te_tw/bible/kt/baptize.md

7.3 KiB
Raw Permalink Blame History

బాప్తిసమిచ్చు, బాప్తిసం పొందిన, బాప్తిసం

నిర్వచనం:

కొత్త నిబంధనలో "బాప్తిసమిచ్చు,” “బాప్తిసం "అనే పదాలు సాధారణంగా ఒక క్రైస్తవుడిని ఆచార పూర్వకంగా నీటిలో ముంచడం ద్వారా అతడు పాపం నుండి శుద్ధి, క్రీస్తుతో ఐక్యం అయ్యాడని చూపడానికి వాడతారు.

  • నీటి బాప్తిసంతో బాటు బైబిల్ "పరిశుద్ధాత్మ లో బాప్తిసం పొంది” లేక “అగ్నితో బాప్తిసం పొంది” సంగతులను చెబుతున్నది.
  • ఈ పదం "బాప్తిసం"ను బైబిల్లో గొప్ప హింసలు పొందడాన్ని సూచించడం కోసం ఉపయోగిస్తారు.

అనువాదం సూచనలు:

  • నీటితో బాప్తిసమిచ్చేది ఎలా చెయ్యాలనే విషయంలో క్రైస్తవుల్లో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. బహుశా ఈ పదాన్ని నీటిని రకరకాలుగా ఉపయోగించే పద్ధతులు కలిసి వచ్చేలా అనువదించడం మంచిది.
  • సందర్భాన్ని బట్టి, "బాప్తిసమిచ్చు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "శుద్ధి చేయు,""నీరు పోసి""నీటిలో ముంచి,""కడిగి,” లేక “ఆత్మ సంబంధంగా శుద్ధి చేసి." ఉదాహరణకు, "నీకు నీటితో బాప్తిసమిచ్చుచున్నాను"అనే మాటను “నిన్ను నీటిలో ముంచుతున్నాను” అని అనువదించడం చెయ్యవచ్చు.
  • “బాప్తిసం "అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "శుధ్ధీకరణ,""నీరు పోయడం," "ముంచడం," "కడగడం,” లేక “ఆత్మ సంబంధమైన కడిగే పని” “కడుగు."
  • ఇది హింసల గురించి చెప్పే సందర్భం అయితే, "బాప్తిసం"అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తీవ్రమైన హింసలు ఎదురైన సమయం” లేక “తీవ్రమైన హింసల ద్వారా శుద్ధి."
  • బైబిల్ అనువాదంలో స్థానిక లేక జాతీయ భాషలో ఈ పదాన్ని అనువదించడం ఎలానో ఆలోచించండి.

(చూడండి: [అవ్యక్తాలను అనువదించడం ఎలా])

(చూడండి:John (the Baptist), repent, Holy Spirit)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __24:3__యోహాను సందేశం ప్రజలు విన్నారు, వారిలో అనేక మంది వారి పాపాల విషయం పశ్చాత్తాప పడ్డారు. యోహాను వారికి బాప్తిస్మమిచ్చాడు. అనేక మత నాయకులు కూడా యోహనుతో బాప్తిస్మం పొందాలని వచ్చారు. అయితే వారు తమ పాపాల విషయం పశ్చాత్తాప పడలేదు, ఒప్పుకోలేదు.
  • __24:6__మరుసటి రోజు, యేసు యోహాను చేత బాప్తిస్మం పొందాలని వచ్చాడు.
  • __24:7__యోహాను యేసుతో ఇలా చెప్పాడు. "నీకు బాప్తిస్మం ఇవ్వడానికి నేను తగిన వాడిని కాదు. నీవే నాకు బాప్తిస్మం ఇవ్వాలి."
  • __42:10__కాబట్టి వెళ్ళండి ప్రజలందరినీ శిష్యులుగా చెయ్యండి. వారికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరున బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటికీ లోబడాలని బోధించండి."
  • __43:11__పేతురు వారికి ఇలా జవాబిచ్చాడు, "మీలో ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడి యేసు క్రీస్తు పేరున బాప్తిస్మం పొందాలి. ఆ విధంగా దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు.”
  • __43:12__పేతురు చెప్పగా సుమారు 3,000మది ప్రజలు విశ్వసించారు. యేసు శిష్యులు అయ్యారు. వారు బాప్తిస్మం పొంది యెరూషలేము సంఘంలో చేరారు.
  • __45:11__ఫిలిప్పు ఇతియోపీయుడు ప్రయాణిస్తూ నీరు ఉన్న చోటికి వచ్చారు. ఇతియోపీయుడు చెప్పాడు, "ఇదిగో! నీరు ఉంది! నేను బాప్తిస్మం పొందవచ్చా?"
  • __46:5__సౌలుకు తక్షణమే మరలా చూపు వచ్చింది. అననియ అతనికి బాప్తిస్మం ఇచ్చాడు.
  • __49:14__యేసు నిన్ను కూడా తనను విశ్వసించి బాప్తిస్మం పొందమని పిలుస్తున్నాడు.

పదం సమాచారం:

  • Strongs: G09070