te_tw/bible/kt/glory.md

9.6 KiB
Raw Permalink Blame History

మహిమ, మహిమగల, మహిమ పరచు

నిర్వచనం:

"మహిమ" అనే పదం విలువ, యోగ్యత, ప్రాముఖ్యత, ఘనత, తేజస్సు లేదా మహాత్త్యం అంశాల కుటుంబానికి చెందిన సాధారణ పదం. "మహిమపరచడం" అంటే ఏదైనా ఒకదానికి లేదా ఒక వ్యక్తికి మహిమను ఆపాదించడం లేదా ఏదైనా ఒక వస్తువు ఎంత మహిమగలదో లేదా ఎవరైనా ఒకవ్యక్తి ఎంత మహిమ గలవారో చూపించడం లేదా చెప్పడం.

  • బైబిలులో "మహిమ"అనే పదం ప్రత్యేకించి దేవుణ్ణి వర్ణించడానికి ఉపయోగించబడింది, ఆయన లోకంలో ఏ ఒక్కరికంటె లేదా ఏ ఒక్క వస్తువు కంటే అధికమైన విలువ,, అధికమైన యోగ్యత, అధికమైన ప్రాముఖ్యత, అధికమైన ఘనత, అధికమైన తేజస్సు, అధికమైన మహాత్త్యం గలవాడు. ఆయన దైవస్వభావం గురించిన ప్రతీది ఆయన మహిమను బయలుపరుస్తుంది.
  • దేవుడు చేసిన అద్భుత కార్యాలను గురించి చెప్పడం ద్వారా మనుష్యులు దేవుణ్ణి మహిమపరచవచ్చు. దేవుని దైవ స్వభావం ప్రకారం జీవించడం ద్వారా వారు దేవుణ్ణి మహిమ పరచవచ్చు. ఎందుకంటే ఆవిధంగా చెయ్యడం ఇతరులకు ఆయన విలువ, యోగ్యత, ప్రాముఖ్యత, ఘనత, తేజస్సు, మహాత్త్యం లను చూపిస్తుంది.
  • "ఏదైనా ఒక దానిలో మహిమ" అనే వ్యక్తీకరణకు ఏదైనా ఒకదానిలో అతిశయపడడం లేదా గర్వపడడం అని అర్థం.

పాత నిబంధన

  • పాత నిబంధనలో "యెహోవా మహిమ" అనే నిర్దిష్ట పదబంధం సాధారణంగా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో యెహోవా సన్నిధి విషయంలో గ్రాహ్యంకాగల ప్రత్యక్షతను సూచిస్తుంది.

క్రొత్త నిబంధన

  • తండ్రి అయిన దేవుడు యేసు యెంత మహిమ గలవాడో మనుష్యులకు సంపూర్తిగా వెల్లడి చెయ్యడం ద్వారా కుమారుడైన దేవుణ్ణి మహిమపరుస్తాడు.
  • క్రీస్తులో విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరూ ఆయనతో మహిమ పరచబడతారు. "మహిమపరచబడడం" అనే పదం ఉపయోగించటం వలన విశిష్టమైన అర్థాన్ని తీసుకువస్తుంది. అంటే క్రీస్తులో విశ్వాసం ఉంచిన మనుష్యులు సజీవులుగా లేపబడతారు, ఆయన పునరుత్థానం తరువాత ప్రత్యక్షం అయినప్పుడు శారీరకంగా మార్పు చెంది యేసు వలే మార్పు చెందుతారు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, "మహిమ" అనే పదం "తేజస్సు" లేదా "మహాత్త్యం" లేదా "అద్భుతమైన గొప్పతనం" లేదా "అత్యంత ఉన్నతమైన విలువ" లాంటి ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • "మహిమగల" పదం "సంపూర్ణ మహిమ" లేదా "అత్యంత ఉన్నతమైన విలువగలది" లేదా "ప్రకాశమానంగా వెలుగుతున్నది " లేదా "అద్భుతమైన మహాత్త్యం" అని అనువదించబడవచ్చు.
  • “దేవునికి మహిమ చెల్లించు" అనే వ్యక్తీకరణ "దేవుని గొప్పతనాన్ని ఘనపరచు" లేదా ఆయన తేజస్సును బట్టి దేవుణ్ణి స్తుతించు" లేదా దేవుడు యెంత గొప్పవాడో ఇతరులకు చెప్పు" అని అనువదించవచ్చు.
  • "మహిమ" అనే పదం "స్తుతి” లేదా "గర్వపడు" లేదా “అతిశయ పడు.” లేదా "సంతోషించు" అని అనువదించబడవచ్చు.
  • "మహిమ పరచు" పదం "మహిమ ఇవ్వు” లేదా “మహిమ తీసుకురా" లేదా “గొప్పగా కనిపింప చెయ్యి" అని కూడా అనువదించబడవచ్చు.
  • "దేవుణ్ణి మహిమ పరచు" అనే పదబంధం "దేవుణ్ణి స్తుతించు" లేదా "దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడు" లేదా దేవుడు యెంత గొప్పవాడో చూపించు" లేదా "దేవుణ్ణి ఘనపరచు" (ఆయనకు విధేయత చూపించడం ద్వారా)" అని కూడా అనువదించబడవచ్చు.
  • "మహిమపరచబడుట" అనే పదం "చాలా గొప్పగా చూపించబడింది" లేదా "స్తుతించబడింది" లేదా "హెచ్చించబడింది" అని కూడా అనువదించబడవచ్చు.

(చూడండి : honor, majesty, exalt, obey, praise)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 23:7 వెంటనే, పరలోకం దేవదూతలతో నిండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, పరలోకంలో దేవునికి మహిమ మరియు భూమి మీద ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం!"
  • 25:6 తరువాత సాతాను యేసుకు అన్ని లోక రాజ్యాలన్నటినీ, వాటి మహిమ అంతటినీ చూపించాడు. ఇలా చెప్పాడు, "నీవు నాకు మ్రొక్కి నన్ను ఆరాధించినట్లయితే వీటన్నిటినీ నేను నీకు ఇస్తాను."
  • 37:1 యేసు ఆ వార్త వినినప్పుడు "ఈ వ్యాధి ముగింపు మరణం కాదు, అయితే ఇది దేవుని మహిమ కోసమే" అని చెప్పాడు.
  • 37:8 యేసు ఇలా జవాబిచ్చాడు, "నీవు నాలో విశ్వాసం ఉంచినట్లయితే దేవుని మహిమ ను చూస్తావని నీతో చెప్పలేదా?"

పదం సమాచారం:

  • Strongs: H0117, H0142, H0155, H0215, H1342, H1921, H1926, H1935, H1984, H3367, H3513, H3519, H3520, H6286, H6643, H7623, H8597, G13910, G13920, G17400, G17410, G27440, G48880