోహాను, అర్పణ, సంసోను, ఒప్పందం, జెకర్యా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5139