4.5 KiB
4.5 KiB
యోహాను (బాప్తిసమిచ్చే)
వాస్తవాలు:
యోహాను జెకర్యా, ఎలీసబెతుల కుమారుడు. "యోహాను" సాధారణ నామం గనక ఇతన్ని "యోహాను బాప్తిసమిచ్చే" అని పిలిచారు. యోహాను అనే పేరుగల ఇతరులతో (అపోస్తలుడు యోహాను)తేడా గ్రహించడం కోసం ఇలా చేశారు.
- ప్రజలు మెస్సియాను నమ్మి ఆయన్ని వెంబడించేలా దేవుడు సిద్ధం చేసిన ప్రవక్త యోహాను.
- ప్రజలు వారి పాపాలు ఒప్పుకొని దేవుని వైపు తిరిగి పాపం చేయడం మానుకుని మెస్సియాను ఎదుర్కొనేందుకు సిద్దపడేలా చేశాడు.
- అనేక మంది ప్రజలు వారి పాపాల విషయం బాధపడి మళ్ళుకున్న దానికి సూచనగా యోహాను ఇచ్చిన నీటి బాప్తిసం పొందారు.
- యోహానును "యోహాను బాప్తిసమిచ్చే" అన్నారు, ఎందుకంటే అతడు అనేక మందికి బాప్తిసం ఇచ్చాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి:baptize, Zechariah (NT))
బైబిల్ రిఫరెన్సులు:
- యోహాను 03:22-24
- లూకా 01:11-13
- లూకా 01:62-63
- లూకా 03:7
- లూకా 03:15-16
- లూకా 07:27-28
- మత్తయి 03:13-15
- మత్తయి 11:13-15
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 22:02 దేవదూత జెకర్యాతో చెప్పాడు, "నీ భార్య కుమారుడిని కంటుంది.” నీవు అతనికి యోహాను అని పేరు పెడతావు. అతడు పరిశుద్ధాత్మతో నిండిపోయి ప్రజలను మెస్సియా కోసం సిద్ధ పరుస్తాడు."
- 22:07 తరువాత ఎలీసబెతు ఒక బిడ్డకు జన్మ నిచ్చింది. జెకర్యా, ఎలీసబెతు ఆ పసి వాడికి దేవదూత అజ్ఞాపించినట్టు యోహాను అని పేరు పెట్టాడు.
- 24:01 జెకర్యా, ఎలీసబెతుల కుమారుడు యోహాను పెరిగి ప్రవక్త అయ్యాడు. అతడు అరణ్య ప్రాంతంలో నివసించాడు. తేనె, మిడతలు అతని ఆహారంఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలు వేసుకునే వాడు.
- 24:02 అనేక మంది ప్రజలు అరణ్య ప్రాంతంలోకి వచ్చి యోహాను మాటలు వినే వారు. అతడు ప్రకటించాడు, "పశ్చాత్తాప పడండి. ఎందుకంటే దేవుని రాజ్యం దగ్గరగా ఉంది!"
- 24:06 మరుసటి రోజు, యేసు__యోహాను__చేత బాప్తిసం పొందడానికి వచ్చాడు. యోహాను ఆయన్ని చూసి ఇలా చెప్పాడు, "చూడండి! లోక పాపం మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల."
పదం సమాచారం:
- Strong’s: G09100 G24910